జామ ఆకుల  వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By Pamu Udaya

జామ ఆకులు అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.వీటి కాషాయం తాగడం వల్ల కొన్ని రకాల వ్యాధులను  నివారించవచ్చును 

జామ ఆకుల యొక్క శోథ నిరోధక లక్షణాలు పంటి నొప్పిని  మంట  మరియు కీళ్ల వాపును తగ్గించడంలో కూడా  సహాయపడతాయి.  

జామాకులు రక్తంలోని  చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ రాకుండా కాపాడుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.    

స్త్రీ లలో ఋతుస్రావం యొక్క బాధాకరమైన లక్షణాలను తగ్గించడానికి  జామాకుల కాషాయం తాగడం బాగా  సహాయపడుతుంది 

 జామాకుల కాషాయం రోజులో ఒకసారి  తాగడం వల్ల  శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి  బాగా సహాయపడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచడంలో జామాకులు చాలా బాగా సహాయపడుతాయి. ఇవి క్యాన్సర్ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి

జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు  మరియు  మృదువుగా  చేయటంలో బాగా  ఉపయోగపడుతాయి.  

జామ ఆకుల కషాయాన్ని పుక్కిలించడం ద్వారా పళ్ళలో దంతక్షయానికి కారణమయ్యే పురుగులను నశింపచేసి పంటి సమస్యలను తగ్గిస్తుంది.