బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిది,Papaya Fruit Is Like Mother Of Health

బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిది,Papaya Fruit Is Like Mother Of Health

చాలామంది ఎక్కువగా ఇష్టపడని పండు బొప్పాయి. కానీ ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో బొప్పాయి అమ్మలాంటిది. హార్మోన్ అసమతుల్యత, PCOD లాంటి సమస్యలకి మంచి మెడిసిన్ బొప్పాయి. చాల రకాల అనారోగ్యాలను దరిచేరనివ్వదు. శరీరంలోని మలినాలను తొలగించడంలో మంచి గుణం చూపిస్తుంది. అందువల్ల వారానికి ఒకసారైనా తినడం మంచిది. ఎక్కువగా తింటే ఔషధం కూడా విషం అవుతుందన్నట్లు బొప్పాయి ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
పోషకాలు: బొప్పాయి లో కాలరీలు తక్కువ, కొవ్వుపదార్ధాలు ఎక్కువ, డైటరీ ఫైబర్ ఎక్కువ. వీటిలో విటమిన్ A, C ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు విటమిన్ B, B1, B2, D కూడా కలిగి ఉంటుంది. ఇంకా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ పోషకాలు కూడ ఉంటాయి.

బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిది,Papaya Fruit Is Like Mother Of Health

ప్రయోజనాలు:
బొప్పాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను నివారిస్తుంది.
బొప్పాయి  గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. షుగర్ ని అదుపులో ఉంచుతుంది.
బొప్పాయి  కళ్ళలో ఏర్పడే శుక్లాలను నివారిస్తుంది.
బొప్పాయి  కాన్సర్ రాకుండా చూస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయి  బరువును అదుపులో ఉంచుతుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
బొప్పాయి  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగిఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఎవరు బొప్పాయిని తీసుకోకూడదు:

డయేరియా టైం లో తీసుకోకూడదు.

ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు బొప్పాయి తీసుకోకపోవడం మంచిది.

సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వకపోవడం మంచిది.

బీపీ ఉన్నవారు , బీపీ టాబ్లెట్స్ వేసుకునేవారు దీనిని తినరాదు.

మగవారు బొప్పాయి పండు తినేటపుడు గింజలు అస్సలు తినకూడదు. ఇవి వీరిలోని వీర్యాన్ని నాశనం చేస్తాయి.

కొందరికి బొప్పాయి పండు పడదు. దద్దుర్లు వస్తాయి. అందువల్ల ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Tags:health benefits of papaya,papaya,papaya health benefits,papaya fruit benefits,health benefits of papaya fruit,papaya fruit,papaya benefits,benefits of papaya,papaya fruit health benefits,health benefits of papaya fruit and juice,health tips,healthy fruit,healthy,green papaya health benefits,papaya seeds health benefits,health benefits of papaya seeds,papaya fruit salad,fruit,healthy fruits,benefits of eating papaya,amazing health benefits of papaya