Kakarakaya Fry: కాకరకాయ వేపుడు చేదు లేకుండా రుచిగా చేయండి

Kakarakaya Fry: కాకరకాయ వేపుడు చేదు లేకుండా రుచిగా చేయండి

Kakarakaya Fry: కాకరకాయను చేదుగా చెబుతారు. అయితే, కాకరకాయను ఆహారంగా తినడం ద్వారా శరీరానికి కావలసినవన్నీ అందిస్తుంది. కాకరకాయలో శరీరానికి అవసరమైన అన్ని కీలక పోషకాలు ఉన్నాయి. కాక‌ర రసాన్ని తినే వారు కూడా ఉన్నారు. కాకరకాయ వేపుడు తో పాటు కాకరకాయతో రకరకాల వంటకాలు వండుకుంటాం. కాకరకాయ వేపుడు రుచిగా ఉంటుంది. చేదు లేకుండా రుచికరమైన కాకరకాయ వేపుడును ఎలా చేయాలి.దానిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Kakarakaya Fry: కాకరకాయ వేపుడు చేదు లేకుండా రుచిగా చేయండి

కాక‌రకాయ వెల్లుల్లి కారం వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:-

కాక‌ర కాయ‌లు – అర కిలో
ప‌సుపు – ఒక టీ స్పూన్
నిమ్మ ర‌సం – ఒక టీ స్పూన్
నూనె – కొద్దిగా
ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – రెండు టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి పాయ – 1
ఎండు మిర్చి – 8
ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్
జీల‌క‌ర్ర – ఒకటిన్న‌ర‌ టీ స్పూన్.
ఉప్పు – రుచికి స‌రిప‌డా

Read More  Putnala Pappu Laddu:రుచికరమైన పుట్నాల ప‌ప్పు ల‌డ్డూలు శరీరానికి ఎంతో బ‌లం

 

తాలింపుకు కావలసిన పదార్థాలు:-
మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్
శనగపప్పు ఒక టీస్పూన్
ఆవాలు-అర టీస్పూన్
ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్
క‌రివేపాకు – ఒక రెబ్బ‌
ప‌సుపు – పావు టీ స్పూన్
ఎండు మిర్చి – 2
నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Kakarakaya Fry: కాకరకాయ వేపుడు చేదు లేకుండా రుచిగా చేయండి

కాక‌రకాయ వెల్లుల్లి కారం వేపుడు త‌యారీ చేసే విధానము:-

ముందుగా కాక‌రకాయ‌ల‌ను తీసుకొని శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా చేయాలి. త‌రువాత వాటిని గుండ్రంగా త‌రిగి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాక‌రకాయ ముక్కల‌కు పసుపు, కొంచెం ఉప్పు నిమ్మ ర‌సం వేసి చేత్తో బాగా ప‌ట్టేలా క‌లపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అలా వేడి అయిన కడాయిలో నూనె పోసి కాగాక కాక‌రకాయ ముక్క‌ల నుండి నీటిని పిండుతూ నూనెలో వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి . ఒక మిక్సీ జార్ లో ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, ధ‌నియాలు, ఎండు మిర్చి, జీల‌కర్ర, రుచికి స‌రిప‌డా మిగిలిన ఉప్పును వేసి మిక్సీ పట్టి ,దానిలో వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి.

Read More  Jaggery Coconut Laddu:ఈ లడ్డూ ఎంత ఆరోగ్యకరము ఒక్క‌టి తిన్నారోజు చాలు

ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేసి కాగాక తాళింపు ప‌దార్థాలు అన్ని వేసి తాళింపు చేయాలి. ఆ తాళింపు వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న కాక‌రకాయ ముక్క‌ల‌ను, మిక్సీ ప‌ట్టుకుని ఉంచిన వెల్లుల్లి కారాన్నివేసి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఈ విధంగా కాక‌రకాయ వెల్లుల్లి కారం వేపుడు త‌యార‌వుతుంది.దీనిని అన్నంతో క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఈ వేపుడు చాలా రోజుల వ‌ర‌కు నిల్వ చేయబడుతుంది.

ఆహారంగా కాకరకాయను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయ మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా శరీరంలోని కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాకరకాయను ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Originally posted 2022-10-27 11:52:47.

Sharing Is Caring: