మైగ్రేన్ నొప్పిని నివారించడానికి చిట్కాలు

Health Tips

By Pamu Udaya

మైగ్రేన్ అనేది మానసిక వత్తిడి వల్ల వచ్చే సమస్య

మనస్సుపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయడం మంచిది .

 ప్రశాంతమైన వాతావరణంలో  ఎలాంటి అలికిడి లేని ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవడం చాలా  మంచిది.తల లో టెన్షన్‌ను తగ్గించడానికి గోరువెచ్చని నూనెతో  మసాజ్ చేయడం వల్ల  మైగ్రేన్ తగ్గించవచ్చును. 

లావెండర్ నూనెలో నొప్పిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. దీన్ని తలపై అప్లై చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు

 పిస్తా,  బాదం మరియు జీడిపప్పు నొప్పి నివారిణిగా  కూడా పనిచేస్తాయి.

గోరు వెచ్చని నీటిలో టీ స్పూన్ అల్లం జ్యూస్ మిక్స్ చేసి తాగితే తల నొప్పి తగ్గుతుంది .

గోరు వెచ్చని పాలలో ఒక అర చెంచా పసుపు కలుపుకుని తాగితే కూడా  తల నొప్పి తగ్గుతుంది.

మైగ్రేన్‌తో బాధపడేవారికి పుదీనాను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో అల్లం బాగా  సహాయపడుతుంది.

చెర్రీస్ తినడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

కారంగా ఉండే ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి . విటమిన్ సి మరియు  విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిసుకోవాలి .

మిక్స్‌లో  వెల్లుల్లి మరియు  2 చుక్కల నీరు వేసి, పేస్టులా  తయారు చేసి  ఆమిశ్రమాన్ని  తలపై అప్లై చేయడం వల్ల అసౌకర్యం తగ్గుతుంది.

అరటిపండ్లు, చిన్న పరిమాణంలో బ్రోకలీ, కాఫీ మరియు బచ్చలికూర తలనొప్పిని నివారించడానికి గొప్ప మార్గాలు