శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?

శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?

పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసినప్పటికీ, మధ్యాహ్నానికి శరీరం నుంచి వచ్ఛే చెమట వాసన చాలా ఇబ్బందిపెడుతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసనను పొగొట్టడానికి  ఈ క్రీంది చిట్కాలను పాటిస్తే చాలా మంచి ప్రభావం కూడా  కనిపిస్తుంది.

శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?

 

  •  ఒక బకెట్ నీళ్లలో  టేబుల్ స్పూన్ తేనెను కలిపి, ఆ నీటితో స్నానం చేయండి. చెమట కానీ, చెమట నుండి  వచ్ఛే వాసన కానీ మీకు  రాదు .
  •  వేసవిలో ఎక్కువ భాగం కాటన్ దుస్తులను ధరించడం వల్ల శరీరానికి బాగా గాలి అందుతుంది. ఫలితంగా దుర్వాసన మీకు  రాదు.
  • టీ, కాఫీలు చెమట ఉత్పత్తికి కారకాలు. కాబట్టి చెమట వాసన నుంచి తప్పించుకోవడానికి టీ, కాఫీలకు  చాల దూరంగా ఉండండి.
  •  రోజువారీ తీసుకునే ఆహారంలో 20 శాతం మాంసకృతులు, 20 శాతం నూనెలు, కొవ్వు పదార్థాలు మరియు  పండ్లు ఉంటే చెమటను దూరం చేసుకోవచ్చ్చును .
  •  స్నానపు నీటిలో ఉడికించిన పుదినా ఆకులను వేసి స్నానం చేస్తే చర్మం ఎక్కువసేపు తాజాగా  కూడా ఉంటుంది.
  •  సోంపు గింజలు నోటినే కాకుండా శరీర వాసన  రాకుండా    చాల ప్రభావితం చేస్తాయి. రోజూ ఒక స్పూన్ సోంపు గింజలను తినడం చాల  మంచిది .

Leave a Comment