తులసినోము పూర్తి కథ

 తులసినోము పూర్తి కథ

 

           పూర్వకాలంలోసకలపూజలు.కాం భారతదేశమున గల విన్ద్యపర్వతాలకు దిగువ కాన్చానపురం అనే దేశం వుండేది.  దానిని ధర్మ శీలుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.  ఆయనకు లేక లేక ఒక్కగానొక్క కూతురు. ఆమెకు వివాహము జరిగితే నెల తిరక్కునడగానే   వైధవ్యం కలుగుతుందని ఆమె జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞులు చెప్పారు.  అందువల్ల ధర్మశీలుడు తన కుమార్తెకు, వివాహం చేసే ప్రయత్నమూ విరమించుకున్నాడు.  ఇలా కొంతకాలం గడుస్తుండగా రాజుగారి ఆస్థాన విద్వాంసుడైన మహీశ్వర బట్టునకు తండ్రికి తగ్గ తనయుడు అనదగిన కుమారుడున్దేవాడు.  అతడు రాజకుమార్తె అందచందాలు గుణగణాలు విని ఆమెను వివాహం చేసుకోవలెనని నిర్ణయించుకున్నాడుసకలపూజలు.కాం .

తులసినోము పూర్తి కథ

 

            ఒకానొక శుభ దినమునా బ్రాహ్మణ యువకుడు రాజు దర్శనం చేసుకున్నాడు.  మహారాజు ఆ యువకుడికి తగిన మర్యాదలు చేసి తన దర్శనానికి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించినాడు.  మహారాజా!  మీరు అనుగ్రహిస్తానంటే నాదొక కోరిక సమస్త శాస్త్రాలు చదువుకున్న వాణ్ని విద్యలన్నింటిని ఆరితెరిడిన వాడిని మీరు సరేనంటే మీ కుమార్తెను వివాహము చేసుకోవాలనుకుంటున్నాను.  మీసకలపూజలు.కాం  అనుమతికై వచ్చాను అన్నాడు.  ఆ మాటలకు మహారాజు ముఖం వెలవెల బోయింది.  విప్రకుమారా!  ఆమెకు వైధవ్యం ఉన్నందువల్లనే తెలిసి తెలిసి ఒక యువకుడిని అర్దాయుష్కుడిని చేసే కన్యాదానానికి వెరచి ఊరుకున్నాను.  నీవు వివాహం చేసుకుంటా నన్నావు  .   నా కుమార్తెకు నీకనా రూప గుణ సంపన్నుడు దొరకడం దుర్లభం కాని నిన్ను అర్దాయుష్కుడిని చేసి బ్రాహ్మణ హత్యా దోషమును పొందలేను నన్ను మన్నించు అన్నాడు.

Read More  సౌభాగ్య గౌరీ నోము పూర్తి కథ,Full Story Of Sowbhagya Gowri Nomu

          అందుకా బ్రాహ్మణ బాలుడు మహారాజ మీ కాభయం సందేహం అక్కరలేదు.  నేను పూర్నాయుష్కుడిని అని జ్యోతిష్కులుసకలపూజలు.కాం  ఎంతోమంది చెప్పియున్నారు.  అయినా ఇందుకు నాకు తెలిసిన మేర ఒక ఉపాయము చెబుతాను.  ఒక నెలరోజులపాటు నన్ను అనుమతిన్తించండి. హిమాలయ పర్వతాలలో ఋషులను దర్శనము చేసుకొని వారి ఆశీర్వాదము పొంది వస్తాను.  ఈ లోగా మీ అమ్మాయి చేత తులసినోము నోచుకునేలా తగిన ఏర్పాట్లు చేయండి.  అక్షయ సౌభాగ్యాలను అనుగ్రహించే చల్లని తల్లి శ్రీ తులసి స్త్రీల పాలిత కల్పవల్లి అందువల్ల మీ అమ్మాయికి సుమంగళి జీవితమూ లభిస్తుంది.  పూర్వం దేవతలు తమకు కలుగుతున్న అపజయాన నివారణకు శ్రీ తులసిని ఆరాధించారు.  ఆ మాటలకు ఆ రాజు ముగ్ధుడై బ్రాహ్మణ కుమారా నీమాటలు న మదికేక్కాయి.  నా కుమార్తె చేత తులసి వ్రతం చేయిస్తాను నువ్వు ఋషిపుంగవుల  దీవెనలను పొంది సంవత్సరాన్తమునాటికి రావల్స్సిందని చెప్పాడు.  అంతట ఆ బ్రాహ్మణ యువకుడు తుఅలై వ్రత విధి విధానములను వ్రత నియమములను వివరించి వెళ్ళిపోయాడు.   రాకుమార్తె తులసి వ్రతం సమాప్తి కావడంతో బ్రాహ్మణ యువకుడు రాజ్యానికి వచ్చి ఆమెతో వివాహితుడై కాంచన పురాన్ని చిరకాలం పరిపాలించాడు.

Read More  పదహారు ఫలాల నోము పూర్తి కథ

ఉద్యాపన: 

కార్తీక మాసం ఈ వ్రతానికి తగిన కాలం.  శ్రీమన్నారాయణునిసకలపూజలు.కాం విగ్రహాన్ని తులసి మొక్క వద్ద వుంచి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పంచామృత స్నానం చేయించి ఆవాహనం చేయాలి.  ముత్తైదువులకు యధోచితంగా పసుపు కుంకుమ గాజులు దానమివ్వాలి.  పుష్ప ఫలాడులతో వారిని సత్కరించాలి.

Sharing Is Caring:

Leave a Comment