వీటితో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి 

Health Tips

By Pamu Udaya

క్యాబేజీ మరియు బ్రోకలీ వంటి ఆకు కూరలు  తరచు  తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి మోకాళ్ల నొప్పులు  రాకుండా  ఉంటాయి . 

నట్స్‌ లో విటమిన్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. నట్స్ తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

అల్లంమరియు  పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా ఈ రెండు దినుసులని ఆహారం  లో చేర్చుకుంటే  చాలా మంచిది. 

నారింజ, స్ట్రాబెర్రీమరియు చెర్రీస్ వంటి పండ్లను తినాలి. వీటిలో విటమిన్ సి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. .

ఇవి ఎముకల వాపును తగ్గిస్తాయి అన్ని పాల ఉత్పత్తులలో విటమిన్ డి మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి . ఇవి ఎముకల పటిష్టతకు మేలు చేస్తాయి.

నిమ్మ సిట్రస్‌ యాంటీ-ఇన్ప్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

ప్రతిరోజూ ఆవాల నూనెను రెండు సార్లు మోకాలు నొప్పి ఉన్న చోట రాయడం వల్ల  నొప్పుల నుండి  ఉపశమనం పొందవచ్చును .

మోకాలి నొప్పిని నయం చేసే గుణాలు ఎప్సం సాల్ట్ లో అధిక మోతాదులో ఉంటాయి. ఇది  తరచు తీసుకోవడం వల్ల  నొప్పులు  రావు

అవిసెగింజలలో ఎక్కువగా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్  ఉండడం వల్ల మోకళ్ల నొప్పుల నివారణకు బాగా పని చేస్తాయి.

పనసపండులో కాల్షియం మరియు  మాంగనీస్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలం చేకూరుతుంది. అందువల్ల కీళ్లనొప్పులు తగ్గిపోతాయి. 

ఉల్లిపాయల్లో సల్ఫర్‌ మరియు  ఆంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ గా ఉంటాయి. దీని వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.