శివలింగములు-వాటిలోని రకములు మరియు వివిధ ఫలితములు

శివలింగములు – వాటిలోని రకములు మరియు వివిధ ఫలితములు 

 

ఆకాశమే లింగం. భూమి దాని యొక్క పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇదే  అంతా లయం చెందుతుంది. అందుకే  దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో కూడా  తెలియజేస్తుంటుంది. అందుకే  అది లింగమైంది. ఈ సృష్టి మొత్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు  కూడా ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని కూడా  సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు.

సామాన్యంగా లింగశబ్దానికి చిహ్నం లేక లక్షనం లనే  రెండు అర్థాలు న్నాయి. ప్రకృతి మరియు  వికృతులు రెండూ లింగమనే సౌంఖ్యద ర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని  కూడా అంటారు. మూర్తి ధ్యానాన్నిబట్టి ఆకారాలు కూడా  ఉంటాయి. లింగములో ఆకారంగానీమరియు  రూపంగానీ, చెప్పడానికి వీలుబడదు. అదొక చిహ్నం మాత్రమే. లయనా ల్లింగముచ్యతే అని కూడా అన్నారు. అంటే, లయం ప్రళయంగావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వమూ భస్మమై శివలింగంలోకి  చేరుతుంది. ఈ లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగునని లింగపురాణం  చెబుతుంది.స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. తాను ఇతరులకు దర్శనమివ్వాలి అనుకున్నప్పుడు అంబతో కలిసి (సాంబ) దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపంలేని స్థితి నుంచి సాంబ మూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం  కూడా ఉంది. దానినే అరూపమని అంటారు.అదే   శివలింగం.

 

శివలింగములు – వాటిలోని రకములు మరియు వివిధ ఫలితములు

శివలింగాలు ఐదు రకాలుగా మనకు  కనపడుతాయి .

తనంతట తానుగా అవతరించినది స్వయంభూలింగం.

ధ్యానపూర్వకమైనది బిందు లింగం.

మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం.

నాలుగవది చర లింగం.

ఐదవది శివుని విగ్రహమైన గురులింగం.

ఈ పవిత్ర భారతావనిలో కొన్నివేల శివలింగాలనుమనము   దర్శించుకోవచ్చును. మరికొన్ని గ్రంథాలు శివలింగం యొక్క రంగు, ఆకారం మరియు  కొలతలననుసరించి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొన్నాయ.

అవి:

ఆఢ్యం, సురేఢ్యం, అనాఢ్యం, సర్వసమం.

1001 ముఖాలతో కనబడే శివలింగం ఆఢ్యం అని . 108 ముఖాలతో కనబడే శివలింగం సురేఢ్యం అంటారు . ప్రస్తుతం ఉన్నవి, లేనివి అన్ని శివలింగరూపాలను అనాఢ్యం అంటున్నారు. ఒకటి నుంచి ఐదు ముఖాలుగల శివలిం గాలు సర్వసమం అంటారు .

ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలింగం, ద్విముఖలింగం, మరియు త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచ ముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చును . అయితే ఆరుముఖాలు గల షణ్ముaఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు మరియు  పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణవచనం చెప్పుతుంది .

 

శివలింగములు-వాటిలోని రకములు మరియు వివిధ ఫలితములు

 

 

శివలింగములు – వాటిలోని రకములు మరియు వివిధ ఫలితములు

 

ఏకముఖ లింగం:

ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం. తూర్పుముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపురంగులో పరమ శాంతంగా గోచరిస్తుంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నెైరుతిదిక్కులో ఉంటాయి. పదోన్నతి మరియు  అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు, ఈ తత్పురుష లింగపూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. అలాగే ఈ ఏకముఖ లింగాలకు ఏక ముఖ రుద్రాక్షలతో 11-121 సంఖ్యలో మాలలను తయారుచేసి, లింగమూర్తికి అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసికశాంతి కలుగుతుంది .

ద్విముఖలింగం:

శివలింగానికి తూర్పు- పడమరలలో ముఖాలు కలిగి ఉండటం ద్విముఖలింగ యొక్క లక్షణం. తూర్పుముఖం తుత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశెైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు. ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏరర్రచాలన్నది ఒక  నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో  మనము చూడలేము.

త్రిముఖ లింగం:

ఈ శివలింగం తూర్పు  మరియు  ఉత్తర, దక్షిణముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునగవుతోను , దక్షిణవెైపుగానున్న అఘోరముఖం కోపంతో, ఉత్తరం వెైపునున్న వామదేవముఖం మందహాసంతో కనపడుతాయి . ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి మరియు  లయకారకులెైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన.  మంత్రార్చనతో, త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్చించుకుని, మూడు దళాల బిల్వ పత్రాలతో పూజి స్తే సకల సంపదలు సమకూరుతాయి.

చతుర్ముఖ లింగం:

నాలుగు ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, మరియు దక్షిణాన అఘోర ముఖాలున్నాయి. ఈ నాలుగుముఖాలను నాలుగు వేదమంత్రాలతో పూజిస్తుంటారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తారు.  అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహ్యం.

శివలింగములు – వాటిలోని రకములు మరియు వివిధ ఫలితములు

పంచముఖలింగం:

ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్థాయి . నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో, తూర్పువెైపున ఐదవముఖంతో స్వామి  కనిపిస్తాడు . ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకించి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాలను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి. ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని ‘శివాగమ లింగం’ అని కూడా పిలుస్తారు.

షణ్ముఖ లింగం:

ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా, ఐదవ ముఖం ఆకాశాన్నీ, ఆరవముఖం పాతాళాన్ని చూస్తాయి . ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించాడని ఒక పురాణకథనం. అలాగే పాలసముద్రాన్ని మధించినప్పు డు వెలువడిన హాలాహలాన్ని శివపరమాత్మ అథోముఖంతో స్వీకరించాడట అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖలింగాన్ని చూడలేము.

ఎవరెవరు ఏయే లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుందున్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని మరియు  ఇతరులు శిలా లింగాన్ని పూజించాలి. వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలింగాన్ని పూజి స్తే  చాలా మంచిది. ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చును . ఏ లింగాన్ని పూజించడం వల్ల ఫలితమన్న విషయాన్ని లింగపురాణం  పూర్తిగా వివరించింది.

1. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి మరియు  నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.

2. పుష్పలింగం: దీనిని నానావిధ సుగంధ పుష్పాలతో నిర్మిస్తారు. ఈ లింగాన్ని పూజిస్తే రాజ్యాధిపత్యం కూడా  కలుగుతుంది.

3. గోమయలింగం: కపిలగోవు యొక్క పేడతో ఈ లింగాన్ని తయారుచేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపెై పడి మట్టి కలసిన ఆ పేడ పనికిరాదు.

4. రజోమయలింగం: పుప్పాడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం వస్తుంది . శివసాయుజ్యాన్ని కూడా  పొందగలం.

5. ధాన్యలింగం: ఈ లింగాన్ని యవుల, గోధుమలు మరియు  వరిబియ్యపు పిండితో  నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి మరియు సంతానం కలుగుతుంది.

6. తిలపిష్టోత్థలింగం: నూగుపిండితో  తయారు చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

7. లవణజలింగం: హరిదళం, త్రికటుకం మరియు ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి వస్తుంది  .

8. తుషోత్థలింగం: మారణక్రియకు దీనిని పూజిస్తారు.

9. భస్మమయలింగం: దీనిని భస్మంతో తయారు చేస్తారు. ఇది సర్వ సిద్ధులను కలుగుజేస్తుంది.

10. శర్కరామయలింగం: ఇది సుఖప్రదం.

11. సద్యోత్థలింగం: ఇది ప్రీతిని కలిగిస్తుంది.

12. వంశాకురమయ లింగం: ఇది వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

–13. కేశాస్థిలింగం: వెంట్రుకలు మరియు ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

14. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేస్తారు . ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

15. దధిదుగ్థలింగం: ఇది కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.

16. ఫలోత్థలింగం: ఏది చాలా ఫలప్రదమైనది.

17. ధాత్రిఫలజాతలింగం: ఇది ముక్తిప్రదం.

18. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి  మరియు సౌభాగ్యాలు కలుగుతాయి.

19. దుర్వాకాండజలింగం: గరికతో తయారు చేసిన ఈ లింగం పూజిస్తే అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

20. కర్పూరజ లింగం: ఇది ముక్తిప్రదమైనది.

21. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన లింగం ఇష్టసిద్ధిని కూడా  కలిగిస్తుంది.

22. సువర్ణనిర్మిత లింగం: బంగారంతో చేసిన ఈ లింగం పూజిస్తే  ముక్తిని కలిగిస్తుంది.

23. రజత లింగం: ఇది సంపదలను కలిగిస్తుంది.

24. ఇత్తడి-కంచులింగం:  ఇది ముక్తిని ప్రసాదిస్తుంది.

25. ఇనుము-సీసపులింగం: ఇది శత్రునాశనం చేస్తుంది.

26. అష్టథాతులింగం: ఇది చర్మరోగాలను నివారిస్తుంది. ఇది సర్వసిద్ధిప్రదం.

27. వెైఢూర్యలింగం: ఇది శత్రునాశనం మరియు  దృష్టిదోషహరం.

28. స్ఫటికలింగం: ఇది సర్వసిద్ధికరం. ఇది  అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

29. సితాఖండలింగం: దీనిని పటికబెల్లంతో తయారు చేసింది. దీనిని పూజిస్తే ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

 

శివలింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రెండు విధాలుగా ఉంటాయి .

1. శుద్ధలింగమూర్తులు, 2. లింగోద్భవమూర్తులు

శుద్ధలింగమూర్తులు:-

శుద్ధలింగాలును  స్థావర లింగాలు, జంగమలింగాలని రెండు విధాలుగా ఉన్నాయి.

మానుషమూర్తులు 1. అనుగ్రహమూర్తులు, 2. సంహార మూర్తులు, 3. నృత్యమూర్తులు, 4. ఉమాసహిత మూర్తులు, 5. ఇతర మూర్తులని ఐదు రకాలుగా ఉన్నాయి.*

స్థావరలింగాలు

1. స్వాయంభువలింగాలు, 2. పూర్వపురాణ లింగాలు, 3. దెైవతలింగాలు, 4. గాణపత్యలింగాలు, 5. అసురలింగాలు, 6. సురలింగాలు, 7. ఆర్షలింగాలు, 8. మానుషలింగాలు, 9. బాణలింగాలని తొమ్మిది విధాలుగా ఉన్నాయి.

కామికాగమంలో శివలింగాలు నాలుగు రకాలుగా చెప్పబడ్డాయి.

1. స్వయంభులింగాలు, 2. దెైవత, గాణపత్య లింగాలు, 3. అసుర, సుర, ఆర్షలింగాలు, 4. మానుషలింగాలు.*

శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచంఢమైన ఊర్జస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపెై పడకుండా ఉండేందకు శివలింగంపెై జలధారను ఎప్పుడు పోస్తుండాలి. ఆ దార నుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మ గురించి  తెలుసుకుంటాడు.

 

Tags: shiva lingam abhishekam and its benefits,types of abhishekam’s and their positive effects,lord shiva lingam abhishekam and its benefits,ancient healing mantras of shiva,shiva linga abhishekam items,shiva lingam god images,shiva lingam uses,shiva abhishekam ? & it’s results,shiva lingam stone,shiva and linga puja,shiva lingam,jyotirlingams of lord shiva,marakatha shivalingam,what are things used in shiva abhishekam,shiva lingam abhishekam

Leave a Comment