శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం

_*?అయ్యప్ప చరితం – 69 వ అధ్యాయం?*_
?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
ఆభరణాలున్న పెట్టెలు తీసుకుని శరంగుత్తి చేరుకునే సమయానికి ఆలయ ప్రధాన పూజారి , ఆలయ నిర్వాహకులు కొందరు కలిసి వాళ్ళకు మేళతాళాలతో స్వాగతం పలికి పెట్టెలను భక్తిపూర్వకంగా అందుకుని గుడిని చేరుకుంటారు ! తెర వేసి ప్రధాన తంత్రి (మేల్‌శాంతి) ఆభరణాలను స్వామి విగ్రహానికి అలంకరిస్తారు ! తెర తీసాక ఆభరణాలతో దివ్యంగా వెలుగుతూ దర్శనమిస్తుంది స్వామి విగ్రహం.
శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం

 

*కాంతిమలలో జ్యోతి దర్శనం*
మకర సంక్రాంతినాడు సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించుతాడు ! ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమౌతుంది ! ఈ మహిమాన్వితమైన రోజున అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో దర్శనమివ్వడం భక్తులపై స్వామి అనుగ్రహానికి నిదర్శనం ! పందలరాజుకిచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఈ రోజున స్వామి జ్యోతిరూపంలో శబరిమలకు ఎదురుగా వున్న కాంతిమల మీద జ్యోతిగా సాక్షాత్కరిస్తాడు !
*కాంతిమల ప్రాముఖ్యం*
ఆభరణాలు అలంకరించి , పూజాదికాలు జరిపి , ప్రదోషకాలంలో శబరిమల మీద స్వామికి హారతి ఇస్తారు ! ఆ సమయంలోనే ఎదురుగా దూరాన వున్న కాంతిమల మీద జ్యోతిగా దర్శనమిస్తాడు మన అయ్యప్పస్వామి ! ఒక్క క్షణం మెరిసి మాయమైపోతూ కొన్ని క్షణాల పాటు జ్యోతి కనబడుతూ ఉంటుంది. ఉత్తరా నక్షత్రం (స్వామి జన్మ నక్షత్రం) కూడా ఆకాశంలో కనిపిస్తుంది ! జ్యోతిని దర్శించి *‘స్వామియే శరణం అయ్యప్ప’* అంటూ భక్తులు చేసే శరణుఘోషతో శబరిమల ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తూ వుంటుంది!
*కాంతిమలమీద జ్యోతి కనిపించడానికి కారణం:*
కాంతిమలలో ఆ ప్రాంతాన్ని పొన్నాంబలమేడు అంటారు ! మహిషిని సంహరించడానికి స్వామి అరణ్యంలోకి వచ్చినపుడు ఇంద్రుడు స్వామి కోసం ఈ ప్రాంతంలో బంగారు ఆలయం నిర్మించి పద్ధెనిమిది మంది దేవతలను మెట్లుగా అమర్చి , వాటిమీదుగా ఎక్కి వచ్చి స్వామి కూర్చోవడానికి జ్ఞానపీఠాన్ని ఏర్పరుస్తాడు ! దానిమీద చిన్ముద్ర , అభయ ముద్రలతో , పట్టబంధం తో ఆసీనుడై దేవతల పూజలు స్వీకరిస్తాడు స్వామి !  దేవతల ప్రార్థనతో రోజూ ఆ ఆలయంలో వారి పూజాదికాలు స్వీకరించసాగాడు ! ఉదయాస్తమయాలలో హారతి ఇచ్చి ధన్యులు కాసాగారు దేవతలు ! ఈ ఆలయం మానవుల కళ్లకు కనిపించదు ! కానీ అటువంటి ఆలయం మానవులకోసం వెలవాలన్న సంకల్పంతో స్వామి పందలరాజుకు స్వప్నంలో ఈ ఆలయాన్ని చూపి అదే విధంగా శబరిమల మీద దేవశిల్పి , పరశురాములవారి సహాయంతో నిర్మింపజేస్తాడు అయ్యప్ప ! అక్కడా విగ్రహ రూపంలో పూజింపబడుతున్నాడు ! శబరిమల మీద వున్న ఆలయంలో మానవుల చేత విగ్రహ రూపంలో , కాంతిమల మీద ప్రత్యక్షంగా దేవతల చేత ఆరాధింపబడుతున్నాడు !  దేవతలకు ఒక్క రోజు భూలోకంలో ఒక్క సంవత్సరానికి సమానం ! అందుకే ప్రతి ఏటా మకర సంక్రమణం రోజు దేవతలు సాయంకాలం  హారతి ఇస్తున్న సమయంలో భూలోకవాసులకు జ్యోతి రూపంలో దర్శనమివ్వడం జరుగుతున్నది ! ఆ జ్యోతిని దర్శించి , శబరిమలమీద ఆలయంలో హారతి కళ్లకద్దుకుని జన్మలు ధన్యం కావించుకుంటారు భక్తజన సందోహం !
మకర విళక్కు ఉత్సవం
మకరజ్యోతిని దర్శించిన తర్వాత ఆ రాత్రి శబరిగిరిలో జరిగే ప్రధాన ఉత్సవం మకర విళక్కు ఉత్సవాన్ని చూడటానికి ఉత్సాహంతో ఎదురుచూస్తారు భక్తులు !
ఆ రాత్రి మాళికాపురత్తమ్మ ఆలయంనుండి అమ్మవారి పట్టపుటేనుగు మీద దీపాన్ని వెలిగించి ఉత్సవంగా ముందర ఆలయానికి ప్రదక్షిణలు చేయించి శరంగుత్తి వరకు కోలాహలంగా తీసుకువెళుతారు ! భక్తులందరూ భజనలు చేస్తూ ఏనుగు వెంట వెళతారు ! ఏనుగు శరంగుత్తి దగ్గర కన్నీస్వాములు గ్రుచ్చిన శరాలను గుర్తించి , ఏనుగు తిరిగి అమ్మవారి గుడిని చేరి ఆ వార్తను విన్నవించడం జరుగుతుంది ! ఈ ఉత్సవం నిర్వహించడంలో వావరు వంశీయులు ఆయుధాలు పట్టుకుని వెంటవెళుతూ ఏ అడ్డంకులూ రాకుండా చూస్తారు !
మకరజ్యోతి దర్శనం తర్వాత ఈ మకర విళక్కును దర్శించడంవల్ల యాత్ర పూర్ణ ఫలం లభిస్తుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసం !
తిరుగు ప్రయాణం
శబరిమలను మర్నాడు ప్రొద్దుననే దిగటం ప్రారంభించి పంబానదిని చేరి నీటిలో స్నానం ఆచరిస్తారు భక్తులందరూ ! పాపవినాశిని అయిన పంబాస్నానంతో పునీతులై , అనంతమైన పుణ్యఫలాన్ని పొంది , యాత్ర సఫలమైందన్న తృప్తితో స్వస్థానాలకు బయలుదేరుతారు .
???????????

Sabarimala Ayyappa Swamy

Read More  అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం...* Do you know who is Ayyappa Swamy's vahanam Leopard?
Sharing Is Caring:

Leave a Comment