చింత చిగురు యొక్క ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు 

Health Tips

By Pamu Udaya

చింత చిగురును  చాలా మంది పప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో త‌యారు చేసుకుని తింటుంటారు. 

చింత చిగురులో విట‌మిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. 

ఇందులో ఉండే ఫైబర్‌ వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు పైల్స్ను  నివారిస్తుంది.

చింత చిగురుతో సీజ‌న‌ల్ గా వ‌చ్చే వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చును . 

చింత చిగురులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. 

చింత చిగురులో ఉండే పోష‌కాల వ‌ల్ల పాలిచ్చే త‌ల్లులకు పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి. 

మ‌హిళ‌లు చింత చిగురును తింటే నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.దీని వల్ల హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.

చింత చిగురు తినడం వల్ల   ద‌గ్గు, జ‌లుబు  మరియు  ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

చింత చిగురులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి.అం దువ‌ల్ల నొప్పులు మరియు  వాపులు త‌గ్గుతాయి. 

 చింత చిగురు తినడం వల్ల కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. 

చింత చిగురులో ఉండే విట‌మిన్ సి దంతాల‌ను మరియు  చిగుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

దీని వల్ల  చిగుళ్ల నుంచి అయ్యే ర‌క్త‌స్రావం త‌గ్గి, నోటి దుర్వాస‌న నుంచి ఉప‌శ‌మ‌నం కూడా ల‌భిస్తుంది.

మ‌లేరియా జ్వ‌రం వ‌చ్చిన వారు చింత చిగురు తింటే త్వర‌గా తగ్గుతుంది .

ప‌చ్చకామెర్ల‌కు  మరియు  మ‌ధుమేహం ఉన్న‌వారికి కూడా చింత చిగురు మంచి మందు లా ప‌నిచేస్తుంది.

చింత చిగురును కొద్దిగా  తీసుకుని దంచి ముద్ద‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే గాయాలు మరియు  పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి