చిత్రగుప్తుని నోము పూర్తి కథ,The Full Story Of Chitragupta Nomu

చిత్రగుప్తుని నోము పూర్తి కథ,The Full Story Of Chitragupta Nomu

 

           పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి  భార్య ఎంతో కలిసిమెలిసి  వుండేవారు.  ఇరువురూ కలిసి ఎప్పుడు    నోములు నోచుకుంటూ వుండేవారు.  రాజు భార్య మాత్రం చిత్ర గుప్తుని నోము  గురించి మరచి పోయింది.  మంత్రి భార్య మాత్రం మరువక నోము నోచుకున్నది.  కాల క్రమంలో వారిద్దరూ చనిపోయారు.  చిత్ర గుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్నిఇచ్చాడు.    రాజు భార్యకు నరకాన్ని కలుగ చేసాడు.  రాజు భార్య చిత్ర గుప్తుడిని తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది.  నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను.   ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి  ఎందుకు అని అడిగింది.

చిత్రగుప్తుని నోము పూర్తి కథ

 

 అందుకు చిత్ర గుప్తుడు సమాధాన మిస్తూ ఓ తరునీమనీ! నువ్వు మంత్రి భార్య తోపాటు అన్ని  రకాల నోములను నోచావు.   ఒక్క చిత్ర గుప్తుని నోమును మరచిటివి ఆ నోమును మరచిన ఫలితమే నీకీ నరకము ప్రాప్తించినది అని చెప్పాడు. అప్పుడామే చిత్ర గుప్తా నీ మాట  నిజము నేను గుర్తు తప్పి నేనే నీ వ్రతమును మరచినాను.  నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపినా నేనూ చిత్ర గుప్తుని నోమును నోచుకోని వచ్చెదనని బ్రతిమిలాడెను.  అందుకా చిత్రగుప్తుడు అంగీకరించినవాడై ఆమెను భూలోకమునకు  పంపించెను.  భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్దలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్ర గుప్తుని వద్దకు వెళ్ళెను .  అందుకా చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గ లోక ప్రాప్తి నిచ్చెను.

చిత్రగుప్తుని నోము పూర్తి కథ,The Full Story Of Chitragupta Nomu

 

ఉద్యాపన: 

ఏడాదిపాటు నిత్యం పై కథను చెప్పుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవలెను.  అనంతరం ఉద్యాపన చేసుకోవలెను.  ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచములు కట్లు లేని గంపలో పొయ్యవలెను.  ఆ వాడలలో గుమ్మడి పండును వుంచవలెను.  అడ్డెడు తవ్వాడు (2-1/2)  బియ్యము ఆకుకూరలు, పట్టు పంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు, బంగారు గంటము దక్షిణ తాబూలములతో అన్న గారికి ఇవ్వవలెను.

Tags: chitragupta,chitragupta story,chitragupta temple,chitragupta nomu in telugu,chitragupta temple hyderabad,chitragupta puja,chitragupta history,chitragupta swamy temple,story of chitragupta,what is the birth story of chitragupta,special story on chitragupta temple,history of chitragupta temple hyderabad,chitragupta ji maharaj,special story of chitragupta temple hyderabad,chitragupta mahadeva devalayam,chitra gupta story,chitragupta nomu