Wheat Rava Upma: ఆరోగ్యకరమైన గోధుమరవ్వ ఉప్మా తయారు చేయడం చాలా సులభం

Wheat Rava Upma: ఆరోగ్యకరమైన గోధుమరవ్వ ఉప్మా తయారు చేయడం చాలా సులభం

 

Wheat Rava Upma: మనలో చాలా మంది గోధుమ పిండితో చేసిన చపాతీలను తీసుకుంటారు. అవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు కోల్పోతారు. ఇది కొలెస్ట్రాల్ మరియు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అదనంగా, గోధుమ పిండితో చేసిన చపాతీలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే, గోధుమ‌ల‌తో ర‌వ్వ‌ను త‌యారు చేసి దాంతో ఉప్మాను చేసుకోవ‌చ్చును . ఇది చాలా రుచికరమైనది. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. గోధుమ రవ్వ తయారీ చేసే విధానాన్ని మరియు దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Wheat Rava Upma: ఆరోగ్యకరమైన గోధుమరవ్వ ఉప్మా తయారు చేయడం చాలా సులభం

 

గోధుమరవ్వ ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

గోధుమ రవ్వ – 1 కప్పు
జీలకర్ర – 1/2 టీస్పూన్ఆ
వాలు – 1/2 టీస్పూన్
పప్పులు – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు-రుచికి సరిపడా
నెయ్యి- ఒక టేబుల్ స్పూన్
తరిగిన ఉల్లిపాయలు – ఒకటి
ప‌చ్చి మిర్చి – 2,
తరిగిన టమోటాలు – 2
కరివేపాకు – ఒక రెమ్మ
తరిగిన పుదీనా – కొంచెం
తరిగిన కొత్తిమీర- కొద్దిగా
తరిగిన అల్లం ముక్కలు – కొంచెం
నూనె – 2 టేబుల్ స్పూన్లు
నీరు- 3 కప్పులు.

Read More  Korrala Annam:సుల‌భంగా కొర్రలతో అన్నము వండుకోవచ్చు

Wheat Rava Upma: ఆరోగ్యకరమైన గోధుమరవ్వ ఉప్మా తయారు చేయడం చాలా సులభం

గోధుమర‌వ్వ ఉప్మా తయారుచేసే విధానం:-

మొదటగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేయాలి . అలా వేడి అయిన కడాయిలో నెయ్యిని ఒక స్పూన్ వేసి కాగాక చిన్న మంట‌పై గోధుమ ర‌వ్వను దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌డాయిలో ఒక స్పూన్ నూనె వేసి కాగాక ప‌ల్లీలు, జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత త‌రిగిన అల్లం, ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి బాగా వేయించుకోవాలి.

 

ఇవి కూడా వేగాక ట‌మాట ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోని ఇప్పుడు దానిలో నీళ్లు, రుచికి స‌రిప‌డా ఉప్పు, త‌రిగిన కొత్తిమీర‌, పుదీనా వేసి క‌లిపి బాగా మ‌రగబెట్టాలి. ఇలా నీరు పూర్తిగా మ‌రిగిన త‌రువాత వేయించి పెట్టుకున్న గోదుమ‌ ర‌వ్వ‌ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ‌లు క‌ట్ట‌కుండా ఒక గంటెతో కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ ర‌వ్వ పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈవిధముగా ఎంతో రుచిగా, పొడి పొడిగా ఉండే గోధుమ ర‌వ్వ ఉప్మా త‌యార‌వుతుంది. దీనిని ట‌మాట చ‌ట్నీ మరియు పుట్నాల కారంతో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Read More  Pudina Karam Podi :అత్యంత రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పుదీనా కారం పొడి
Sharing Is Caring: