ఒక గిన్నెలో కీరదోస జ్యూస్ , పెరుగు మరియు రోజ్ వాటర్ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుపై బాగా రుద్దుతూ మర్దనా చేయాలి.
కొద్ది సేపు తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముక్కుపై మచ్చలు తొలగిపోతాయి.
ఒక గిన్నెలో కొద్దిగా నిమ్మరసాన్నిమరియు రోజ్ వాటర్ ను వేసి బాగా కలపాలి. తరువాత దీనిలో దూదిని ముంచి దానితో ముక్కుపై బాగా రుద్దుకోవాలి
కొద్ది సమయం తరువాత చల్లటి నీటితో బాగా కడగాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముక్కుపై ఉండే నల్ల మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.
కలబంద జెల్ ను కొద్దిగా తీసుకుని ముక్కుపై బాగా రుద్దుకోవాలి . తరువాత చల్లని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా
తరచుగా వాడడం వల్ల ముక్కుపై ఉండే మచ్చలు అన్ని తొలగిపోతాయి.
ఒక గిన్నెలో కొద్దిగా రోజ్ వాటర్ మరియు గ్లిసరిన్ ను వేసి బాగా కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ముక్కుపై రుద్దుతూ మర్దనా చేయాలి.
కొద్దిసేపు తరువాత నీటితో బాగా కడగాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముక్కుపై ఉండే మచ్చలు అన్నీ తొలగిపోతాయి
కొద్దిసేపు తరువాత నీటితో బాగా కడగాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముక్కుపై ఉండే మచ్చలు అన్నీ తొలగిపోతాయి