మునగాకు జ్యూస్ వలన ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By Udaya

మునగాకులో విటమిన్ బి6, విటమిన్ ఎ ప్రొటీన్లు విటమిన్ బి2 ఐరన్ మెగ్నీషియం, విటమిన్ బి6 మొదలైన పోషకాలు అధికంగా ఉంటాయి మునగాకు రసం వివిధ వ్యాధులను కూడా నయం చేయగలదు

మునగాకును ఏ రూపంలోనైనా క్రమం తప్పకుండా తీసుకుంటే, శరీరానికి ఐరన్ మరియు క్యాల్షియం పుష్కలంగా అందుతాయి ఇది ఎముకలను బలపరుస్తుంది

మునగ చెట్టు వేళ్లను బాగా శుభ్రం చేసి, ఆవేళ్లతో రసం చేయాలి. ఈ మిశ్రమాన్ని బెల్లం కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మైగ్రేన్ తగ్గుతుంది

కొన్నిమునగ ఆకులను పేస్ట్‌లా చేసి, దానికి తేనె కలపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే కంటికి సంబంధించిన సమస్యలను తొలగించవచ్చును 

మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి

బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి ఉండటం వల్ల క్యాన్సర్ కారక రసాయనాలు కూడా తొలగిపోతాయి

షుగర్ లెవెల్ కంట్రోల్ కావాలనుకునేవారు మునగాకును ఎండ బెట్టి పొడి చేసుకోని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి ఇది డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

మునగాకులో సహజసిద్ధమైన యాంటీబయాటిక్స్ ఉంటాయి.ఈ ఆకుల రసాన్ని తరచుగా తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది

ఇది చర్మ సమస్యలకు చికిత్స చేయవచ్చును మునగాకు రసాన్ని సేవిస్తే వయసు రీత్యా శరీరంపై కనిపించే ముడతలు పోతాయి

మునగ ఆకు కారం పొడి ఇలా చేయండి