దలైలామా సూక్తులు తప్పక చదవాలి

Quotations

By Pamu Udaya

ఒక యుద్ధంలో వేలాది మందిని జయించటం కంటే, తనను తాను జయించుకోవడమే గొప్ప విజయం.

ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి: మీరు మీ జీవితాన్ని అనుకున్న విధంగా జీవించకుండా ఉండటానికి అడ్డుకుంటోంది ఏది అని.? - దలైలామా

మన జీవిత ముఖ్య ఉద్దేశ్యం. ఇతరులకు సాయం చెయ్యడమే. అలా చేయలేకపోతే... కనీసం ఇతరులను బాధించకుండానైనా ఉండండి.

ఒక్కొక్కసారి మీకు కావలసినది పొందలేకపోవడం కూడా, మీ అదృష్టం యొక్క ప్రభావమే అని భావించండి

మీరు మాట్లాడితే మీకు తెలిసిన విషయాలని మాత్రమే మరలా చెబుతారు. అదే వింటే, ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలరు.

క్రమశిక్షణ గల మనస్సు ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణ లేని మనస్సు బాధలకు దారితీస్తుంది.

ప్రతిరోజూ ఉదయం మీరు మేల్కొనేటప్పుడు ఈ విధంగా ఆలోచించండి: ఈ రోజు నేను సజీవంగా ఉండటం నా అదృష్టం, నా జీవితంలో ఎంతో విలువైన, ఈ రోజుని నేను వృథా చేయను అని.

ఏదైనా సాధించడానికి మీరు చాలా చిన్నవారు అన్న భావన మీకు కలిగితే, వెళ్లి దోమతో నిద్రించడానికి ప్రయత్నించండి.