సీతాఫలం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Health Tips
Health Tips
By Pamu Udaya
By Pamu Udaya
సీతాఫలంలో ఫ్లేవనాయిడ్లు, కైరోలాయిక్ యాసిడ్, విటమిన్-సి కెరోటినాయిడ్ యాసిడ్స్ వంటి శోథ నిరోధక లక్షణాలకు మంచి మూలం..
సీతాఫలంలో కార్బోహైడ్రేట్లు,సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ , కొవ్వు అధికంగా ఉండడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది.
సీతాఫలంలో ఉండే విటమిన్ ఎ మరియు రెబోఫ్లేవిన్ కంటిచూపు మరియు మెదడు పనితీరును బాగా మెరుగుపరుస్తుంది
సీతాఫలంలో లభించే లుటిన్ మరియు జియాక్సంతిన్ వయస్సు సంబంధిత కంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి.
గర్భిణీ స్త్రీలు సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు మరియు గర్భస్త శిశువుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మన శరీరంలోని రక్తంలో ఉన్నచక్కెర యొక్క స్థాయిలను నియంత్రించడంలో సీతాఫలం బాగా సహాయపడుతుంది.దీని వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది
సీతాఫలంలో పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి . ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది
సీతాఫలంలో ఉండే ఎసిటోజెనిన్, కెటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ లు ఆల్కలాయిడ్ లు వివిధ రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో కూడా సహాయపడతాయి
సీతాఫలంలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఈ ఫలం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది
ినిలో ఉండే ఎక్కువగా పీచు పదార్థాలు ,కాపర్ మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సీతాఫలం తినడం వల్ల ఐరన్ లోపాన్ని తగ్గించి హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్త హీనతను తగ్గిస్తాయి.
సీతాఫలంలో ఉండే విటమిన్-బి మరియు డైటరీ ఫైబర్‌లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో బాగా సహాయపడతాయి.
సీతాఫలం లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మము మరియు జుట్టు ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది
సీతాఫలం పండును తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంటాయి.దీని తినడం వల్ల కొన్ని దంత సమస్యలను నివారించవచ్చును
సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్ ను తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులకు సీతాఫలం గొప్ప ఆయుర్వేద చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది. ఇది కీరుమటాయిడ్ తగ్గించడంలో సహాయపడుతుంది
సీతాఫలం పండును తినడం వల్ల పిల్లల యొక్క కండరాలను బలోపేతం చేయడానికి మరియు పెరగడానికి బాగా సహాయపడుతుంది
Click Here