మునగాకు కారం పొడి ఇలా చేయండి
Health Tips
Health Tips
FBy Udaya
FBy Udaya
కందిపొడిలాగే మునగ ఆకులతో కూడా రుచికరమైన పొడిని చేసుకోవచ్చును
తయారీకి కావాల్సిన పదార్థాలు నువ్వులు - ఒక కప్పు, ఎండిన మునగాకులు - ఒక కప్పు, మినపప్పు - ఒకటిన్నర స్పూను
ఎండిమిరప కాయ -ఒకటి, ఇంగువ పొడి - చిటికెడు వెల్లులి -ఐదు ఉప్పు - తగినంత
నువ్వుల్ని బాగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటిని పాన్ లో వేసి కొద్ది సేపు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు పాన్ లో కొంత నూనె వేసి వేడి చేయాలి. అందులో ఎండుమిర్చి, ఇంగువ పొడి, మినపప్పు వేసి బాగా వేపాలి
అనంతరం వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మళ్లీ నూనె వేసి మునగాకుని వేసి వేయించాలి
ఆకులు రంగు మారకుండానే స్టవ్ కట్టేయాలి
ఇప్పుడు మిక్సీలో మునగాకు, ఉప్పు, వేయించి పెట్టుకున్న నువ్వులు, ఎండు మిర్చి మరియు ఇంగువ పొడి, మినపప్పు వెల్లులి మిశ్రమం వేసి పొడి చేసుకోవాలి
దానికి వేరుశెనగపలుకు, కారం కలిపి చేసిన పొడిని కూడా వేసి కలపాలి. అంతే మునగాకు పొడి తయారు అయినది
దీనిని గాలి చొరబడని డబ్బాల్లో దాచి నచ్చినప్పుడు అన్నంలో వేసి తినొచ్చును
బార్లీ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
Learn more