Masala Dal:రుచికరమైన మరియు పోషకమైన మ‌సాలా దాల్‌ ఇలా చేసుకొండి

Masala Dal :రుచికరమైన మరియు పోషకమైన మ‌సాలా దాల్‌ ఇలా చేసుకొండి

Masala Dal: సాధార‌ణంగా మ‌నం కందిప‌ప్పు మరియు పెస‌ర‌ప‌ప్పు వంటి వాటిని వేర్వేరుగా వండుకుని తింటాం.మినప పప్పు దోశలు, ఇడ్లీలు మరియు గారెలకు ఉపయోగిస్తారు. అలాగే మ‌న‌కు ఎర్ర కందిప‌ప్పు కూడా ల‌భిస్తుంది.

దీంతోనూ ప‌ప్పు మరియు చారు వంటివి త‌యారు చేకుంటాము . అయితే ఈ ప‌ప్పులు అన్నింటినీ క‌లిపి మసాలా పప్పును త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచికరమైనది. దీన్ని అన్నం లేదా చ‌పాతీల‌తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక మ‌సాలా దాల్‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌ము . దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Masala Dal:రుచికరమైన మరియు పోషకమైన మ‌సాలా దాల్‌ ఇలా చేసుకొండి

మసాలా దాల్ తయారీకి కావలసిన పదార్థాలు:-

పెసర పప్పు ఎర్ర కందిపప్పు, మినప మరియు కందిపప్పు ఒక్కొక్కటి ఒక కప్పు మోతాదులో
ఉప్పు- తగినంత
నెయ్యి- ఒక టేబుల్ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు
టొమాటో ముక్కలు- 1/2 కప్పు
కొత్తిమీర- ఒక కట్ట.

 

మసాలాకు కావలసిన పదార్థాలు:-

వెల్లుల్లి రెబ్బలు- మూడు
ధ‌నియాలు – 1 టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
దాల్చిన చెక్క – పావు టీస్పూన్
ఎండు మిరపకాయలు- నాలుగు
అల్లం-చిన్న ముక్క
లవంగాలు- రెండు
మిరియాలు- 1/2 టీస్పూన్.

Masala Dal :రుచికరమైన మరియు పోషకమైన మ‌సాలా దాల్‌ ఇలా చేసుకొండి

మసాలా దాల్ తయారు చేసే విధానం :

పప్పులన్నీ శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల నీళ్లతో ఒక కుక్కర్ లో వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్త‌గా ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నెయ్యి వేయాలి అది వేడిగా ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. తరువాత, టొమాటో ముక్కలను వేయించి, కొద్దిగా నీరు చిలకరించాలి.ట‌మాటా ముక్క‌లు ఉడుకుతున్న‌ప్పుడు త‌గినంత ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న మ‌సాలా వేసి బాగా క‌లిపి ఉడికించుకున్న ప‌ప్పు కూడా వేయాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన మసాలా పప్పు తయారవుతుంది . ఇది చపాతీ ,అన్నం లేదా రోటీ, పుల్కా మొదలైన వాటితో చాలా బాగుంది. దీని వ‌ల్ల అన్ని ర‌కాల ప‌ప్పుల్లో ఉండే ప్రోటీన్ల‌ను, ఇత‌ర పోష‌కాల‌ను సులభంగా పొంద‌వ‌చ్చును.

Originally posted 2022-10-21 11:05:20.