బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి నివారణ మార్గాలు

బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి నివారణ మార్గాలు

వేసవి కాలంలో ఎక్కువగా అందరిని బాధించే సమస్య బ్లాక్ హెడ్స్. బ్లాక్ హెడ్స్ను  సులభంగా తొలగించుకోవడానికి చాలా రకాల నివారణ మార్గాలు ఉన్నాయి .

గంధపుచెక్క నుండి తీసిన గంధంను  రోజ్ వాటర్ తో   కలిపి ముఖానికి పేస్ ప్యాక్ చేసుకోవాలి. ఒక  20నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా  తరచు చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ పోవడమేకాక చర్మం కూడా నునుపు గా తయారవుతుంది.

 బేకింగ్ సోడాలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ ల తయారు చేసి ఈ మిశ్రమంతో ముఖంపై స్కర్బ్ చేసి  పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
గుడ్డులోని తెల్లసొన తీసుకుని గిలకొట్టాలి.  బ్లాక్ హెడ్స్ ఉన్నచోట  ఈ మిశ్రమం ను  అప్లై చేసుకోవాలి . ఈ మిశ్రమంలో కాటన్ ను ముంచి బ్లాక్ఖేడ్స్ ఉన్నచోట ఉంచి అది పూర్తిగా ఆరిన తరువాత కాటన్ ను కూడా  వెంటనే  తీసేయాలి.
 దాల్చిన చెక్క పొడిలో తేనెను  కలిపి పేస్ట్ ల తయారుచేసి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసి  పది నిమిషాల  తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి.
ఒకటి స్పూన్ పెరుగులో ఒకటి స్పూన్ బియ్యపిండిని కలిపి పేస్ట్ ల తయారుచేసుకోవాలి .   బ్లాక్ హెడ్స్ ఉన్నచోట   ఈ మిశ్రమమాన్ని రాసి  ఇది ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో  శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్  ని  పూర్తిగా  నివారించవచ్చును  .
నిమ్మరసంలో తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లటి నీటితో పూర్తి గా కడిగేయాలి. ఇలా రోజు మార్చి రోజు చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్ పోవడమేకాక ముఖం కూడా  ప్రకాశవంతగా మారుతుంది.
 నువ్వుల నూనె ముఖం మీద రాసి తరువాత సెనగపిండిలో నీళ్లు పోసి పేస్ట్ ల తయారు చేసి దీనిని ముఖం మీద రుద్దుతూ ఆరిన తరువాత మల్లి నీళ్లు చల్లి రుద్దుతూ  పూర్తిగా కడిగేయాలి.  తరచు  చేస్తే మంచి ఫలితం కూడా  ఉంటుంది.
 కొంచం పెరుగులో ఓట్స్ కలిపి ముద్దలా తయారు చేసి ముఖానికి ప్యాక్ ల వేసి scrub చేసి పది  మినిట్స్ తరువాత గోరువెచ్చని నీటితో పూర్తిగా  కడిగేయాలి.

పొడి చర్మం  ఉన్నవారు ఇలా చేసిన తరువాత ముఖానికి ఏదయినా మొయిశ్చరైజర్ వాడటం చాలా  మంచిది.