బూందీ లడ్డు తయారు చేయు విధానము 

Recipe

By Pamu Udaya

శనగపిండి-ముప్పావు కిలో, నూనె-ఒక కేజి, పంచదార-ఒక కేజి,యాలకుల పొడి-ఒక టీస్పూన్‌, కిస్మిస్- 100గ్రాములు, జీడిపప్పు-100 గ్రాములు

కావలసిన  పదార్ధాలు

ఒక గిన్నెలో  శనగపిండి, నీళ్లు పోసి బూందీ వేయడానికి వీలుగా పిండిని కాస్త లూజు గా కలుపుకోవాలి

తయారీ విధానం::

స్టవ్‌పై మూకుడు  ను ఉంచి నూనె పోసి అది బాగా మరిగాక బూందీ దూసే గరిటెలో శనగపిండిని వేసి చేతితో కలుపుతూ ఉంటే మూకుడు  లో బూందీ పడుతుంది 

 ఈ బూందీని వేగిన తరువాత బూందీని తీసి మరో గిన్నెలో వేసుకోవాలి.మరో మూకుడు   స్టవ్‌పై ఉంచి అందులో పంచదార, నీళ్లు పోసి కాస్త లేత పాకం వచ్చే వరకు కలపాలి 

 పాకము రాగానే  బూందీని అందులో వేసి ఆగకుండా  ఒక పావుగంటపాటు కలుపుకోవాలి .అందులో  యాలకుల పొడి వేసి మళ్లీ ఒకసారి బాగా కలపాలి

తరువాత   నేతిలో కిస్మిస్ మరియు జీడిపప్పును దోరగా వేయించి పాకం లో కలపాలినెయ్యి  లేదా నూనె ను అర చేతికి రాసుకుని లడ్డూలుగా చేసుకోవాలి