ముక్కోటినాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ?

 ముక్కోటినాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ?

 

 ముక్కోటి రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్య ఫలం. మనకు ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకొని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం. ముక్కోటినాడు ముక్కోటి వ్యవహారాలున్నా మానుకొని శ్రీమహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతలూ దీవిస్తారు. –