దానిమ్మ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

దానిమ్మ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు 

దానిమ్మ అనేది లెథరేసీ (Lythraceae) కుటుంబానికి చెందిన ఉప ఉష్ణమండల పండు. సాధారణంగా హిందీలో అనార్ అని కూడా  పిలుస్తారు,.  దానిమ్మపండు దాని రాసాలూరే రుచి వలన బాగా ప్రసిద్ధి పొందింది. కానీ ఈ పండు కేవలం రుచిని మాత్రమే అందించదు. దానిమ్మలో పొటాషియం, విటమిన్ సి ఎక్కువ గా ఉంటాయి. చాలా తక్కువ కేలరీలు కూడా ఉంటాయి మరియు ఫైబర్ యొక్క ఒక అద్భుతమైన వనరు. దానిమ్మపండు యొక్క తాజా రసంలో అధిక మొత్తంలో పాలిఫేనోల్స్ కూడా ఉంటాయి.  ఇది ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్, దీనిలో అంథోసయనిన్లు, ఎల్లాగిక్ యాసిడ్ మరియు టానిన్లు వంటి పాలిఫేనోల్స్ కూడా  ఉంటాయి. ఈ బయోఆక్టివ్ పదార్థాలన్నీ కలిపి దానిమ్మను పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధంగా చెప్పగల ఒక “సూపర్ ఫుడ్” గా తయారుచేసాయి.
ఇది కడుపు నొప్పి, కండ్లకలక, మోనోపాస్ వలన కలిగే వేడి ఆవిర్లు, ఆస్టియోఆర్థరైటిస్ మరియు హేమోరాయిడ్స్ వంటి సమస్యలను తగ్గించడంలో బాగా  సహాయపడుతుంది. అదనంగా, ఇది చాలా ప్రభావవంతమైన వాపు నిరోధక (యాంటీ-ఇన్ఫలమేటరి) మరియు ఇమ్యునోమోడలింగ్ (రోగనిరోధక శక్తిని పెంచే) ఏజెంట్. వాస్తవానికి, ఇది ఆరోగ్యానికి అందించే అనేక ప్రయోజనాల వలన దీనిని “అనేక విత్తనాలు కలిగిన ఆపిల్” గా కూడా  పిలుస్తారు.
దానిమ్మపండు దాని తలపై కిరీటంతో కెంపు వంటి ఎరుపు రంగులో ఉంటుంది. తేమతో కూడిన ఉష్ణమండలలో మరియు మధ్యదార ప్రాంతాలలో దానిమ్మ చెట్టు సులభంగా పెరుగుతుంది మరియు పండు సరిగా పరిపక్వం (ముగ్గడానికి) చెందటానికి ఎక్కువ కాలం పాటు ఉండే ఎండాకాలం  చాలా అవసరం. ఇది లోతైన బంక నేలలో కూడా పెరుగుతుంది.  కానీ వివిధ రకాల నేలలను కూడా తట్టుకోగలదు. ఇవి భూమి ఉత్తర భాగంలో సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మరియు దక్షిణ భాగంలో మార్చి నుండి మే నెలల వరకు అందుబాటులో ఉంటాయి. దానిమ్మపండు పండు లోపల అనేక చిన్న ముత్యాల వంటి తినదగిన విత్తనాలు ఉంటాయి.  అవి ఒక ప్రత్యేకమైన క్రంచ్ (తినేటప్పుడు కరకరమనే) ను మరియు తీపి కలిగి ఉంటాయి. స్మూతీలు, వైన్లు, కాక్టెయిల్లు, సలాడ్లు, ఆహార పదార్దాల  అలంకారాలలోనూ (గార్నిష్), కేకులు మరియు రసాలు వంటి తీపి మరియు రుచికరమైన వంటకాల్లో వీటిని  కూడా వాడతారు.
పురాతన నాగరికతలలో దానిమ్మపండు యొక్క తొక్కలతో తోలు(leather)లకు రంగు వేసే వారని  మరియు దానిమ్మపండు పూవ్వులతో ఎరుపు రంగును తయారు చేసేవారని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. దీనిని కొన్ని వర్గాల వారు పవిత్రమైన పండుగా భావించేవారు మరియు కొంతమంది గ్రీకు దేవతలకు ప్రత్యేకంగా సమర్పించేవారు. హిందూమతంలో, దానిమ్మ విత్తనాలను సమృద్దైన సంతానానికి చిహ్నంగా కూడా  భావిస్తారు. ఇది కేవలం వారి విశ్వాసం మాత్రమే కాకపోవచ్చును.  బహుశా వారికీ ఈ చిన్న గింజలు యొక్క అద్భుతాలు తెలిసి ఉండవచ్చును .
దానిమ్మ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

దానిమ్మపండు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

శాస్త్రీయ నామం: ప్యూనికా గ్రానేటం (Punica granatum)
కుటుంబం: లెథరేసీ (Lythraceae)
సాధారణ నామం: అనార్, దానిమ్మ
సంస్కృత నామం: దాడిమ్ (Dāḍimaṁ)

ఉపయోగించే భాగాలు
: బెరడు, కాండము, పండ్లు, పువ్వులు మరియు ఆకులు దానిమ్మపండు చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగకరంగా కూడా  ఉంటాయి.

స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం
: దానిమ్మపండు ఇరాన్ నుంచి ఉత్తర భారతదేశంలో హిమాలయాలకు వచ్చింది మరియు పురాతన కాలం నుండి మధ్యధరా ప్రాంతం మొత్తంలో సాగుచేయబడుతుంది. ఇది భారతదేశం అంతటా విస్తృతంగా  సాగు చేయబడుతుంది. దీనిని ఆగ్నేయ ఆసియా, ఈస్ట్ ఇండీస్, మలయా, మరియు ఉష్ణమండల ఆఫ్రికా యొక్క పొడి భాగాలలో కూడా సాగు చేస్తారు. 1769 లో, స్పానిష్ సెటిలర్లు ఈ చెట్టును కాలిఫోర్నియాలోకి ప్రవేశపెట్టారు. యునైటెడ్ స్టేట్స్ లో, ఇది ప్రధానంగా కాలిఫోర్నియా మరియు అరిజోనాలోని పొడి భాగాలలో సాగుచేయబడుతుంది . చైనా, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్తాన్, జపాన్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఆఫ్గనిస్తాన్, బర్మా మరియు సౌదీ అరేబియా దేశాలు దీనిని ప్రధానంగా సాగుచేస్తున్నారు.

ఆసక్తికరమైన నిజాలు:
రిఫ్రిజిరేటర్ లో రెండు నెలల వరకు దానిమ్మలను నిల్వ చేయవచ్చును .
దానిమ్మ చెట్లు 200 సంవత్సరాలకు పైగా నివసిస్తాయి.
  • దానిమ్మపండు పోషక వాస్తవాలు
  • దానిమ్మ ఆరోగ్య ప్రయోజనాలు
  • దానిమ్మ దుష్ప్రభావాలు
  • ఉపసంహారం

 

దానిమ్మపండు పోషక వాస్తవాలు 

ఫైబర్లు, ఖనిజాలు (మినరల్స్), విటమిన్లు మరియు బయోఆక్టివ్ సమ్మేళనాలతో దానిమ్మ పండు నిండి ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ లేదా ఎటువంటి సాచురేటెడ్ కొవ్వులు కూడా  ఉండవు. అలాగే దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు మరియు బయోఆక్టివ్ పాలిఫేనోల్స్ అధిక సాంద్రతలో ఉంటాయి. ఒక కప్పు దానిమ్మపండు గింజలు 24 గ్రాముల చక్కెర మరియు 144 కేలరీలు కలిగి ఉంటాయి.
యు.యస్.డి.ఏ (USDA) న్యూట్రిషన్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల దానిమ్మ ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉంటుంది:
పోషకాలు:100 గ్రాములకు
నీరు:77.93 గ్రా
శక్తి:83 కిలో కేలరీలు
ప్రోటీన్:1.67 గ్రా
కొవ్వులు:1.17 గ్రా
కార్బోహైడ్రేట్లు:18.70 గ్రా
ఫైబర్:4.0 గ్రా
చక్కెరలు:13.67 గ్రా
ఖనిజాలు :100 గ్రామూలకు
కాల్షియం:10 mg
ఐరన్:0.30 mg
మెగ్నీషియం:12 mg
ఫాస్ఫరస్ :36 mg
పొటాషియం:236 mg
జింక్:0.35 mg
సోడియం:3mg
విటమిన్లు :100 గ్రాములకు
విటమిన్ బి1:0.067 mg
విటమిన్ బి2:0.053 mg
విటమిన్ బి6:0.075 mg
విటమిన్ బి3:0.293 mg
విటమిన్ బి9:38 μg
విటమిన్ సి:10.2 mg
విటమిన్ ఇ:0.6 μg
విటమిన్ కె:16.4 mg
కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు:100 గ్రాములకు
అసంతృప్త:0.120 గ్రా
మోనోఅన్సాచురేటెడ్:0.093 గ్రా
పాలీఅన్సాచురేటెడ్   :0.079 గ్రా


దానిమ్మ ఆరోగ్య ప్రయోజనాలు

దానిమ్మ విటమిన్ సి కి  ఒక ఉత్తమైన వనరు.విటమిన్ సి చర్మ,రక్తనాళాల  మరియు ఎముకల ఆరోగ్యంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కాబట్టి దానిమ్మను తీసుకుంటే  చర్మం మరియు ఎముకల ఆరోగ్య మెరుగుపడుతుంది.
క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, మరియు అల్జీమర్స్ వంటి అనేక సమస్యల ప్రధాన లక్షణం.   దానిమ్మకు  వాపు నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచించాయి. దానిమ్మలో ఉండే ప్యూనిసిక్ ఆసిడ్ వాపు నిరోధక చర్యలకు బాధ్యత వహిస్తుందని కూడా తెలుస్తుంది.
దానిమ్మకు ప్రభావంతమైన రక్త చెక్కెర స్థాయిలను తగ్గించే చర్యలు ఉన్నాయి.దానిమ్మ గింజలు మరియు పువ్వులు ఈ లక్షణాలను కలిగి ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచించాయి.
దానిమ్మ ఒక అద్భుతమైన హైపోటెన్సివ్ ఏజెంట్ (రక్తపోటును తగ్గించే చర్య), తద్వారా ఇది గుండె మీద అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దానిమ్మలో ఉండే ప్యూనిసిక్ ఆసిడ్ అనే ఫ్యాటీఆసిడ్ దీనికి కారణం అని కొన్ని పరిశోధనలు తెలిపాయి.
దానిమ్మ రసం తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) యొక్క ఆక్సిడేషన్ ను కూడా నిరోధిస్తుంది, ఈ ఆక్సిడేషన్ చర్య ఎథీరోస్క్లెరోసిస్ కు ఒక ముఖ్య కారణం, తద్వారా దానిమ్మ ఎథీరోస్క్లెరోసిస్ను మరియు అలాగే గుండెను కూడా  రక్షిస్తుంది.
కాండిడా అల్బికెన్స్ అనే ఈస్ట్ పై పోరాడడంలో దానిమ్మపండు చాలా సమర్థవంతంగా ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి.  అలాగే దానిమ్మకు అనేక యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ బాక్టీరియల్ చర్యలు ఉన్నాయి.
దానిమ్మ నోటి  ఆరోగ్యానికి అవసరమైన పండు. ఇది పెరియోడోంటైటిస్ మరియు జింజివైటిస్ వంటి వ్యాధుల నుండి పంటి చిగుళ్ళను మరియు దంతాలను కూడా  రక్షిస్తుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లపై వ్యతిరేకంగా దానిమ్మ చర్యలు చూపిస్తుందని కొన్ని అధ్యాయాలను తెలిపాయి అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం

విటమిన్ సి వనరుగా దానిమ్మపండు
యాంటీ ఇన్ఫలమేటరీ ఏజెంట్ గా దానిమ్మ
మధుమేహం కోసం దానిమ్మ
రక్తపోటు కోసం దానిమ్మ
గుండెకు దానిమ్మపండు
అంగస్తంభన లోపం కోసం దానిమ్మ రసం
యాంటిమైక్రోబయాల్ గా దానిమ్మపండు
మెదడుకు దానిమ్మపండు
జాయింట్ నొప్పులు మరియు ఆర్థరైటిస్ కోసం దానిమ్మ
క్యాన్సర్ నివారణకు దానిమ్మపండు

విటమిన్ సి వనరుగా దానిమ్మపండు 

రక్త నాళాలు, చర్మం మరియు ఎముకల అభివృద్ధి మరియు నిర్వహణకు విటమిన్ సి చాలా ముఖ్యం. దానిమ్మ ఈ విటమిన్ యొక్క సహజ మూలం/వనరు. దానిమ్మ రసం మానవ శరీరానికి రోజువారీ అవసరమయ్యే విటమిన్ సిలో 40% కంటే ఎక్కువ భాగాన్ని కూడా అందిస్తుంది. కానీ ఇది పాశ్చరైజేషన్ సమయంలో విచ్ఛిన్నమైపోతుంది (తొలగిపోతుంది).  కాబట్టి ఉత్తమమైన పోషక ప్రయోజనాలను పొందడానికి ఇంట్లో తయారు చేసిన లేదా తాజా దానిమ్మపండు రసాన్ని తీసుకోవడం  చాలా మంచిది.

యాంటీ ఇన్ఫలమేటరీ ఏజెంట్ గా దానిమ్మ

దీర్ఘకాలిక వాపు క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, మరియు అల్జీమర్స్ తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముఖ్య కారణాలలో ఒకటి.
జీర్ణశయాంతర ప్రేగుల యొక్క వాపు పరిస్థితులను తగ్గించడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు కూడా  సూచిస్తున్నాయి. అదనంగా, దానిమ్మపండులో ఉండే ఎల్లాజిక్ ఆసిడ్ (ellagic acid) ఈ పండు యొక్క వాపు నిరోధక లక్షణాలకు బాధ్యత వహిస్తుందని ఈ అధ్యయనం నివేదించింది.
టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న 50 మందితో ఒక 12-వారాల అధ్యయనం నిర్వహించబడింది. ప్రతిరోజు ఒక నిర్దిష్ట మొత్తంలో దానిమ్మ రసం తీసుకోవడం వలన ఇంటర్లీకిన్ 6 మరియు ఇన్ఫలమేటరి మార్కర్ సిఆర్ పి(CRP) లను తగ్గించవచ్చని ఈ అధ్యయనం సూచించింది. మధుమేహ రోగులలో వాపు తగ్గించడానికి వారి ఆహార విధానంలో దానిమ్మను చేర్చవచ్చును .
ల్యాబ్ అధ్యయనాలు దానిమ్మపండులో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ (punicic acid), కొన్ని రొమ్ము క్యాన్సర్ కణలుకు వ్యతిరేకంగా బలమైన వాపు నిరోధక ప్రభావాన్ని చూపిందని సూచిస్తున్నాయి.

మధుమేహం కోసం దానిమ్మ

శరీరంలోని రక్త చక్కెర స్థాయిలను తగ్గించడంలో దానిమ్మలు చాలా ప్రభావవంతమైనవి. మధుమేహం మరియు హైపర్ గ్లైసీమియా (hyperglycemia) తో బాధపడుతున్న రోగులపై ముఖ్యంగా దానిమ్మ చెట్టు పువ్వులు మరియు దానిమ్మ గింజలు ప్రభావవంతంగా ఉంటాయి. రక్త చక్కెర స్థాయిలను తగ్గించడం మరియు హైపోగ్లైసెమిక్ లక్షణాలలో దానిమ్మ సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్యులు దానిమ్మ గింజలు, పువ్వులు, సారాలు మరియు రసాలపై వివిధ అధ్యయనం కూడా  చేస్తున్నారు.
దానిమ్మపండులోని కొన్ని సమ్మేళనాలు యాంటి డయాబెటిక్ చర్యలను కలిగి ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇంకా, దానిమ్మ రసంలో ప్రత్యేక యాంటీఆక్సిడెంట్ పోలీఫెనోల్స్ అయిన టానిన్లు మరియు అంథోసయనిన్లు ఉన్నట్లు గుర్తించారు,.  ఇవి  టైప్ 2 డయాబెటీస్ పరిస్థితులను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. కాబట్టి, దానిమ్మపండు యొక్క డయాబెటిక్ వ్యతిరేక చర్యలకు రుజువు ఉంది, అయితే ఇది నిశ్చయాత్మకమైనది కాదు.

రక్తపోటు కోసం దానిమ్మ 

అధిక రక్తపోటు ప్రతి తరంలో సాధారణమైనది. ఇది సాధారణంగా సరిలేని జీవనశైలి మరియు ఆహార అలవాట్లతో ముడిపడి ఉంటుంది .  ఇది స్ట్రోక్ మరియు గుండెపోటుకు ఒక ముఖ్యమైన కారణంగా పరిగణించబడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 2 వారాల పాటు ప్రతిరోజూ 5 ఔన్సుల దానిమ్మ రసాలను తీసుకోవడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గిందని తెలిసింది. మరో అధ్యయనం దానిమ్మ రసం సిస్టోలిక్ రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుందని కనుగొంది.

గుండెకు దానిమ్మపండు

ప్రపంచ వ్యాప్తంగా అకాల మరణానికి అతి సాధారణ కారణాలు గుండెవ్యాధులు. ఒత్తిడి, జీవనశైలి, అధిక రక్తపోటు మరియు శరీరంలోని అసమతుల్య కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి వివిధ కారణాలు గుండె వ్యాధుల ప్రాబల్యానికి కారణం. దానిమ్మ గుండె మీద కలిగే అదనపు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే ఒక మంచి హైపోటెన్సివ్ ఏజెంట్ [hypotensive agent ](రక్తపోటును తగ్గిస్తుంది) గా గుర్తించబడింది. దానిమ్మపండులో ప్యూనిసిక్ ఆసిడ్ అని పిలవబడే ఒక ఫ్యాటీ ఆసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బుకు వ్యతిరేకంగా రక్షించడంలో బాగా  సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి,.
ఒక క్లినికల్ అధ్యయనంలో, అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న 51 మందికి నాలుగు వారాల పాటు దానిమ్మపండు గింజల నూనె ఇవ్వడం జరిగింది. నియమిత కాలం ముగిసే సమయానికి, ట్రైగ్లిజరైడ్స్ మరియు అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (HDL) యొక్క మెరుగైన నిష్పత్తితో పాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి. మరొక అధ్యయనంలో టైప్ 2 డయాబెటిస్ మరియు హైపర్ కొలెస్టెరోలేమియా (అధిక కొలెస్ట్రాల్) తో బాధపడుతున్న వారికీ దానిమ్మపండు రసాన్ని ఇవ్వడం ద్వారా వారిలో చెడు కొలెస్టరాల్ స్థాయిలలో (LDL) గణనీయమైన తగ్గుదల గమనింపబడింది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL)లో ఆక్సిడేషన్ జరగడం వలన అది ఎథీరోస్క్లెరోసిస్కు కారణమవుంతుంది.  అయితే దానిమ్మ రసం  తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ యొక్క ఆక్సిడేషన్ను నిరోధిస్తుందని నిరూపించబడింది.

అంగస్తంభన లోపం కోసం దానిమ్మ రసం 

అంగస్తంభన లోపం ఆక్సిడెటివ్ డామేజ్ తో ముడిపడి ఉంటుంది.  ఇది పురుషాంగ కణజాలంలో రక్త ప్రవాహ తగ్గుదలకు కారణమవుతుంది. సాంప్రదాయకంగా దానిమ్మ రసాన్ని అంగస్తంభన లోపం యొక్క లక్షణాలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. జంతువులపై చేసిన అధ్యయనాలు దానిమ్మ రసం పురుషాంగ కణజాలంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుందని సూచిస్తుంది.  తద్వారా అది అంగస్తంభనకు బాగా సహాయపడుతుంది.
ఒక క్లినికల్ అధ్యయనంలో, అంగస్తంభన లోపంతో బాధపడుతున్న  53 పురుషులకు ప్రతిరోజూ దానిమ్మ రసం ఇవ్వబడింది. ఏదేమైనా, ఈ సమస్యను తగ్గించడంలో దానిమ్మపండు రసం ఎలాంటి సంతృప్తికరమైన ప్రభావాలు చూపలేదని ఈ అధ్యయనం నివేదించింది.
అంగస్తంభన లోపం యొక్క చికిత్సలో దానిమ్మ యొక్క సమర్థతను అర్థం చేసుకోవడానికి ఇంకా విస్తృతమైన పరిశోధన బాగా  అవసరమవుతుంది.

యాంటిమైక్రోబయాల్ గా దానిమ్మపండు

దానిమ్మపండులో హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడడంలో సహాయపడే మొక్కల సమ్మేళనాలు (plant compounds) ఉంటాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే కాండిడా అల్బికెన్స్ (Candida albicans) అనే ఈస్ట్ పై పోరాడడంలో దానిమ్మపండు చాలా సమర్థవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాపర్ తో కలిసిన దానిమ్మ సారాలు స్టెఫిలోకోకస్ ఆరియస్ (Staphylococcus aureus) యొక్క మితిసిల్లిన్-రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ పై వ్యతిరేకంగా కొన్ని యాంటీమైక్రోబయాల్ చర్యలను కలిగి ఉన్నాయని కనుగొనబడింది. దానిమ్మపండు సారాల యొక్క యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కొన్ని ఓరల్ (నోటి) బ్యాక్టీరియాలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.  పెరియోడోంటైటిస్ మరియు జింజివైటిస్ వంటి వ్యాధుల నుండి పంటి చిగుళ్ళను మరియు దంతాలను దానిమ్మ రక్షిస్తుంది.

మెదడుకు దానిమ్మపండు 

జ్ఞాపకశక్తి మెరుగుదలతో దానిమ్మ ముడిపడి ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శస్త్రచికిత్స జరిగిన రోగులపై చేసిన అధ్యయనంలో దానిమ్మపండు సారం శస్త్రచికిత్స తర్వాత రోగులలో జ్ఞాపకశక్తి లోపాన్ని నిరోధించగలదని సూచించింది. మరోక అధ్యయనం దానిమ్మపండు రసం దృశ్య మరియు శబ్ద మెమోరీ మార్కర్లను (visual and verbal memory markers) మెరుగుపరుస్తుందని సూచిస్తుంది. అంతేకాకుండా, అల్జీమర్స్ యొక్క లక్షణాలపై పోరాడడంలో  కూడా దానిమ్మ  బాగా సహాయపడుతుందని కనుగొనబడింది.

జాయింట్ నొప్పులు మరియు ఆర్థరైటిస్ కోసం దానిమ్మ

దానిమ్మపండు యొక్క వాపు నిరోధక లక్షణాలు ఆర్థరైటిస్ వలన కలిగే జాయింట్ల వాపును తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మపండు సారాలు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ళకు హాని కలిగించే ఎంజైమ్లను నిరోధించడంలో బాగా సహాయకరంగా ఉంటుందని ఒక ప్రయోగశాల ఆధారిత పరిశోధన సూచించింది . ఇన్ వివో అధ్యయనాలు కూడా దానిమ్మపండు సారాలకు ఆర్థిరైటిస్ వ్యతిరేక ప్రభావాలు ఉన్నాయని తెలిపాయి. కానీ మానవులపై ఇప్పటివరకు పరిమితమైన పరిశోధన మాత్రమే నిర్వహించబడింది.  కాబట్టి దానిమ్మపండు యొక్క యాంటీ-ఆర్థిరైటిక్ ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడానికి వైద్యునితో మాట్లాడటం చాలా  ఉత్తమం.

క్యాన్సర్ నివారణకు దానిమ్మపండు

పురుషులలో సంభవించే క్యాన్సర్లలో సాధారణమైన రకం.  ప్రోస్టేట్ క్యాన్సర్. క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించేందుకు మరియు క్యాన్సర్ కణాలకు మరణం కలిగించడంలో కూడా దానిమ్మపండు యొక్క సారాలు ఉపయోగకరంగా ఉంటాయని ఒక ప్రయోగశాల ఆధారిత అధ్యయనం తెలిపింది. ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం రక్తంలో ఉండే ఒక రకమైన బ్లడ్ మార్కర్ ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA). ఈ ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ సంఖ్య/స్థాయి తక్కువ సమయంలోనే రెట్టింపైతే, అది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదాన్ని సూచిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, దానిమ్మపండు రసాన్ని రోజూ 8 ఔన్సులు తీసుకుంటే ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ రెట్టింపు అయ్యే సమయాన్ని 15 నెలల నుండి 54 నెలల వరకు పెంచుతుంది. ఇది ఒక విశేషమైన చర్య అని ఆ అధ్యయనం సూచించింది. మరొక అధ్యయనం దానిమ్మపండు సారాన్ని ఉపయోగించి ఇదే ఫలితాన్ని కనుగొంది.
ఇతర అధ్యయనాలు కూడా, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను దానిమ్మపండు సారాలు నిరోధిస్తాయని పేర్కొన్నాయి. అయితే, ప్రయోగశాల అధ్యయనాలకు మాత్రమే ఈ రుజువు పరిమితమై ఉంది. క్యాన్సర్ పై దానిమ్మ ప్రభావాలను ధృవీకరించడానికి మరింత పరిశోధన అవసరం.

దానిమ్మ దుష్ప్రభావాలు

అల్ప రక్తపోటు
 
దానిమ్మ రసం శరీరంలో రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుందని గుర్తించబడింది. అల్ప  రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, దానిమ్మపండు రసం త్రాగడం  మంచిది కాదు.
అలెర్జీ
దానిమ్మపండు కొంతమందిలో అలెర్జీని కూడా కలిగించవచ్చును . దానిమ్మపండు అలెర్జీ యొక్క లక్షణాలలో  మ్రింగడం కష్టం కావడం, దద్దుర్లు, ముఖం వాచిపోవడం మరియు శ్వాస తీసుకోవడంలో కఠినత వంటివి ఉంటాయి.
దానిమ్మపండు ఎంజైమ్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది
 
దానిమ్మపండులో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి. , అవి  కాలేయం యొక్క పనితీరును కూడా అడ్డుకోవచ్చును . ఒక వ్యక్తి కాలేయ రుగ్మత కోసం ఏవైనా మందులు వాడుతున్నట్లయితే, అతను/ఆమె దానిమ్మను  తినే ముందు వైద్యులని  కూడా సంప్రదించాలి.
 
దానిమ్మ అధిక చక్కెర శాతాన్ని  కలిగి ఉంటుంది
మధుమేహంపై పోరాడడంలో దానిమ్మపండు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దానిమ్మలో చక్కెరలు ఎక్కువ గా ఉంటాయి.  అవి రక్తంలో చెక్కర స్థాయిలను కూడా  పెంచుతుంది, అందువలన మధుమేహంతో బాధపడుతున్న రోగులు దానిమ్మను తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి.
అధిక కేలరీలు
బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న వారు దానిమ్మపండును తీసుకోవడాన్ని నిరోధించాలి ఎందుకంటే దీనిలో కేలరీలు అధికంగా ఉంటాయి.  అవి బరువు పెరుగుదలకు దారి తీయవచ్చును .

ఉపసంహారం

దానిమ్మపండు గొప్ప మరియు రుచికరమైన పండు. ఇది అనేక రకాల  ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది.   క్యాన్సర్, మధుమేహం, మరియు రక్తపోటు వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాల నుండి కూడా ఉపశమనం అందించగలదు. దానిమ్మపండులో వివిధ యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువ గా ఉంటాయి.  ఇవి మానవ శరీరానికి చాలా లాభదాయకం. దానిమ్మ యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. దానిమ్మ పళ్ళను అధికముగా తీసుకుంటే అవి హాని కలిగించవచ్చు మరియు కొంతమంది ఈ పండుకు అలెర్జీక్ గా కావచ్చును . ఏదేమైనప్పటికీ తగినంత పరిమాణంలో దానిమ్మను తీసుకోవడం ద్వారా అది శరీరానికి అనేక రకాల  ప్రయోజనాలను కలిగిస్తుంది.

Leave a Comment