తిధులు వాటి యొక్క ఫలితాలు,Tithulu Their Results

తిధులు వాటి యొక్క ఫలితాలు,Tithulu Their Results

 

మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం కూడా వస్తుంది. దీనికి సంబందించిన తిధులు, వాటి  యొక్క ప్రత్యేకత, ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించ బడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాడి విశేషాల గురించి భూదేవికి  వివరించారు.

తిధులు వాటి విశిష్టత :

పాడ్యమి :దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి మరియు  ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం కూడా  ఉంటుంది.

విదియ : అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధి నాడు పుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం కలుగుతుంది .

Read More  గ్రహణం పట్టని ఏకైక దేవాలయం,The Only Temple Not Eclipsed

తదియ : గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే  చాలా ఇష్టం.  ఇది  ప్రత్యేకంగా స్త్రీ ల కోసం ఏర్పాటు అయినది.

చవితి: వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చును .

పంచమి: పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగ దేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాల ఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజ చేస్తే నాగుల వల్ల కలిగే భయం ఉండదు.

షష్టి : కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. ఆ రోజున అర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం కూడా  పొందగలరు.

సప్తమి:సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు  పొందుతారు .

తిధులు వాటి యొక్క ఫలితాలు,Tithulu Their Results

 

Read More  ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి,Which Rashi Should Be Presented To Any God

అష్టమి: దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి. అష్టమాకృతులను మరియు  దుర్గా దేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

నవమి: దుర్గాదేవి కి ప్రీతికరమైనది. ఆ తిధి నాడు దుర్గ ను పూజించి మరియు  ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.

దశమి: దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు కూడా  తొలగుతాయి.

ఏకాదశి: కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి  కూడా కలుగుతుంది

ద్వాదశి: విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి, వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు బ్రాహ్మణుడికి కూరగాయలు దానం చేస్తే తే శ్రీ మహావిష్ణువు యొక్క  అనుగ్రహం లభిస్తుంది.

త్రయోదశి: ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే , మంచి  ఫలం చేకూరుతుంది.

తిధులు వాటి యొక్క ఫలితాలు,Tithulu Their Results

చతుర్దశి: రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే  చాలా శుభప్రదం. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి  కూడా వస్తుంది. ఆ తిధి శివుడికి చాలా  ప్రీతికరం.

Read More  కొబ్బరికాయను కొట్టడంలో పాటించవలసిన నియమాలు

అమావాస్య: పితృదేవతలకు ఇష్టమైన తిధి. దర్భలు మరియు  నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్పనమిస్తే వారు సంతోషించి సంతాన సౌక్యంను   అనుగ్రహిస్తారు.

పౌర్ణమి: పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి  రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితే ధనధాన్యాలు మరియు  ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కూడా  సిద్దిస్తాయి.

Tags;subha tithulu,tithulu,manchi tithulu,rahu dhana yoga results,tithulu varalu.,manchi thithulu,thithulu manchi chedulu in telugu,thithulu in telugu,according of tithulu,subha titulu,thithulu in telugu today,good days and good thithulu,thidulu,benefits of telugu thidulu,rashulu,mithuna,telugu thidulu list,muhurtham benefits,spiritual speeches,telugu thidhula perlu,about sundopa sundulu,mithuna rasi,thidulu vati phalithalu,birthday luck

Sharing Is Caring:

Leave a Comment