ఉగాది పచ్చడి తయారీ విధానం అవసరమై పదార్ధాలు

 ఉగాది పచ్చడి తయారీ విధానం అవసరమై పదార్ధాలు

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం   పాడ్యమి తిథినాడు  ఉగాది పండుగ ను జరుపు కుంటారు. ఈ రోజున  “ఉగాది పచ్చడి” ప్రత్యేకమైంది.   ఉగాది పచ్చడి  షడ్రుచుల సమ్మేళనం – వగరు, పులుపు, కారం, ఉప్పు,తీపి, చేదు అనే   రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ముఖ్యమైన ది . సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను దూరం కావాలనే  సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు మామిడి కాయలు కొన్ని    అరటి పళ్ళు రెండు , కొద్దిగా వేప పువ్వు, చింతపండుకొద్దిగా , జామకాయలురెండు , చెరకు,బెల్లం తగినంత  మొదలగునవి అవసరం ఉంటాయి . అలాంటి ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!

ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు:

 

వేపపువ్వు- తగినంతలేతది

చిన్న చెరుకు ముక్క లేదా బెల్లం కొద్దిగా

చిన్న కొబ్బరి ముక్క -1

అరటిపళ్లు- 2

చింతపండు – తగినంత

చిన్న మామిడికాయ- 1

పచ్చి మిరపకాయ లేదా కారం కొద్దిగా

ఉప్పు- తగినంత

నీళ్లు – సరిపడా

తయారీ విధానం

ముందుగా వేప పువ్వును కాడల నుంచి వేరు చేసుకోవాలి చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి కొద్ది సేపు  నానబెట్టి   తర్వాత దాన్ని గుజ్జును వేరుగా చేసుకోవాలి  . మామిడికాయలు , మిరప కాయలు, కొబ్బరి సన్నగా చిన్నగా తరుగుకోవాలి .  బెల్లము లేదా చెరుకు  రసం సిద్ధం చేసిన  తరువాత , మిగతా పండ్లను కూడా చిన్నగా  తరిగి పెట్టుకోవాలి. బెల్లం పానకం లో   చింతపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమంలో మామిడికాయ చిన్న ముక్కలు , తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి  చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అప్పుడు షడ్రుచుల ఉగాది పచ్చడి తయారైనట్టే . ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత తీసుకోవాలి . అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయాలి .