నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతములు

నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతములు

భూమిపై ఉండే ప్రతి మానవుని మనస్సు లో వివిధ కోర్కెలు ఉంటాయి. ఇవి నెరవేర్చుకునేందుకు వివిధ రకాల యజ్ఞయాగాదులు మరియు  పూజలు పునస్కారాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి ఆలయంలో ఉండే నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు.  ప్రకృతిలో ఉన్న నవ గ్రహాలను పూజించేందుకు ప్రత్యేక పూజలు కూడా  ఉంటాయి . ముఖ్యంగా వీటి అనుగ్రహానికి వివిధ రకాల వ్రతాలను చేస్తే ఫలితం కనిపిస్తుంది.

 నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతాలు

సూర్యగ్రహము :-సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, శ్రీరామనవమి మరియు  కేదారేశ్వర, సూర్య చంద్ర వ్రతము చేయాలి.

చంద్ర గ్రహము :-చంద్ర గ్రహానికి అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతంమరియు సోమవార వ్రతం చేస్తారు .

కుజ గ్రహము:- కజుడు అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి మరియు  అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము  కూడా చేయాలి.

బుధ గ్రహము :– బుధుడు అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, మరియు  తులసీ వ్రతము కూడా చేస్తారు .

Read More  దుర్వా గణపతి వ్రతవిధానం

గురుగ్రహము:-    గురు అనుగ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము మరియు  త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.

శుక్ర గ్రహము:-  శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం మరియు శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను కూడా  చేయాలి.

శని గ్రహము:-  శని గ్రహం అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి మరియు  శనైశ్చర వ్రతాలు చేస్తారు .

రాహు గ్రహము :-రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ మరియు  షోడశగౌరీ వ్రతం కూడా చేయాలి .

కేతు గ్రహము:-  కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి మరియు  పుత్రగణపతి వ్రతాలు చేస్తే  ఫలితాలు   కలుగుతాయి .

Originally posted 2023-02-25 13:32:58.

Sharing Is Caring:

Leave a Comment