లవంగాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By: Pamu Udaya

లవంగం ఒక ప్రసిద్ధ మసాలా. ఈ మసాలాను సాధారణంగా కూరల్లో ఉపయోగిస్తారు. దీనిలో  క్రిమినాశక, యాంటీవైరల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.  

లవంగాలలో అనేక పోషకాలు  మరియు ఫైబర్, విటమిన్ కె మరియు మాంగనీస్ ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.  

లవంగాలలో కేలరీలు తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది శరీరం మంచి జీవక్రియ రేటు వేగవంతం చేసి  బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

దగ్గు మరియు కఫం తగ్గించడంలో లవంగాలు సహాయపడుతాయి.  

లవంగాలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల దంతాలకు మేలు చేస్తుంది .

 ఇది పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు  బాగా పనిచేస్తుంది.

లవంగంలో యూజినాల్ అనే పదార్ధం ఉండడం వల్ల అధిక రక్తస్రావం జరగకుండా కాపాడుతుంది . 

లవంగాలు రక్తంలోని  చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం ఉన్నవారికి బాగా సహాయపడుతాయి.