ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండి చర్మంపై హానికరమైన బాక్టీరియాని తొలగించి మొటిమలు వంటివి రాకుండా సహాయపడుతుంది
చర్మం ఆరోగ్యంగా మరియు సహజసిద్ధంగా తేమగా ఉండటానికి ఆవ నూనె చాలా బాగా సహాయ పడుతుంది.ఇది ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
ఆవనూనెను ముఖం మీద రాసి మసాజ్ చేస్తే చర్మం తేమగా ఉండటమే కాకుండా చర్మము యొక్క సమస్యలు అన్ని దూరం అవుతాయి.
ఆవనూనెను చర్మానికి రాసి మసాజ్ చేయడం వలన టానింగ్, పిగ్మెంటేషన్ మరియు నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి .
ఆవనూనెను తరచుగా రాయడం వల్ల చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా పని చేస్తుంది.దీనితో చర్మం మృదువుగా తయారవుతుంది.
ఇది చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేసి చర్మాన్ని లోతుగా శుభ్రపరచి ముఖంపై మృత చర్మ కణాలను శుభ్రపరుస్తుంది
ఆవనూనె వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.
ఆవనూనె ముఖంపై ఉండే సన్నని గీతలు, ముడతలు మరియు రంధ్రాలను తగ్గించి మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.