Kokum అనేది పండు రూపంలో మరియు  డ్రై రూపంలో కూడా దొరుకుతుంది.ఈ పండు పుల్లని రుచిని కలిగి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పులుపు కోసం కూరల్లో ఈ పండును వాడతారు. 

Health Tips

By Pamu Udaya

Kokum పండు మార్కెట్ లో జ్యూస్ రూపంలో కూడా లభిస్తుంది.దీనిలో లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి

కొకుమ్‌ పండు  శరీరంలోని  అనేక రకాల బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్‌లను నివారించటంలో  బాగా సహాయపడుతుంది.

దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్  విటమిన్ సి ఎక్కువ గా ఉండడం వలన ఇన్ఫెక్షన్ కలిగించే కణాల పెరుగుదలను కూడా  నిరోధిస్తుంది.  

కొకుమ్‌ పండు ఎసిడిటీ,గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం  కూడా కలిగిస్తుంది.ఇది శరీర బరువును త్వరగా తగ్గించడంలో బాగా  సహాయపడుతుంది.

Kokumలో కేలరీలు తక్కువగా ఉండి మెగ్నీషియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి  ఎక్కువగా ఖనిజాలు ఉంటాయి. ఇది ఒక  ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  

ఇది  రక్తపోటు నియంత్రణలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా  కూడా చేస్తుంది.దీనిలో ఉండే హైడ్రాక్సిల్ యాసిడ్ తినాలనే కోరికను తగ్గించి ఆకలిని కూడా తగ్గిస్తుంది

కొకుమ్‌ పండు లో ఫ్లేవనాయిడ్స్, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ , గార్సినోల్ మరియు ఆంథోసైనిన్‌లు చాలా  ఉంటాయి.  

కొకుమ్‌ పండు మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచి  ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో  కూడా సహాయపడుతుందిది

కొకుమ్‌ పండు శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచి , తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది.