తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1

అందరం బాగుండాలి అందులో మీరు మరీను బాగుండాలి .
ఏ విషయంలోను ఎవరి మీద ఆధారపడకు ఒక్కసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతగాని తనం వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో అప్పుడు నీ మీద నీకు నమ్మకం నీ మీద
 ఇతరులకు గౌరవం పెరుగుతుంది .
   ఈ సమాజంలో  బ్రతకాలి అంటే మంచితనం మనుషుల మీద మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ,
    మనం ఏం చేసినా ఏదో ఒక్కటి అంటారు , మనం ఏం చేయకపోయినా ఏదో ఒక్కటి అంటారు అలాంటిప్పుడు మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే చాలు అనేవాళ్లు ఏదో విధంగా అంటూనే ఉంటారు .
     పోయిన కాలం
నీది కాదు వచ్చేకాలం నీ ఆధీనంలో ఉండదు ఉన్న ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకో మిత్రమా ! …
****************************************
తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 1
మీరు మీ కుటుంబసభ్యులు ప్రతి రోజు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ …
         సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు
     ప్రయత్నించి చూడు పోయేదేముంది,గేలిస్తే
సంతోషం వస్తుంది . ఓడితే అనుభవం
వస్తుంది .
    గాలి,ప్రేమ,నమ్మకం ఆనందం,అనురాగం అనేవి అంగట్లో అమ్మ కానికి దొరకవు .
గాలి ఆకాశంలో ప్రేమ మమకారంలో నమ్మకాన్ని మనస్సులలో పెంచుకోవాలి,
ఆనందాన్ని అనురాగాన్ని మనషులతో పంచుకోవాలి .
      మన ఇంటి కప్పు లోని రంధ్రం ఎండలో కనిపించక పోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది . మనుషులు అంతే సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది…
****************************************
 మనం ఇష్టం తో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారి లో  మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ .
     నిర్మలమైన నీ మనసు నిస్వార్థ మైన నీ స్నేహం అంటే నాకు ఎంతో ఇష్టం
        నీవు నా ఎదురుగా ఉన్న లేకున్న నాహృదయం  ఎప్పటికీ నీవు నిలిచి పోతావు
       బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు .
      బలవంతులు మాత్రమే సహిస్తూమౌనంగాఉంటారు
    బుద్దిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోతారు ప్రశాంతంగా జీవిస్తారు .
      నవ్వడం , నవ్వించడం మనకు అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడుదుడుకులు ఏమి చేయలేవు . అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి నేస్తమా …
      మర్చి పోయేవన్ని గతలు కావు , గుర్తున్నవన్ని జ్ఞాపకాలు కాదు , మనం మర్చిపోకుండా చేసేవే జ్ఞాపకాలు , గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రానిదే గతాలు …
******************************************
నీ నిర్మలమైన మనసు నీ నిస్వార్థ మైన స్నేహం అంటే నాకు ఎంతో ఇష్టం నీవు నా ఎదురుగా ఉన్న లేకున్న నా హృదయంలో ఎప్పటికీ నీవు నిలిచిపోతావు మిత్రమా
           మనం మాట్లాడు మాటలు ఎదుటి వారికి ఆ మాట అనేది చావాలనుకునే వారిని కూడా బ్రతికించేలా ఉండాలి. కానీ ! బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు .
      మనం భాధలో అయినా సంతోషంలో అయినా మన దగ్గర డబ్బున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నా నేస్తం అని తోడుండే వాళ్ళే నీ నిజమైన స్నేహితులు
      తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారి కంటే ఏతప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులు గా ముద్రపడేవాళ్లే ఎక్కువ
**************************************
   జీవితంలో అర్థం చేసుకునే మనషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్ళు కూడ ఆనంద బాష్పాలుగా మారి పోతాయి.
         జీవితంలో ఎవ్వడిని నా అని నమ్మకు నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతియుగం కాదు.
         కల్తీ నా కొడుకులు బతుకుతున్న  కలియుగం
          మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది
          ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి వుంటుంది .
        జీవితంలో ఏవి నీ వెనుక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్పా మనం సంపాదించినది ఏది మనది కాదు.ఒక్క మంచితనం‌,పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప …
****************************************
  కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం .
      చీకటి లేకుండా ఆకాశంలో చుక్కలు మెరవలేవు , కష్టాలు లేకుండా జీవితం గెలవలేము .
        ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం , మొండితనం రెండూ ఉండాలి . మంచితనం మనుషుల మీద చూపించాలి , మొండితనం పరిస్థితుల మీద చూపించాలి .
      మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు , ఎలాగైనా సంపాదించుకోవచ్చు , కానీ ! గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేము , అందుకే మీ సంతోషాలను వాయిదా వేయకండి …
******************************************
   నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో , ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్పుకో.
    జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు అంది తీరుతుంది నేస్తమా !
    జీవితమనేది మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా నడిచే వారుంటారు కానీ ! మనకు బదులుగా నడిచే వారుండరు మనమే నడవాలి ఎంత కష్టమైనా .
     ఉన్న వాటి విలువ అవి మనదగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు . ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమయినా ఏమీ చేయలేం అది కాల మయినా స్నేహితు
లయినా బంధువు లయినా చివరికి వస్తువు లయినా …
**************************************
 కళ్ళల్లో వెలుగుతో పెదవులపై చిరునవ్వు తో గుండె నిండుగా నమ్మకంతో ప్రతి రోజుని ఆహ్వనించు నేస్తమా .
    మనం ఎలాంటి వారము అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు ఒకరు ఆ భగవంతుడు మరొకరు మన అంతరాత్మ అడుగుదాం అంటే ఇద్దరూ కనిపించరు
     నిజాయితీగా ఉండడం  కూడా ఒక యుద్దం లాంటిదే , యుద్దం లో ఒంటరిగా నిలవడం ఎంత కష్టామో సమాజం లో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం .
      సముద్రం లో అలలు ఎన్నో అందులో తీరం చేరేవి కొన్నే  జీవితంలో స్నేహితులు ఎందరో కానీ! మనసులో ఉండేది కొందరే వారే నిజమైన స్నేహితులు .
      ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు ఆంది తీరుతుంది …
****************************************
    చావుకీి పుట్టుకకీ మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి మరచిపోలేనన్ని బంధల్నిచ్చి నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఎన్నిఆటలు ఆడుతున్నాడో ఆ దేవుడు
       మనషు బయటకు కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఎవరికి కనిపించని ఎంతో బాధ దాగివుంటుంది .
   నువ్వెవరినైనా మోసం చేయగలిగా వంటేదాని అర్థం మోసపోయినవారు చేతగాని వారని కాదు .
      నీ స్థాయికి మించి నిన్నునమ్మారని అర్థం .
    మనం అడవిలో పులిని నమ్మవచ్చు , నీళ్ళలో మొసలిని నమ్మవచ్చు , కానీ ! నవ్వుతుమాటల్లో నమ్మించి మోసం చేసేవారిని మాత్రం నమ్మనే నమ్మకూడదు …
******************************************
    బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ ! అర్హత లేనివారి దగ్గర పంచుకొంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు జాగ్రత్త నేస్తమా .
      హక్కు లేని బంధం నిజాయితీ లేని ప్రేమ స్వార్థంతో కూడిన స్నేహం నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండదు .
        ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు నీ పక్కన ఒకరు కూడా ఉండరు అబద్దాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది .
    దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది , కాని దెబ్బలు కొట్టిన సుత్తె ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది ఎదురుదెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకొన్నవాడు మహానీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉంటాడు ,
**************************************
 
**************************************

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 1

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు  Part 1

Read More  తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 3
Sharing Is Caring:

Leave a Comment