పొట్లకాయ పప్పు కూర వండటం తెలుగులో

పొట్లకాయ పప్పు కూర వండటం

పొట్లకాయ పప్పుకావలసిన పదార్థాలు: పొట్లకాయ – 1, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఆవాలు, మినప్పప్పు, నూనె, అర టీ స్పూను చొప్పున, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు టీ స్పూను, ఉప్పు – రుచికి తగినంత, కరివేపాకు – 4 రెబ్బలు.
మసాల పొడి కోసం: నూనె – అర టీ స్పూను, శనగపప్పు -1 టేబుల్‌ స్పూను, మినప్పప్పు – పావు టీ స్పూను, దనియాలు, మిరియాలు – అర టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి – 2, కొబ్బరికోరు – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: పొట్లకాయను గింజలు లేకుండా తరిగి పప్పులు, పసుపుతో పాటు కొద్ది నీటిలో మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. నూనెలో మసాలా దినుసులు (కొబ్బరి తప్ప) దోరగా వేగించి, చల్లారిన తర్వాత కొబ్బరి కూడా కలిపి నీరు చిలకరించి పేస్టు చేసుకోవాలి. ఉడికిన పప్పు మిశ్రమంలో కొబ్బరి పేస్టు, ఉప్పు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. విడిగా తాలింపు వేసి పప్పులో కలిపి కరివేపాకు చల్లి మూతపెట్టాలి. వేడి అన్నంతో మంచి కాంబినేషన్‌.

Originally posted 2022-08-11 05:57:03.

Read More  మష్రూమ్‌ చిల్లీ ఫ్రై వండటం తెలుగులో
Sharing Is Caring:

Leave a Comment