గాళి ధూళి భూత సంకటాలను వదిలించే క్షేత్రం వేదనాయక ఆలయం

గాళి, ధూళి, భూత సంకటాలను వదిలించే క్షేత్రం వేదనాయక ఆలయం

 తమిళనాడులో నాగపట్నం జిల్లా వేదారణ్యంలో ఉన్నది. రావణుని సంహార సమయంలో ఎందరో రాక్షసవీరులు శ్రీ రాముడి చేతిలో హతులయ్యారు. వారంతా కూడా పెనుభూతాలై శ్రీరాముడిని వెంటాడుతుండగా వారిని వదిలించుకోవటానికి స్వామి మొదట వినాయకుడ్ని ప్రార్థించి వాటిని శాంతింపచేసి ఆ ఆత్మలకు శాంతిని చేకూర్చటానికి ప్రక్కనున్న గ్రామంలో శివలింగమును ప్రతిష్ఠించి నాడని పురాణువాచ. వినాయకుడు వడక్కం వినాయకుడిగా గాళి, ధూళి, భూతములను వదిలించే స్వామిగా ప్రసిద్ధి గాంచాడు.
ఈ స్వామిని పూజించటానికి వేదాలు ముఖద్వారాన్ని తీసుకుని స్వయంగా వచ్చి పూజించి వచ్చినదారిని గట్టిగా బంధించివేసి వెళ్ళిపోవటం కారణంగా వినాయకుడ్ని దర్శించుకోవటానికి ప్రక్కద్వారము నుండి వచ్చి స్వామిని దర్శించుకోవాలి. ఇంకా ఇక్కడ స్వామి చండికేశ్వర స్వామి, అమ్మవారు చండికేశ్వరి. పార్వతీదేవి సరస్వతీదేవిని వీణావాద్యంలో ఓడించి వెలసిన అమ్మవారిగా ఈ దేవిని కొలవటం ఇక్కడి ప్రత్యేకత. చండికేశ్వర స్వామి, అమ్మవారు చండికేశ్వరి. పార్వతీదేవి సరస్వతీదేవిని వీణావాద్యంలో ఓడించి వెలసిన అమ్మవారిగా ఈ దేవిని కొలవటం ఇక్కడి ప్రత్యేకత.

గాళి, ధూళి, భూత సంకటాలను వదిలించే క్షేత్రం వేదనాయక ఆలయం

 

Read More  కర్ణాటకలోని దేవ్‌బాగ్ బీచ్ యొక్క పూర్తి వివరాలు,Full details of Devbagh Beach in Karnataka
Sharing Is Caring:

Leave a Comment