నోటి దుర్వాసన నివారించడానికి సులువైన చిట్కాలు
Health Tips
Health Tips
By Pamu Udaya
By Pamu Udaya
జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండడంవల్ల అందువల్ల భోజనం చేసిన తరువాత కొద్దిగా నోట్లో వేసుకోవడం వల్ల దుర్వాసన రాదు.
ఉదయాన్నే లేచి నోరు శుభ్రం చేసుకున్నాక మెంతి నీళ్లను లేదా మెంతులు తినడం వల్ల నోటి దుర్వాసన తొందరగా పోతుంది.
నీళ్లు తాగడం వల్ల లాలా జల గ్రంథులను ఉత్తేజంగా ఉంచుతుంది. ఎక్కువగా నీళ్లు తాగితే నోటి దుర్వాసనను అదుపులో ఉంచవచ్చును
ప్రతి రోజులో రెండు లేదా మూడు లవంగాలు నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉండడం వల్ల నోటి దుర్వాసన రాదు
నిమ్మకాయ రసాన్నికొద్దిగా నీళ్లలో వేసి ఆ నీళ్లతో నోటిని పుక్కిలించడం వల్ల ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది .
దాల్చిన చెక్క ను నీటిలో మరిగించి టీ లా లేదా పొడిని నీటిలో వేసి నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన మాయమవుతుంది.
టీ ట్రీ ఆయిల్ ను నీళ్లలో వేసి ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన పోయి తాజా అనుభూతిని ఇస్తుంది.
సొంప్ ను ప్రతిరోజు ఆహారం తీసుకున్న తరువాత కొద్దిగా నోట్లో వేసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు నోటి దుర్వాసన సమస్య కూడా సులువుగా పరిష్కారం అవుతుంది.
Click Here