విటమిన్ ఇ ఆయిల్‌ ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By Pamu Udaya

విటమిన్ ఇ జుట్టుకు మరియు చర్మానికి విటమిన్ ఇ ఆయిల్‌ చాలా మంచిది. విటమిన్ ఇ ఆయిల్‌  మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది 

తలస్నానం చేసి విటమిన్‌ ఇ ఆయిల్‌ను జుట్టుకు  రాసుకుంటే జుట్టు  మృదువుగా మరియు స్కిల్  లాగా మారుతుంది. 

విటమిన్‌ ఇ ఆయిల్‌ను   కొబ్బరి నూనెలో  కలిపి తలకు రాసుకుంటే జుట్టుకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి .

విటమిన్‌ ఇ ఆయిల్‌ ను  రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలపై రాసి మసాజ్‌ చేయాలి. ఇలా  తరచుగా  కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

విటమిన్‌ ఇ  ఆయిల్‌లో పసుపు వేసి  కలిపుకొని  బ్లాక్‌ హెడ్స్‌పై అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలు తర్వగా  పోతాయి .

కాఫీపౌడర్, విటమిన్‌ ఇ ఆయిల్  మరియు  చక్కెరను మిక్స్‌ చేసి ముఖంపై సర్క్యూలర్‌ మోషన్‌లో రుద్దడం వల్ల  చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది 

విటమిన్‌ ఇ  ఆయిల్ను ముఖంపై రుద్దడం వల్ల ముడతలు పడిన చర్మం బిగుతుగా మారి యవ్వనంగా కూడా  కనిపిస్తారు .

కళ్ల చుట్టూ విటమిన్ ఇ ఆయిల్‌తో రాత్రి పడుకునే ముందు మసాజ్‌ చేయడం వల్ల  డార్క్‌ సర్కిల్స్‌ మాయమవుతాయి.