పుదీనాలో విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు విటమిన్ బి 6 లతో పాటు మేగ్నిషియం , క్యాల్షియం , ఐరన్, మాంగనీస్ పొటాషియం, మినరల్స్ వంటివి అధికంగా ఉంటాయి
పుదీనాలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ , క్యాలరీస్ , ప్రోటీన్స్ లాంటి పోషక పదార్ధాలు కూడా ఉంటాయి. పుదీనాలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది పుదీనాను తరుచుగా తీసుకోవడం వల్ల ఆస్తమాని అదుపులో పెట్టుకోవచ్చును .
పుదీనాలో ఉండే మెంథాల్ తలనొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు, అజీర్ణం, మలబద్దకం నుండి ఉపశమనాన్ని కలిగించడంలో సహాయపడుతుంది.
పుదీనా ఆకుల రసం కంటి క్రింద నల్లని మచ్చలు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది పుదీనా రేచీకటి సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడగలదు
దీనిని పై పూత గా ఉపయోగించడం వల్ల కాలిన గాయాలు మరియు శరీరంపై ఏర్పడ్డ దురద మరియు చర్మం సమస్యలను కూడా తొలగించుకోవచ్చును
పుదీనా ఆకులను మెత్తగా నూరి మొఖానికి రాసుకోవడం వలన కాంతి వంతమైన మరియు సహజవంతమైన చర్మాన్ని కూడా పొందవచ్చు.పుదీనా మొటిమలను కూడా తగ్గిస్తుంది.
తాజా పుదీనా ఆకులను నమలడం ద్వారా దంత సమస్యను నివారించుకోవచ్చు.పుదీనా ఆకులను తినడం ద్వారా నోటి దుర్వాసనను నివారించవచ్చును .
గర్భణి స్త్రీలు పుదీనా ను తీసుకోవడం వల్ల వికారం మరియు అలెర్జీ సమస్యలు తగ్గించుకోవచ్చును