Jowar Upma:ఆరోగ్యకరమైన జొన్నరవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలి

Jowar Upma:ఆరోగ్యకరమైన జొన్నరవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలి

 

Jowar Upma:మనకు సమృద్ధిగా లభించే చిన్న ధాన్యాలలో జొన్న ఒకటి. ఆహారంలో జొన్నలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అందరికీ తెలుసు.జొన్న‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు రక్త ప్రసరణను పెంచుతుంది. ఎముకలను దృఢంగా మార్చడంలో జొన్నలు సహకరిస్తాయి. అదనంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

 

రొట్టె సాధారణంగా జొన్న పిండితో తయారు చేయబడుతుంది. రొట్టెతో పాటు, మీరు జొన్నను ఉపయోగించి ఉప్మా కూడా చేయవచ్చును . జొన్న రవ్వ ఉప్మా రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పోషక విలువలున్న ఈ జొన్న రవ్వ ఉప్మా తయారీకి సంబంధించిన వివరాలను మరియు తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి తెలుసుకుందాము .

 

 

Jowar Upma:ఆరోగ్యకరమైన జొన్నరవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలి

జొన్నరవ్వ ఉప్మా తయారీకి అవసరమైన పదార్థాలు :-

Read More  Bobbarlu :బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం ఇలా చేసి తిన్నచో చాలా లాభాలు కలుగుతాయి

జొన్నలు – 1 కప్పు
నూనె – 1 టేబుల్ స్పూన్
శ‌న‌గ ప‌ప్పు – ఒక టీస్పూన్
మినప పప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ఆవాలు- అర టీస్పూన్
తరిగిన ఉల్లిపాయలు – ఒకటి
తరిగిన పచ్చిమిర్చి – 2
తరిగిన అల్లం ముక్కలు – ఒక టీస్పూన్
కరివేపాకు ఒక రెబ్బ
చిన్న‌గా త‌రిగిన బంగాళా దుంప – 1
త‌రిగిన క్యారెట్ – ఒక‌టి
త‌రిగిన ట‌మాటా – 1
ఉప్పు – రుచికి స‌రిప‌డా
నీళ్లు – మూడున్న‌ర క‌ప్పులు.

Jowar Upma:ఆరోగ్యకరమైన జొన్నరవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలి

జొన్నరవ్వ ఉప్మా తయారీ చేసే విధానం:-

ముందుగా ఒక గిన్నెలో జొన్నలను తీసుకొని బాగా కడగాలి. తరువాత దానిలో తగినంత నీటిని పోసి 7-8 గంటల వరకు రాత్రిపూట నానబెట్టాలి .ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నెను పెట్టుకోవాలి.ఆ గిన్నె వేడి అయిన తరువాత దానిలో నూనె పోసి వేడిచేయాలి.ఆ నూనె కాగిన తర్వాత శ‌న‌గ ప‌ప్పు,జీలకర్ర,మినప పప్పుఆవాలు వేసి వేయించాలి. అలా వేయించిన వాటిలో తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు మరియు కరివేపాకును వేసి బాగా ఉడికించాలి.

Read More  Pudina Karam Podi :అత్యంత రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పుదీనా కారం పొడి

ఇప్పుడు ఆమిశ్రమంలో తరిగిన క్యారెట్, బంగాళాదుంప మరియు టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి వాటికీ సరిపడా ఉప్పు మరియు నీరు పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన జొన్న ర‌వ్వ‌ను వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి.ఇప్పుడు జొన్న ర‌వ్వ‌ పూర్తిగా ఉడికి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా జొన్నలతో చేసిన రుచికరమైన ఉప్మా తయారు చేయడం సాధ్యమవుతుంది. సాధారణ ఉప్మా కంటే ఈ ఉప్మా కొద్దిగా జిగటగా ఉంటుంది. జొన్నలతో ఇలాగే చేసి తింటే ఆరోగ్యం మరియు రుచి వస్తుంది.

జొన్నలను మన ఆహారంలో అంతర్భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నలు బరువు తగ్గడానికి మరియు బిపి మరియు డయాబెటిస్‌ను నిర్వహించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జొన్నలను మీ రోజువారీ ఆహారంలో చేర్చినట్లయితే, అది శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు శరీరం మరింత దృఢంగా తయారవుతుంది. శరీరంలోని వేడిని తగ్గించడంలో జొన్నలు సహకరిస్తాయి. జొన్న వివిధ రకాల క్యాన్సర్లతో పోరాడటానికి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Read More  Panasapottu Kura: ప‌న‌సపొట్టుతో కూర‌ను చేసుకుని తింటే బోలెడ‌న్ని లాభాలు
Sharing Is Caring: