Green Moong Dal Laddu:పెసలను ఉపయోగించి లడ్డూలును ఇలా తయారు చేసుకొండి

Green Moong Dal Laddu:పెసలను ఉపయోగించి లడ్డూలును ఇలా తయారు చేసుకొండి

Green Moong Dal Laddu: పెసల వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.ఇవి మ‌న‌కు చ‌లువ చేస్తాయి. అవి శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడిని తగ్గిస్తాయి. అలాగే వీటి వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. తద్వారా శక్తి లభిస్తుంది. చేపలు, మటన్ లేదా చికెన్ వంటి మాంసాహారం తీసుకోలేని వారు పెసలను తరచుగా తినడం ద్వారా విటమిన్లు మరియు ప్రోటీన్లను పొందగలుగుతారు. అందుకే పెసలను తరచుగా తినమని ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే, మీరు దీన్ని ఉపయోగించి రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసుకొని మరియు వాటిని కూడా ఆస్వాదించవచ్చు. ఇలా చేసిన లడ్డూని రోజూ ఒక్కటి తింటే చాలు.. ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పెసల నుండి లడ్డూలను ఎలా తయారుచేయాలి . వాటికి కావలసిన పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము

Read More  Carrot Laddu : ఆరోగ్యకరమైన క్యారెట్ లడ్డూ రోజుకి ఒక్కసారే తింటే చాలు

 

Green Moong Dal Laddu:పెసలను ఉపయోగించి లడ్డూలును ఇలా తయారు చేసుకొండి

పెసలను ఉపయోగించి లడ్డూలు చేయడానికి కావలసిన పదార్థాలు:-

పెసలు – పావు కప్పు
బెల్లం – పావు కప్పు
పాలపొడి- అరకప్పు
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పావు కప్పు (అన్నీ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
యాలకుల పొడి -అర టీస్పూన్నె
నెయ్యి- అర కప్పు.

Green Moong Dal Laddu:పెసలను ఉపయోగించి లడ్డూలును ఇలా తయారు చేసుకొండి

పెసలను ఉపయోగించి లడ్డూలును తయారు చేసే విధానము :-

ముందుగా స్టవ్ ఆన్ చేసి పెద్ద బాణలి పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలా వేడి అయిన దానిలో పెసలను వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. అలా వేయించిన వాటిని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లబరచుకోవాలి. ఇప్పుడు చల్లబరచిన పెసలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బిన దానిలో బెల్లం వేసి మెత్తగా పొడి చేసుకోవాలి .

అలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి . దానిలో పాలపొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తరువాత క‌రిగించిన నెయ్యి, జీడిపప్పు, బాదం, పిస్తా వేసి బాగా కలుపుకొని ల‌డ్డూల మిశ్ర‌మంలా చేయాలి. ఇది లడ్డూల మిశ్రమంలా లేకుంటే అదనపు నెయ్యిని జోడించడం ద్వారా లడ్డూ లాగా తయారవుతుంది. ఈవిధముగా ఎంతో రుచికరమైన పెసర లడ్డూలు సిద్ధమయ్యాయి. వీటిలో ఒకటి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Read More  Dates Laddu : పంచదార లేకుండా ఖర్జూరా లడ్డూలు ఇలా చేసుకోవచ్చు

 

Tags: green moong dal ladoo,moong dal ladoo in marathi,green moong dal laddu,how to make moong dal ladoo at home,green moong dal laddu with jaggery,moong dal ke ladoo,linseeds and moong dal ke laddu,how to make moong dal namkeen at home in hindi,how to make moong dal laddu,moong dal ladoo,moong dal ladoo without ghee,how to make moong dal namkeen at home,moong dal ladoo recipe,hare moong dal ke laddu,green moong dal paratha,moong dal laddu in hindi

Originally posted 2022-11-09 12:49:04.

Sharing Is Caring: