Drumstick Flowers:రుచికరమైన మున‌గ పువ్వుప‌ప్పుకూర ఇలా వండుకోవచ్చును

Drumstick Flowers:రుచికరమైన మున‌గ పువ్వుప‌ప్పుకూర ఇలా వండుకోవచ్చును

 

Drumstick Flowers : ఆహారంగా ఉపయోగించడమే కాకుండా, అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో మునగ కూడా ఒకటి. మునగ చెట్టు గురించి అందరికీ తెలిసిందే. ఇందులోని ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మునగాకు రసం శరీరంలోని పునరుత్పత్తి అవయవాలపై టానిక్ లా పనిచేస్తుంది. అనేక రకాల మగ వంధ్యత్వ సమస్యలను తగ్గించడంలో మునగ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మునక్కాయలను చారు, సాంబారు తయారీలో ఉపయోగిస్తారు. మున‌గాకుతో కారాన్ని చేసుకుని తింటూ ఉంటాం. వంట‌ల్లో కూడా మున‌గాకును ఉప‌యోగిస్తూ ఉంటారు. మున‌గాకు, మున‌క్కాయ‌లే కాకుండా మున‌గ చెట్టు పువ్వులు కూడా అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ప‌ప్పుగా చేసుకుని తిన‌వ‌చ్చు. మున‌గ పువ్వుతో ప‌ప్పును చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మున‌గ పువ్వుతో ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read More  Putnala Pappu Laddu:రుచికరమైన పుట్నాల ప‌ప్పు ల‌డ్డూలు శరీరానికి ఎంతో బ‌లం

Drumstick Flowers:రుచికరమైన మున‌గ పువ్వుప‌ప్పుకూర ఇలా వండుకోవచ్చును

మున‌గ పువ్వు ప‌ప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు :-

మున‌గ పువ్వు- ఒక కప్పు
పెసర ప‌ప్పు -ఒక కప్పు
నూనె -సరిపడ
మిన‌ప ప‌ప్పు-1/2 టీ స్పూన్
జీల‌క‌ర్ర‌-1/4 టీ స్పూన్
ఆవాలు-1/4 టీ స్పూన్
సన్నగా తరిగిన -ఉల్లిపాయ ముక్క‌లు
ప‌సుపు-1/4 టీ స్పూన్
కారం పొడి-1/2 టీ స్పూన్
వెల్లుల్లి పాయలు -2
ఇంగువ- కొద్దిగా
క‌రివేపాకు-ఒక రెమ్మ
కొత్తిమీర‌-కొద్దిగా
ఉప్పు -రుచుకి తగినంత

Drumstick Flowers:రుచికరమైన మున‌గ పువ్వుప‌ప్పుకూర ఇలా వండుకోవచ్చును

మున‌గ పువ్వు ప‌ప్పుకూర తయారు చేసే విధానము:-

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్క‌ర్ పెట్టుకోవాలి. కుక్క‌ర్ వేడి అయిన తరువాత నూనె పోసుకోవాలి. నూనె కాగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ఆవాలు, క‌రివేపాకు, మిన‌ప ప‌ప్పు, ఇంగువ వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, క‌చ్చా ప‌చ్చ‌గా చేసిన వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ మిశ్రమానికి ప‌సుపు, త‌గినంత కారం పొడిని వేసుకోవాలి. తరువాత శుభ్రంగా క‌డిగి ఉంచుకున్న మున‌గాకును, మున‌గ పువ్వుల‌ను, త‌గినంత ఉప్పును వేసి క‌ల‌పుకోవాలి . ఇవి పూర్తిగా ఉడికిన త‌రువాత క‌డిగిన పెస‌ర‌పప్పును వేసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి. చివ‌ర్లో కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మున‌గ పువ్వు ప‌ప్పు కూర త‌యార‌వుతుంది.అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో తింటే మున‌గ పువ్వు ప‌ప్పు కూర రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చును .

Read More  Kakarakaya Fry: కాకరకాయ వేపుడు చేదు లేకుండా రుచిగా చేయండి

మున‌గ‌పువ్వుతో కూర‌ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. జీర్ణ క్రియ మెరుగుప‌డుతుంది. బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధులు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

Sharing Is Caring: