ప్రతి రోజు కొత్తిమీరా ను ఆహారం గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
Health Tips
Health Tips
By Pamu Udaya
By Pamu Udaya
కొత్తి మీరలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-ఎ, సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ గా ఉన్నాయి.
కొత్తి మీరాలో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఇది శరీరంలో ఏర్పడే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను తగ్గిస్తుంది.
కొత్తిమీర లో ఉండే కాల్షియం ఎముకలను దృఢ పరుస్తుంది.దీనిని తరచుగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చును
కొత్తిమీర ఒత్తిళ్లు మరియు మానసిక ఆందోళన ను కూడా తగ్గిస్తుంది. నిద్ర లేమి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్లమెటరీ గుణాలు కిళ్ల నొప్పులను తగ్గిస్తుంది.నోటిలో ఏర్పడే పూతను మరియు పుండ్లను కొత్తిమీర నివారిస్తుంది.
శరీరంలోని బ్యాడ్ కొలేస్ట్రాల్ తగ్గించడంలో కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుంది.ఇది అధిక రక్త పోటును నివారించి గుండె నొప్పులు రాకుండా అరికడుతుంది.
కొత్తిమీరలో శరీరానికి అవసరమయ్యే ఆయిల్స్ రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది .ఇది కాలేయ యొక్క పని తీరును మెరుగుపరుస్తుంది.
స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యలు కొత్తిమీర తగ్గిస్తుంది.దీనిని తరచుగా వాడటం వల్ల డయేరియా ను తగ్గిస్తుంది.
కొత్తిమీరను తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడే వికారం మరియు వాంతుల సమస్య నుండి శరీరాన్ని కాపాడుతుంది.
Click Here