Panasapottu Kura: ప‌న‌సపొట్టుతో కూర‌ను చేసుకుని తింటే బోలెడ‌న్ని లాభాలు

Panasapottu Kura: ప‌న‌సపొట్టుతో కూర‌ను చేసుకుని తింటే బోలెడ‌న్ని లాభాలు

Panasapottu Kura : ప‌న‌స‌కాయ సహజంగా తీపి మరియు సులభంగా అందుబాటులో ఉండే పండ్లలో ఒకటి. పైనాపిల్స్ తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి ఇవి మీకు సహాయపడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు అద్భుతమైనవి. ప‌న‌స తొన‌ల‌తోనే కాకుండా ప‌న‌స పొట్టును కూడా తిన‌వ‌చ్చు . అయితే, దీన్ని నేరుగా తినడం సాధ్యం కాదు. దీన్ని కూరగా వండుకుని తినవచ్చును . ఈ విధంగా ప‌న‌స పొట్టు కూర చాలా రుచికరంగా ఉంటాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. దీన్ని తీసుకోవడం వల్ల రకరకాల పోషకాలు అందుతాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Panasapottu Kura: ప‌న‌సపొట్టుతో కూర‌ను చేసుకుని తింటే బోలెడ‌న్ని లాభాలు

పనసపొట్టు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

పనస పొట్టు- 2 కప్పులు
పసుపు – 1/2 టీస్పూన్
నూనె -2 టేబుల్ స్పూన్లు
శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్
మిన‌ప ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్
ఆవాలు – 2 టీస్పూన్లు
జీలకర్ర-ఒక టీస్పూన్
జీడిపప్పులు -2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి- 6
ముక్క‌లుగా చేసిన ఎండు మిర్చి – 8
కరివేపాకు – 2 రెమ్మలు
ఇంగువ- 1/2 టీస్పూన్
చింతపండు రసం – తగినంత
ఉప్పు- తగినంత

Panasapottu Kura: ప‌న‌సపొట్టుతో కూర‌ను చేసుకుని తింటే బోలెడ‌న్ని లాభాలు

పనసపొట్టు కూర తయారు చేసే విధానము:-

ముందుగా ఒక గిన్నెలో ప‌న‌స పొట్టు వేసి బాగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు, ప‌సుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఈ గిన్నె పెట్టి ఈ మిశ్రమం మెత్త‌గా కాకుండా ఉడికించి, నీరు అంతా పోయేలా ఒక జల్లి గంటె సహాయంతో వడకట్టుకోవాలి.ఇలా వడకట్టిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ప‌క్కకు ఉంచాలి.

ఇప్పుడు ఒక జార్ లో నాలుగు ఎండు మిర్చి, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి బాగా మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌డాయిలో నూనె వేసి నూనె కాగాక శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన పచ్చి మిర్చి, ఎండు మిర్చి, క‌రివేపాకు కూడా వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిశ్రమంలో కొంచెం ఇంగువ వేసి క‌లుపుకోవాలి.

ఈమిశ్రమంలో రుచికి స‌రిప‌డినంత చింత‌పండు ర‌సాన్ని వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ప‌న‌స పొట్టును వేసి మరో 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కూర పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ముందుగా మెత్త‌గా చేసుకున్న ఎండు మిర‌ప‌కాయ‌ల మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లుపుకోవాలి. ఈవిధముగా ఎంతో రుచిగా ఉండే ప‌న‌స పొట్టు ఆవ కూర త‌యార‌వుతుంది. ఈ కూర రెండు రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటుంది. ఈ కూర‌ను అన్నంతో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Originally posted 2022-10-26 08:08:21.