కోడిగుడ్డు తినటం వల్ల కలిగే లాభాలు
Health Tips
Health Tips
By Pamu Udaya
By Pamu Udaya
గుడ్డులో ఎక్కువగా పోషక పదార్థాలు ప్రొటీన్లు, కొలిన్ ,కొవ్వులు అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలు ఉంటాయి.
ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్ విటమిన్ ఏ మరియు కాల్షియం ఉంటాయి.
ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుంది
ప్రతి రోజు ఒక కోడిగుడ్డును ఆహారములో బాగా తినడం వల్ల బరువును పెరగకుండా అదుపులో ఉంచేందుకు సహాయ పడుతుంది.
అల్పాహారంలో తప్పకుండా కోడిగుడ్డును తీసుకుంటే మంచిది. కోడిగుడ్లను తరుచూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
గుడ్డులో ఉండే ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులకు మరియు బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది.
తక్కువ రక్తము ఉన్నవారు ప్రతి రోజు ఒక కోడిగుడ్డు తినడం చాలా ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది
శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలను కోడిగుడ్డు కలిగి ఉంటుంది. ఇది జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
గుడ్డులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీనిని తరచుగా తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడతుంది.
కోడి గుడ్డు పచ్చసొనలో ఉండే కోలిన్ మెదడు కణాల ఆరోగ్యాన్ని మరియు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
గుడ్డులో పొటాషియం మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు , దంతాలు గట్టిపడటానికి బాగా ఉపయోగపడతాయి.
నరాల బలహీనత ఉన్న వారు ప్రతి రోజూ గుడ్డును తప్పక తీసుకోవాలి. అలా తినడం వల్ల నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది.
Click Here