‘సి’ విటమిన్ ప్రయోజనాలు సి విటమిన్ లభించే ఆహార పదార్థాలు వనరులు మరియు దుష్ప్రభావాలు

‘సి’ విటమిన్ ప్రయోజనాలు సి విటమిన్ లభించే ఆహార పదార్థాలు వనరులు మరియు దుష్ప్రభావాలు 

విటమిన్ సి అంటే ఏమిటి?
విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది నారింజ మరియు నిమ్మకాయలు వంటి కొన్ని ఆహార పదార్ధాలలో సహజంగా  కూడా ఉంటుంది.  ఈ విటమిన్ ఆహార-సంబంధమైనదిగా కూడా అందుబాటులో ఉంటుంది. సి విటమిన్ ని “L- అస్కోర్బిక్ ఆమ్లం” అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో సహజంగా సంశ్లేషించబడదు.  అంటే ఇది లభించే ఆహారాల్ని సేవిస్తేనే ఈ విటమిన్ మన శరీరానికి లభిస్తుంది. శరీరం యొక్క సాధారణ పనితీరులో సి విటమిన్ అనేక విధాలుగా తోడ్పడుతుంది మరియు దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సి విటమిన్ యొక్క చాలా అగత్యమైన విధి ఏంటంటే “కొలెజెన్ పీచుపదార్థాల” జీవ సంశ్లేషణగా (biosynthesis)   కూడా పనిచేయడమే.
కొల్లాజెన్ ఫైబర్స్ అంటే ఏమిటి?
సంయోజిత కణజాలంలో కొల్లాజెన్ ప్రధాన నిర్మాణ పోషకాహారంగా కూడా   ఉంటుంది. ఇది మన శరీరంలోని  మొత్తం ప్రోటీన్ పరిమాణంలో 25% నుండి 35% వరకు ఉంటుంది. కొలెజెన్ పీచుపదార్థం అనేది ఎముకలు, మృదులాస్థి, స్నాయువులు, చర్మం, ఆస్తిబంధకాలు మరియు చర్మంకింది పోర (అంటిపట్టు)ల్లో ఉండే ప్రధాన భాగం. గొప్ప తీగ బలం (అంటే సాగుడు బలం) గలది కాబట్టి కొలెజెన్ పీచుపదార్థం మన చర్మం యొక్క బలానికి స్థితిస్థాపకతకు కారణమవుతుంది. ఈ కొలెజెన్ పీచుపదార్థం యొక్క శక్తి  వయసు పెరగడంతో పాటు క్రమంగా తగ్గుతుంది. ఇప్పటివరకు కనుగొనబడిన 28 రకాల కొలెజెన్ పీచుపదార్థాలు మన శరీరంలో ఉన్నాయి, కానీ 90% కొలెజెన్ పీచుపదార్థం అంతా ఒకటో రకానికి (Type 1) కూడా  చెందినదే.
కొల్లాజెన్ ఫైబర్స్ సంశ్లేషణలో విటమిన్ సి బాగా సహాయపడుతుంది. , ఇది (విటమిన్ సి) పుండ్లు/గాయాల వైద్యం, రోగం నుండి కోలుకోవడానికి మరియు కణజాల పునరుత్పాదన ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి శరీరంలోని విటమిన్ E లాంటి  ఇతర అనామ్లజనకాల యొక్క చర్యను ప్రోత్సహించే ఒక శక్తివంతమైన అనామ్లజనకం (ప్రతిక్షకారిణి).  ఇది స్వేచ్ఛా రాశులు కల్గించే నష్టాన్ని  బాగా తగ్గిస్తుంది. విటమిన్ సి ఆహారం నుండి లభించే “నాన్-హీమ్ ఐరన్” యొక్క శోషణను  బాగా మెరుగుపరుస్తుంది. అదనంగా, విటమిన్ సి కి  మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఓ ముఖ్యమైన పాత్రను కూడా  పోషిస్తుంది.
'సి' విటమిన్ ప్రయోజనాలు సి విటమిన్ లభించే ఆహార పదార్థాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
  • విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఆహారాలు
  • విటమిన్ సి ప్రయోజనాలు
  • ఒక రోజుకు విటమిన్ C మోతాదు
  • విటమిన్ సి లోపం
  • విటమిన్ సి అధిక మోతాదు

 


విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఆహారాలు

ఈ కింది ఆహార ఉత్పత్తుల్లోనూ  మరియు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది:
నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, తీపి నిమ్మకాయ వంటి నిమ్మజాతి (సిట్రస్) పండ్లు
స్ట్రాబెర్రీ, గూస్బెర్రీ, బ్లూబెర్రీ, మేడిపండు మరియు క్రాన్బెర్రీ వంటి బెర్రీస్ లేదా మృదు ఫలాలు
దోసకాయ (melon) మరియు పుచ్చకాయ
రామదోసకాయ (cantaloupe/sweet melon)
టొమాటాలు
అనాస పండు
కివి పండు
జామ పండ్లు
మామిడి పండ్లు
బొప్పాయి
బ్రోకలీ, ఎర్ర మిరియాలు, ఆకుపచ్చ మిరియాలు మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలు.
పాలకూర, క్యాబేజీ మరియు టర్నిప్ వంటి ఆకు కూరలు.
చిలకడ దుంపలు మరియు తెలుపు బంగాళాదుంపలు.
తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు వంటి కొన్ని ప్యాక్ చేసిన ఆహారాలు కూడా విటమిన్ సి కలిగి ఉంటాయి.
ఇది ప్రత్యేక మోతాదులకు మరియు చికిత్సలకు అందుబాటులో ఉన్న క్యాప్సూల్స్, మాత్రలు మరియు కృత్రిమ పదార్ధాల రూపంలో కూడా అందుబాటులో ఉంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాల్ని ముడిపండ్లగానే లేదా పచ్చివిగానే తినాలి. ఎందుకంటే వంట చేయడం, వేడి చేయడం లేదా మైక్రోవేవ్ పొయ్యిలపై వేడి చేయడం లాంటి ప్రక్రియలవల్ల వాటి పోషక పదార్థాలు మరియు వాటిలోని విటమిన్ సి పరిమాణం తగ్గిపోతుంది. అదేవిధంగా, విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను ఎక్కువకాలంపాటు నిల్వ చేయడం లేదా పగటిపూట వాటిపై ఎండను సోకనివ్వడం కూడా చేయకూడదని సిఫార్సు చేయడమైంది. దుకాణం  నుండి కొనుగోలు చేసే ప్యాక్ చేయబడిన విటమిన్ సి రసాలను మరియు ప్యాక్ చేయబడిన పండ్లు కొనుగోలు చేస్తున్నప్పుడు, బాగా కార్టోన్లులో ప్యాక్ చేయబడిన వాటినే కొనడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే, అధిక కాంతికి గనుక విటమిన్ సి ఆహారాలు బహిర్దతమైతే వాటిలోని పోషక విలువలు తగ్గిపోయే అవకాశం ఉంది. విటమిన్ సి ని కల్గి ఉండే పండ్లు మరియు కూరగాయలు తదితరాది ఆహారాలను ఉడకబెట్టకుండా శుభ్రంగా కడిగి తాజాగా ఉన్నపుడే తినేయడం మేలు.

విటమిన్ సి ప్రయోజనాలు 

విటమిన్ సి యొక్క కొన్ని ఉపయోగాల గురించి చర్చిద్దాం
పుండ్లు మాన్పడానికి విటమిన్ సి:  గాయాల్ని లేదా పండ్లని  మాన్పె ప్రక్రియలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు  కూడా పేర్కొన్నారు.  గాయాలు తగ్గుముఖం పెట్టె ప్రక్రియలోని ప్రతి దశలోనూ సి విటమిన్ అవసరమవుతుంది. పుండు యొక్క వాపు దశలో, “న్యూట్రోఫిల్ అపోప్టోసిస్” అనే ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ సి ఎంతో చాలా  అవసరం.
ఎముకులకు విటమిన్ సి: ఎముకలతో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ కొల్లాజెన్. కొల్లాజెన్ జీవక్రియలో విటమిన్ సి చాలా ముఖ్యమైనది. చాలా పరిశోధనలు ఎముకల ఆరోగ్యానికి విటమిన్ సి ముఖ్యమైనదని  కూడా తెలుపుతున్నాయి.
ఐరన్ మరియు విటమిన్ సి: ఐరన్ శోషణకు విటమిన్ సి అనేది ఎంతో అవసరం, ఆహరంలో ఉన్న ఐరన్ ధాతువులని శరీరంలోకి తీసుకోవడం లో విటమిన్ సి  కూడా సహాయపడుతుంది.

వ్యాధినిరోధశక్తికి విటమిన్ సి అనుబంధకాలు:
విటమిన్ సి అనేది తెల్లరక్తకణాల ఉత్పత్తిని పెంచి, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి  బాగా సహాయం చేస్తుంది. శరీరం పై  అలాగే స్వేచ్ఛ రాశుల (free radicles) యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
జ్ఞాపక శక్తికి విటమిన్ సి: విటమిన్ సి కి ఉన్న గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెదడులో ఆక్సిజన్ ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి.  అది వయసు సంబంధిత మతిమరుపు వంటి ఇతర మెదడు సమస్యలను  బాగా నివారిస్తుంది.
గౌట్ కోసం: తినే ఆహారంలో విటమిన్ సి ను చేర్చడం ద్వారా గౌట్ సమస్య నుండి విముక్తి పొందవచ్చును . అధ్యయనాలలో విటమిన్ సి ఉన్న ఆహారాలను  తినడం అనేది గౌట్ ను తగ్గించడంలో ప్రత్యక్ష సంబంధం ఉందని  కూడా తెలిసింది.
పంటి చిగుళ్ల కోసం: విటమిన్ సి పంటి చిగుళ్ల నిర్మాణాన్ని కాపాడడమే కాక నోటిలో ఉండే వ్యాధి కారక సుక్ష్మ్యా క్రిములను కూడా నివారిస్తుంది. పంటి సమస్యలు ఉన్నపుడు దంతవైద్యులు విటమిన్ సి ఉన్న పేస్టులను , మౌత్ వాషులను  కూడా సూచిస్తారు.
క్యాన్సర్ నివారణకు: క్యాన్సర్ నివారణకు తరచుగా విటమిన్ సి ఉన్న పళ్ళు మరియు ఆహారాలు సూచించబడతాయి. విటమిన్ సి కి ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దీనికి కారణం కావొచ్చు.
మధుమేహం కోసం: విటమిన్ సి శరీరంలో సాధారణ చెక్కెర స్థాయిలను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.
  • పుండ్లు/గాయాల్ని మాన్పడానికి విటమిన్ సి
  • చర్మానికి విటమిన్ సి మంచిదేనా
  • ఎముకలకు విటమిన్ సి ప్రాముఖ్యత
  • విటమిన్ సి మరియు ఇనుము
  • ఉత్తమ రోగనిరోధక శక్తికి విటమిన్ సి
  • విటమిన్ సి మరియు జ్ఞాపకశక్తి
  • విటమిన్ సి గౌట్ (రక్తగతకీళ్లవాతం వ్యాధి) ని తగ్గిస్తుంది
  • పంటి చిగుళ్ళ కోసం విటమిన్ సి
  • క్యాన్సర్ నివారణకు విటమిన్ సి సహాయపడుతుంది
  • బరువు కోల్పోయేందుకు విటమిన్ సి
  • గుండెకు విటమిన్ సి యొక్క ప్రాముఖ్యత
  • చక్కెరవ్యాధి (మధుమేహం)కి విటమిన్ సి
Read More  అలసందలు(బొబ్బర్లు ) అందించే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

 

పుండ్లు/గాయాల్ని మాన్పడానికి విటమిన్ సి

పుండ్లు,గాయాల్ని మాన్పడానికి సి విటమిన్ చాలా అవసరమని వివిధ పరిశోధకులు చెప్పారు. గాయాల్ని  మాన్పె ప్రక్రియలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. మాన్పుడు ప్రక్రియ ప్రతి దశలోనూ సి విటమిన్ అవసరమవుతుంది. పుండు యొక్క వాపు దశలో, “న్యూట్రోఫిల్ అపోప్టోసిస్” అనే ప్రమాదాన్ని మాన్పడంలో విటమిన్ సి అవసరం అగత్యం. న్యూట్రోఫిల్ అపోప్టోసిస్ వల్ల గాయపడిన ప్రాంతంలో మంట మరియు నొప్పి చర్యకు కారణమవుతుంది. గాయమైన చోట వాపు (వాపుతో బాటు ఎరుపుదేలడం మరియు ఉష్ణోగ్రత పెరుగుదల లక్షణాలు) మంట పుట్టడమనేది సంక్రమణను మరియు రక్తస్రావాన్ని నియంత్రించడానికి  చాలా అవసరం అని పరిశోధనలు చెబుతున్నాయి.
పుండ్లు,గాయాల్ని నయం చేసే రెండో దశలో, కొల్లాజెన్ పీచుపదార్థాల ద్వారా గాయపడిన ప్రదేశానికి కొత్త కణజాలాన్ని పునర్నిర్మించడం జరుగుతుంది. ఈ రెండో దశలో, విటమిన్ సి ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. అదేమంటే, ఈ కొల్లాజెన్ పీచుపదార్థాల సంయోజనం మరియు పరిపక్వతలో విటమిన్ సి పాల్గొంటుంది. పుండు లేదా గాయ పరిపక్వతకు అస్తవ్యస్తంగా పడిఉండే  కొల్లాజెన్ పీచుపదార్థాలను ఒకటో టైపు (టైప్ 1 ఫైబర్స్ను) పీచుపదార్థాలుగా పరివర్తించి పునర్నిర్మించే దశలో విటమిన్ సి  చాలా అవసరం.
శరీరంలో విటమిన్ సి లేకపోవడం వలన గాయాలు మానడంలో ఆలస్యమేర్పడుతుంది, అంటే మామూలు కంటే ఎక్కువ సమయం పడుతుంది. గాయమైనా, పుండైనా మానిన  తర్వాత మందపాటి లేదా లోతైన మచ్చ కణజాలం తరచుగా గాయమైన ప్రాంతంలో మిగలడం జరుగుతుంది. 4 గ్రాముల ఆస్కార్బిక్ ఆమ్లం (లేదా విటమిన్ సి) సంశ్లేషణ, కొల్లాజెన్ కణజాలం నాణ్యతను గణనీయంగా మెరుగుపర్చడానికి  కూడా సహాయపడుతుందని గుర్తించబడింది. పుండ్లు/గాయాలను నయం చేసే ప్రక్రియలో వైద్యులు తరచుగా రోగులకు విటమిన్ సి సప్లిమెంట్లను సేవింపజేయడం జరుగుతుంది. దీనివల్ల గాయమైనచోట మచ్చకణం తక్కువగావడం జరుగుతుంది.

చర్మానికి విటమిన్ సి మంచిదేనా

మీరు ఎల్లప్పుడూ మెరుస్తుండే యవ్వనవంతమైన చర్మం గురించి కలలుగంటున్నారు.  కానీ దానిని పొందేందుకు ఏమి చేయాలో తెలియట్లేదా ? సరే, మీ ఆహారంలో విటమిన్ సి ఉండే పదార్థాలను  మరింతగా చేర్చమని మేము సూచిస్తున్నాము. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది. విటమిన్ సి కొల్లాజెన్ ఫైబర్స్ జీవసంశ్లేషణలో పాల్గొంటుంది, ఇది మీ చర్మం యొక్క సాధారణ స్థితిస్థాపకతను నిర్వహించడానికి కూడా  కారణమవుతుంది. విటమిన్ సి ఓ శక్తివంతమైన అనామ్లజని. కనుక, ఇది మీ శరీర కణాలకు హాని చేసే స్వేచ్ఛా రాశుల విరుద్ధంగా పోరాడి మీ శరీర కణాల్ని  రక్షిస్తున్నది.ఈ రెండు కారణాల వల్ల విటమిన్ సి ముడుతలను పోగొట్టి మీ ముఖానికి సహజమైన సౌందర్యాన్ని ఇవ్వడం కూడా  జరుగుతుంది.
అంతేకాదు. పరిశోధనల సాక్ష్యం ప్రకారం, విటమిన్ సి కి సంబంధించిన పైపూత మందుల్ని విపరీతమైన ఎండ (వడదెబ్బ) చే ఏర్పడ్డ బొబ్బలకు చికిత్స చేయడంలో ఉపయోగించవచ్చని  సూచించారు. విటమిన్ సి చర్మం రంగు పాలిపోవడానికి, వయస్సుతో పాటు వచ్చే మచ్చలు మరియు చిన్న చిన్న మచ్చలను, చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని సున్నితంగా చేయడానికి కూడా విటమిన్ సి సహాయపడుతుంది అని పరిశోధకులు పేర్కొన్నారు.

ఎముకలకు విటమిన్ సి ప్రాముఖ్యత

మన ఎముకల్లోని తొంభై శాతం మాతృక ప్రోటీన్లు కొల్లాజెన్తో తయారైనవే. అంటే, కొల్లాజెన్ మన ఎముకలు మరియు వాటి సాధారణ ఆరోగ్యానికి చాలా అవసరం అని సూచిస్తుంది.  మన శరీరంలో ఈ ముఖ్యమైన ప్రోటీన్ (కొల్లాజెన్) సంశ్లేషణలో విటమిన్ సి పాల్గొంటుంది. ఎముక నిర్మాణం మరియు ఎముక మాతృక యొక్క జన్యువుల వ్యక్తీకరణ పరంగా ఎముక ఆరోగ్యంపై విటమిన్ సి యొక్క సానుకూల ప్రభావాలను కల్గి ఉంటాయని  వివిధ పరిశోధనలు పేర్కొన్నాయి.
విటమిన్ సి సప్లిమెంట్లను సేవించని వ్యక్తులతో ఈ విటమిన్ సి సప్లిమెంట్లను  సేవించే వ్యక్తులను పోల్చి చూస్తే ఈ విటమిన్ల సప్లిమెంట్లను సేవించేవారు తక్కువ ఎముక నష్టం కలిగి ఉంటారని పరిశోధనా  సిద్దాంతాలు నిర్ధారించాయి. ఎముక పనితీరును మెరుగుపర్చడానికి విటమిన్ సి యొక్క ఈ స్పష్టమైన చర్యల కారణంగా, విటమిన్ సి బోలు ఎముకల వ్యాధికి చికిత్స చేయడానికి కూడా సూచించబడింది.

విటమిన్ సి మరియు ఇనుము

శరీరం నుండి హీమ్ కాని ఇనుము (non-heme iron)  యొక్క శోషణ ప్రక్రియలో విటమిన్ సి విరివిగా పాల్గొంటుంది. హీమ్ ఇనుము (heme iron) శరీరంలో సులభంగా గ్రహించబడి, ఆహార రాజ్యాంగం (dietary constitution) వలన ప్రభావితం కానప్పటికీ, హీమ్ కానీ ఇనుము (non-heme-iron) ను గ్రహించడంలో  శరీరానికి కష్టమవుతుంది.  ఎందుకంటే విటమిన్ సి ఆహార పీచు పదార్ధాలు లేదా టీ వంటి ఇతర పదార్థాలకు కట్టుబడి  కూడా ఉంటుంది.
ఇతర ఆహార పదార్థాల (ఇన్హిబిటర్లు) యొక్క బంధన బలం (లేదా కలిపి వుంచేశక్తి) ప్రభావాలను విటమిన్ సి అడ్డుకుంటుంది లేదా నిరోధిస్తుంది, కనుక విటమిన్ సి ఈ శోషణలో ఒక పాత్రను కలిగి ఉంది. హీమ్ కాని ఇనుము (non-heme-iron) పదార్థాల్లో కూరగాయల మూలాల వంటి తక్కువ మొత్తంలో ఇనుము  ఉన్న ఆహారాల నుండి ఇనుము యొక్క శోషణ నేరుగా విటమిన్ సి యొక్క గాఢతపై ఆధారపడి ఉంటుందని పలు అధ్యయనకారులు నిరూపించారు. అధిక ఇనుము అవసరమయ్యి, తక్కువ శక్తి మాత్రమే ఉండే పరిస్థితులలో, విటమిన్ సి ని జోడించడమనేది అధిక ప్రయోజనకారి అని అనేక శాస్త్రీయ అధ్యయనాలు కూడా నిరూపించాయి.

ఉత్తమ రోగనిరోధక శక్తికి విటమిన్ సి

మీరు తరచుగా, ప్రత్యేకించి వాతావరణ మార్పుల సమయాల్లో, సాధారణ జలుబు మరియు ముక్కు నుండి నీళ్లు కారిపోయేంతగా విపరీతమైన పడిశంతో బాధపడుతున్నారా? ఇది మీ రోగనిరోధక శక్తికి సంబంధించిందే కానీ నిరంతరంగా కురుస్తున్న కుంభ వర్షానికి సంబంధించింది కాదు. ఈ సమస్యకు మనం విటమిన్ సి ని ఉపయోగించి ఎలా ప్రయోజనం చేకూర్చకోగలమో చూద్దాం. విటమిన్ సి శరీరంలో తెల్ల రక్త కణాల (white blood cells) ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మన రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడం ద్వారా శరీరాన్ని రోగాల బారి నుండి రక్షించడంలో విటమిన్ సి సహాయపడుతుంది. స్వేచ్ఛా రాశుల బారి నుండి తెల్ల రక్త కణాలను విటమిన్ సి రక్షిస్తుంది, తద్వారా ఇది తెల్లరక్తకణాలు సమర్థవంతంగా పని చేయటానికి సహాయపడుతుంది. దీనితో పాటు, విటమిన్ సి మన చర్మం యొక్క రక్షణ యంత్రాంగాన్ని, దాని ప్రతిబంధకాలు శక్తిని కూడా పెంచుతుంది, తద్వారా చర్మం సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నివారించడం  కూడా జరుగుతుంది.

విటమిన్ సి మరియు జ్ఞాపకశక్తి

పెరుగుతున్న వయస్సుతో పాటు జ్ఞాపకశక్తిని మరియు జ్ఞానశక్తిని బాధించే రుగ్మతలు ప్రబలే ప్రమాదం కూడా ఉంది. అయితే ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం మరియు సామర్థ్యాలలో తేలికపాటి మార్పులు పురోగమించే వయస్సుతో తప్పనిసరి అయినప్పటికీ, మరచిపోయే తత్త్వం మరియు జ్ఞాపకశక్తిని కోల్పోయే తీవ్రమైన లక్షణాల పురోగతిని అనేక విధాలుగా నివారించవచ్చు. అలాంటి పలు విధాల్లో మన దిన నిత్య ఆహారానికి విటమిన్ సి ని అదనంగా చేర్చడమనేది ఒకటి, ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
చిత్తవైకల్యం వ్యాధితో ఉన్న వ్యక్తుల రక్తంలో విటమిన్ సి ని తక్కువ స్థాయిల్లో  కలిగి ఉంటారని పలుసార్లు రుజువైంది. ఈ విషయాన్ని అనేక అధ్యయనాల ఆధారంగా పేర్కొనబడింది. విటమిన్ సి శక్తివంతమైన అనామ్లజనకం (యాంటీఆక్సిడెంట్) గనుక ఆమ్లజనీకరణ (ఆక్సీకరణ) ఒత్తిడి, వాపు-మంట  మరియు మెదడుకు కలిగే నష్టాన్ని నిరోధిస్తుంది. అందువల్ల, మీ మానసిక ఆరోగ్యానికి అనుకూల ప్రభావాల్ని చేకూర్చేందుకు మీరు విటమిన్ సి కల్గిన పదార్థాలను మీ దిననిత్య ఆహారానికి చేర్చుకోవాలని సిఫార్సు చేయడమైంది.  ముఖ్యంగా వయస్సు పైబడుతున్న తరుణంలో వయసుకు-సంబంధించిన  వ్యాధులను నివారించడానికి మరియు ఆ వ్యాధులు దాపురించడాన్ని ఆలస్యం చేయడానికి విటమిన్ సి సేవనం  చాలా అవసరం.

విటమిన్ సి గౌట్ (రక్తగతకీళ్లవాతం వ్యాధి) ని తగ్గిస్తుంది

విపరీతమైన నొప్పి, వాపు మరియు కీళ్లలో మృదుత్వం-సున్నితత్వంతో కూడిన బాధను కలిగి ఉండే రక్తగత కీళ్లవాతం (లేదా గౌట్) అది బాగా ముదిరిన ఆర్తరైటీస్ ఎవరికైనా దాపురించే ప్రమాదముంది. అయితే, మన దినానిత్య ఆహారానికి విటమిన్ సి ఆహారపదార్థాలను అనుబంధించి తినడం ద్వారా మనం ఈ వ్యాధి బారి నుండి తప్పించుకోవచ్చును .
2009 లో ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో భాగంగా 47,000 మంది మగాళ్ళకు విటమిన్ సి ని సేవింపజేసి చూడగా తేలిందేమిటంటే విటమిన్ సి సేవనం వల్ల రక్తగతకీళ్ళవ్యాధి నేరుగా తగ్గే అవకాశముంది అని. ఈ అధ్యయనంలో  కనుగొన్న ఫలితాల ప్రకారం, విటమిన్ సి సేవనం లో 500 mg మోతాదు పరిమాణాన్ని పెంచితే 17% రక్తగతకీళ్ళవ్యాధి తగ్గుతుంది. అదే, విటమిన్ సి మోతాదు పరిమాణంలో 1500 mg పెంచి, రోజూ సేవిస్తే, రక్తగతకీళ్ళవ్యాధి ప్రమాదాన్ని 45% తగ్గించవచ్చును . అందువల్ల పై అధ్యయనాలు అన్ని కూడా విటమిన్ సి యొక్క సేవనం రక్తగతకీళ్ళవ్యాధిని నివారించడంలో బాగా సహాయపడుతుందని సూచించాయి.

పంటి చిగుళ్ళ కోసం విటమిన్ సి

మీరు మీ పండ్ల చిగుళ్లలో రక్తస్రావం సమస్య వల్ల బాధపడుతున్నారా? మీరు ప్రతి రోజు బ్రష్ చేసినప్పుడల్లా నురుగులో రక్తం చారలు కనబడ్డం చూసి ఎందుకిలా అనుకుంటూ గాభరా పడుతున్నారా? మేము మీ ఆహారంలో మార్పులు చేసుకోమని మీకు సూచిస్తున్నాం మరియు అవసరమైతే విటమిన్ సి సప్లిమెంట్లను కూడా తీసుకోవాలని మెం మీకు సిఫార్స్ చేస్తున్నాం. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుందాని మీకిప్పటికీ తెలిసే ఉంటుంది. విటమిన్ సి అనామ్లజనకం కూడా అవటంవల్ల ఇది రోగనిరోధకతలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. మీ చిగుళ్ల కణజాలంలో ఎక్కువభాగం కొల్లాజెన్తో కూడుకున్నదని మీకిప్పటికే తప్పకుండా తెలిసి ఉంటుంది.
విటమిన్ సి మీ చిగుళ్ళపై రెండు విధాలుగా పని చేస్తుంది. ఈ విటమిన్ పండ్ల నిర్మాణ తీరును సమర్ధించడమే గాక మీ చిగుళ్లవ్యాధి లక్షణాలకు కారణమైన మరియు నోటిలో వ్యాధి-కారక సూక్ష్మవిష జీవుల విరుద్ధంగా కూడా పోరాడుతుంది. దంత-చిగుళ్ల వ్యాధికి దంతవైద్యులు కూడా విటమిన్ C తో కూడిన టూత్పేస్ట్ మరియు మౌత్ వాష్ లను ఉత్తమ ఫలితాల కోసం ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు.

క్యాన్సర్ నివారణకు విటమిన్ సి సహాయపడుతుంది

క్యాన్సర్ నివారణ మరియు ఆ వ్యాధి నిర్వహణకు గాను పోషక విలువలతో కూడిన తాజా ఆహారాన్ని వైద్యులు తరచుగా సిఫార్సు చేస్తారు. ఇందుకు, విటమిన్ సి కలిగి ఉన్న పండ్లు తరచుగా సూచించబడతాయి. ఈ పండ్లలోని విటమిన్ సి క్యాన్సర్ రక్షణాత్మక చర్యలకు కారణమని చెప్పవచ్చును , ఇది వివిధ పరిశోధకులచే నిరూపించబడింది కూడా. ఈ విషయంలోనే అధిక మోతాదులో విటమిన్ సి ని నరాలకు ఎక్కించే చికిత్సను (ఇంట్రావెనెస్) కూడా ప్రయత్నించినప్పటికీ, ఈ చికిత్సవల్ల కాన్సర్ రోగుల్లో  కొన్ని దుష్ప్రభావాలు గోచరించాయి. ఈ దుష్ప్రభావాల అనుభవంతో క్యాన్సర్తో బాధపడుతున్నవారిలో వారికి దీర్ఘాయువు ఇవ్వడానికి మరియు వారికి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వడానికి, ఇలా మందుల్ని నరాలకు ఎక్కించే బదులు విటమిన్ సి కి సంబంధించిన ప్రత్యామ్నాయ ఆహారాల్ని సేవింపజేయడం, మరియు మామూలు చర్యలనే చేపట్టడం ఉత్తమమని సూచించడమైంది.

బరువు కోల్పోయేందుకు విటమిన్ సి

మీరు ఎప్పటికప్పుడు వ్యాయామం చేస్తూనే ఉన్నారు, మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా జరుగుతోంది, కానీ శరీరంలోని ఆ అదనపు కిలోలని కోల్పోలేకుండా ఉన్నారా? బహుశా మీ ఆహారం ప్రణాళికలో కొంచెం లోపమున్నట్టుంది. అది విటమిన్ సి లేకపోవడం కావచ్చును . బరువు కోల్పోవడానికి  విటమిన్ సి అవసరం. విటమిన్ సి శరీరంలోని కొవ్వుల జీవక్రియకు సహాయపడుతుంది కాబట్టి, మీరు ఆరోగ్యకరమైన బరువు మరియు BMI ను సాధించటానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు కోల్పోయే వేగాన్ని కూడా ఈ విటమిన్ మెరుగుపరుస్తుంది. బరువు కోల్పోతున్నపుడు మీ శరీరం శక్తిని కోల్పోకుండా చూసేందుకు విటమిన్ సి  చాలా అవసరం. విటమిన్ సి శరీరం లో నిల్వ ఉండదు. విటమిన్ సి మల విసర్జనను కూడా  మెరుగుపరుస్తుంది మరియు ఆ క్రమంలో కడుపుబ్బరం వంటి పొట్ట సమస్యల్ని ఈ విటమిన్ నయం చేస్తుంది.

గుండెకు విటమిన్ సి యొక్క ప్రాముఖ్యత

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ వంటి అనేక ప్రమాద కారకాల వలన గుండె జబ్బులు సంభవించవచ్చు. ఈ ప్రమాద కారకాల్ని తగ్గించడం ద్వారా, విటమిన్ సి హృదయ-సంబంధ వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. విటమిన్ సి యొక్క హృదయరక్షక (కార్డియోప్రొటెక్టివ్) చర్యలు బాగా తెలిసినవే. కానీ విటమిన్ సి కి సంబంధించి, అది లభించే కృత్రిమ పదార్ధాలను సహజ వనరుల (ఆహారం మరియు పండ్లు)తో పోలిస్తే సహజ వనరులు మంచి ప్రభావాలను కలిగి ఉంటాయి, మరియు ఈ సహజ వనరులు హృదయ వ్యాధుల ప్రమాదాన్ని దాదాపు 25% తగ్గిస్తాయి.

చక్కెరవ్యాధి (మధుమేహం)కి విటమిన్ సి

చక్కెరవ్యాధితో (డయాబెటిస్తో) బాధపడుతున్న వ్యక్తులు తరచూ రక్తంలో అధిక స్థాయి అల్పస్థాయిల తో బాధపడుతుంటారు. ఇందులో రక్త చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగడం మరియు ఇతర సమయాల్లో సాధారణ పరిమితుల కంటే చాలా తక్కువస్థాయికి పడిపోవడం జరిగి “హైపోగ్లైసీమియా” వ్యాధి మరియు మూర్ఛ రోగం వచ్చే ప్రమాదాన్ని కూడా  పెంచుతుంది. విటమిన్ C అధికంగా ఉన్న ఆహారాన్ని సాధారణ పరిధి మోతాదుల్లో సేవిస్తే శరీరంలో సి విటమిన్ స్థాయిలను స్థిరీకరించడానికి మరియు నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అయితే కొన్ని పండ్ల (మామిడి) లో అధిక చక్కెర  ఉంటుంది అన్న విషయాన్ని మనం స్పృహ కలిగి సేవించడం చాలా అవసరం.

ఒక రోజుకు విటమిన్ C మోతాదు

విటమిన్ సి తాజా పండ్లు మరియు కూరగాయల రూపంలో లభ్యమవుతుంది. ఇంకా, మీ వైద్యుడు లేదా దంతవైద్యునిచే సిఫార్సు చేయబడినట్లయితే, మీరు విటమిన్ సి సప్లిమెంట్స్, టాబ్లెట్స్ మరియు మౌత్వాష్ ల వంటివి కూడా వాడటానికి అందుబాటులో కూడా ఉంటాయి. వీటిని ఎలాంటి దుష్ప్రభావాలు, లేదా విషప్రభావాన్ని (టాక్సిసిటీ) కలుగకుండా తీసుకోవాలంటే డాక్టర్ సలహా-సంప్రదింపులు అత్యవసరమే
అన్ని వయసులకూ సిఫార్సు చేయబడిన విటమిన్ C యొక్క రోజువారీ మోతాదు (డైలీ అల్లావన్స్- RDA) క్రింద చెప్పబడింది. ఏదేమైనప్పటికీ, విటమిన్ సి మోతాదు వ్యక్తిగత ఎత్తు, బరువు మరియు ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది. విటమిన్ సి కి సంబంధించిన ఆహారసేవనం మార్పుల విషయంలో వైద్యుడి సంప్రదింపులు చాలా అవసరం.
వయసు    పురుషులు  స్రీలు
6 మాసాల వరకూ 40 mg  40 mg
7 మాసాల నుండి 1 ఏడాది వరకూ  50 mg  50 mg
1 ఏడాది నుండి 3 ఏండ్ల వరకూ  15 mg  15 mg
4 ఏండ్ల నుండి 8 ఏండ్ల వరకూ  25 mg  25 mg
9 ఏండ్ల నుండి 13 ఏండ్ల వరకూ  45 mg  45 mg
14 ఏండ్ల నుండి 18 ఏండ్ల వరకూ  75 mg   65 mg
19 ఏండ్ల వయసు, ఆపైన (వయోజనుల మోతాదు)   90 mg  75 mg
మహిళలకు పైన పేర్కొన్న పరిమాణాలు కాకుండా, గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులు విటమిన్ సి ని అదనంగా తీసుకోవాలి:
గర్భిణీ స్త్రీలకు సిఫార్సు చేయబడిన రోజువారీ విటమిన్ సి మోతాదు 85mg గా ఉంది.
పాలిచ్చే తల్లులకు 125mg మోతాదులో విటమిన్ సి ని  కూడా తీసుకోవాలి.

విటమిన్ సి లోపం

విటమిన్ C యొక్క లోపం స్కర్వీ వ్యాధిని కలుగజేస్తుంది అని ప్రసిద్ధి. స్కర్వీ వ్యాధి కింది సంకేతాలు మరియు లక్షణాలను కల్గి ఉంటుంది.
  • చెంచా ఆకారపు గోర్లు
  • పొడిబారిన, దెబ్బతిన్న చర్మం
  • కాస్త దెబ్బకే గాయాలవడం
  • ఎముకలు లేదా కీళ్ళలో నొప్పి
  • పిల్లలలో ఎముక వైకల్యాలు
  • రక్తహీనత
  • అతి తక్కువ రోగనిరోధక శక్తికి గురైపోవటంవల్ల అంటురోగాలకు ఎక్కువగా  బలవడం
  • కీళ్ళు వాపు (వాపు), సాధారణంగా దీర్ఘకాలికమైన నొప్పితో కూడినవి.
  • అలసట
  • బరువు పెరుగుట
Read More  మెడ యొక్క చర్మాన్ని తెల్లగా మార్చడానికి ఒక గొప్ప చిట్కా.

 

ఈ లక్షణాలు ఏవైనా మీరు అనుభవిస్తున్నట్లైతే మీ వైద్యుడిని వెంటనే సంప్రదించి తెలియజేయండి.

విటమిన్ సి అధిక మోతాదు

ఒకవేళ మీరు సిఫార్సు చేసిన మోతాదుల్ని మించి విటమిన్ సి మందుల్ని గనుక సేవించి ఉన్నా లేదా చాలాకాలం నుండి ఈ మందుల్ని సేవించడం జరిగి ఉంటే, కింది దుష్ప్రభావాలు సంభవిస్తాయి:
  • వికారం
  • అతిసారం
  • పొత్తి కడుపులో తిమ్మిరి (కడుపు నొప్పి)
  • కడుపు నొప్పి (stomach upset)
  • విటమిన్ సి ని సుదీర్ఘమైనకాలంపాటుగా వాడడం వల్ల కూడా దంతాలపై ఎనామెల్ కోల్పోవడం జరుగుతుంది, ఇది పంటిలో సున్నితత్వం (sensitivity) లేదా పంటిలో నొప్పిగా గుర్తించబడుతుంది.
  • ప్రతిచర్య (అలెర్జీ) స్పందనలు కూడా కొందరు వ్యక్తులలో సంభవించవచ్చు.
  • విటమిన్ బి 12 తగ్గిన స్థాయిలు.

 

హైపోరోక్షాలూరియా (hyperoxaluria) వ్యాధి (మూత్రపిండాల ద్వారా ఆక్సిలేట్ యొక్క అధిక విసర్జన) యొక్క వంశానుగత చరిత్రను గనుక మీరు కలిగివుంటే, విటమిన్ సి తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు సిఫార్సు చేయడమైంది. ఎందుకంటే, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి. మీరు వంశపారంపర్య హెమోక్రోమాటోసిస్ (అదనపు ఇనుము) అనే వ్యాధివల్ల బాధపడుతున్నట్లయితే, విటమిన్ సి ని దీర్ఘకాలంపాటు సేవించినా, మరియు అధిక మోతాదుల్లో  సేవించినా, “కణజాల నష్టం” సంభవిస్తుంది. అన్ని పరిస్థితులలోను, మీ డాక్టరు యొక్క సలహా సంప్రదింపులు లేకుండా మందులు గాని మరెలాంటి విటమిన్ సి కి సంబంధించిన మందులను గాని తీసుకోవద్దని మీకు సిఫారసు చేయడమైంది.
Sharing Is Caring:

Leave a Comment