బచ్చలిగౌరి నోము పూర్తి కథ

బచ్చలిగౌరి నోము పూర్తి కథ

       పూర్వ కాలంలో   ఒక  ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది.  ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చారు. ఆనందంతో ఆ ఇల్లాలు నవగాయ పిండివంటలు కూడా  చేసింది.  చారుపోపునకు పెరటిలో కరివేపాకు కోసుకురంమని అన్నగారిని పంపింది.  కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని పాము కరిచింది.  నురుగులు కక్కుతూ నేలపై పడిపోయాడు.  ఎంతకూ అన్నగారు పెరటిలోనుండి రాకపోవదముతో ఆమె పెరటిలోనికి వచ్చి నురగలు క్రక్కుతూ క్రింద పది వున్న అన్నగారిని చూసింది.

 

భోరుభోరున ఏడుస్తున్న ఆమెకు పార్వతీ దేవి వృద్ద స్త్రీ రూపంలో వచ్చి ఊరడించి లోనికి వెళ్లి బచ్చల గౌరీ నోమును నోచుకోమ్మంది.   నీ అన్న బ్రతుకుతాడని చెప్పి వెళ్లి పోయింది.  అది జగన్మాత వాక్కుగా గుర్తించి ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోమును కూడా నోచింది.  ఆమె అన్న బ్రతికాడు ఆనాటినుండి ఈ నోమును నోచుకుని స్త్రీలు, అన్నా చెల్లెళ్ళు సుఖముగా కూడా వున్నారు.

Read More  మారేడుదళాల నోము పూర్తి కథ

ఉద్యాపన: 

శక్తి మేరకు బంగారంతోగాని, వెండితో గాని, బచ్చాలికాయను చేయించి ఆ బచ్చలి కాయను గౌరీదేవికి నివేదించి, బచ్చలి చెట్టును, బచ్చలి కాయను దక్షిణ తామ్బూలములను ఒక ముత్తైదువుకు వాయన మివ్వాలి.

Sharing Is Caring:

Leave a Comment