Tomato Soup: వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా ఉండే టొమాటో సూప్‌ని తయారు చేసి తీసుకోండి
Tomato Soup: టొమాటో సూప్ బయట చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఉండే టొమాటో సూప్ మనసుకు చాలా ఓదార్పునిస్తుంది. ఇది చాలా రుచికరమైనది. వంటగదిలో టమోటా సూప్ సిద్ధం చేయడం చాలా సులభం, ఇది చాలా రెస్టారెంట్లలో చూడవచ్చును.ఇంట్లో టమాటా సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టొమాటో సూప్ చేయడానికి కావలసిన పదార్థాలు:-
టమోటాలు పెద్ద ముక్కలుగా తరిగినవి-4
వెన్న- ఒక టేబుల్ స్పూన్,
దాల్చిన చెక్క – ఒక అంగుళం,
బిర్యానీ ఆకు – 1
వెల్లుల్లి రెబ్బలు- 4
కారం- పావు టీస్పూన్
అల్లం ముక్కలు – ఒక టీస్పూన్
తరిగిన ఉల్లిపాయ – 1
నీరు – రెండున్నర కప్పులు
రెడ్ ఫుడ్ కలర్ -చిటికెడు
పంచదార – ఒకటిన్నర టీ స్పూన్
ఉప్పు-తగినంత
వెనిగర్ – 1 టీస్పూన్
గ్రీన్ చిల్లీ సాస్- ఒక టీస్పూన్
రెడ్ చిల్లీ సాస్ – 1 టీస్పూన్
టొమాటో సాస్-1 టేబుల్ స్పూన్
పొడి మిరియాలు- సగం ఒక టీస్పూన్,
మొక్కజొన్న పిండి -1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా .
Tomato Soup: వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా ఉండే టొమాటో సూప్‌ని తయారు చేసి తీసుకోండి
టమోటా సూప్ ఎలా తయారు చేస్తారు?
ముందుగా ఒక కడాయిలో బటర్ వేసి వేడి చేయాలి. వెన్న వేడయ్యాక , బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, టమాట ముక్కలు దాల్చిన చెక్క వేసి బాగా కలపాలి. దీనిపై మూతను ఉంచి టమాట ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును తొలగించి మిగిలిన పదార్థాలను పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి చల్లగా అయిన తరువాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత అర కప్పు నీళ్లను పోసి మరలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని జల్లిగంటె సహాయంతో వడకట్టుకుని ఒక కడాయిలోకి తీసుకోవాలి. తరువాత టమాట మిశ్రమంలో కొద్ది నీళ్లను పోసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. మరికొద్ది సేపు దీనిని మరిగించి కొత్తిమీర, కార్న్ ఫ్లోర్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని మరుగుతున్న టమాట సూప్ లో వేసి బాగా కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
టమోటా చల్లగా అయ్యే కొద్దీ చిక్కగా తయారవుతుంది. కనుక కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా అచ్చం బయట లభించే టమాట సూప్లాగా తయారవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా టమాట సూప్ ను తయారు చేసుకుని తీసుకోవచ్చును .