...

Bellam Annam :ఎంతో ఆరోగ్యకరమైన వంటకం బెల్లం అన్నం ఎలా చేయాలి

Bellam Annam :ఎంతో ఆరోగ్యకరమైన వంటకం బెల్లం అన్నం ఎలా చేయాలి

Bellam Annam :మ‌నం వంటింట్లో ఉండే బెల్లాన్ని ఉప‌యోగించి అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం.తీపి పదార్థాలను తయారు చేసేటప్పుడు పంచదారకు బదులుగా బెల్లం వాడటం మన మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మన శరీరానికి కావలసిన పోషకాలు కూడా బెల్లం పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి మరియు మలబద్ధకం కోసం బెల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

బెల్లం శరీరంలోని అదనపు వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. బెల్లంతో చేసే తీపి వంటకాలలో బెల్లం అన్నం ఒకటి. ఇది సిద్ధం చేయడం చాలా సులభం. రుచికరమైన బెల్లం అన్నం తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము .

 

Bellam Annam :ఎంతో ఆరోగ్యకరమైన వంటకం బెల్లం అన్నం ఎలా చేయాలి

 

బెల్లం అన్నం తయారీకి కావలసిన పదార్థాలు:-

బియ్యం – 1 కప్పు,
తురిమిన బెల్లం- ఒకటిన్నర కప్పులు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
నీరు- నాలుగు కప్పులు
పాలు- 2 కప్పులు
నెయ్యి -2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము- 2 టేబుల్ స్పూన్లు,
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – 1/4 టీస్పూన్
యాలకుల పొడి -పావు టీస్పూన్.

Bellam Annam :ఎంతో ఆరోగ్యకరమైన వంటకం బెల్లం అన్నం ఎలా చేయాలి

బెల్లం అన్నం తయారు చేసే విధానం :-

ఒక క‌డాయిలో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన త‌రువాత ఎండు కొబ్బ‌రి ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత జీడిప‌ప్పును మరియు ఎండు ద్రాక్ష‌ను కూడా వేసి వేయించి ప‌క్క‌న‌ పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం, శ‌న‌గ‌ప‌ప్పును నీళ్లు పోసి క‌డిగి బాగా
శుభ్రం చేయాలి. తరువాత ఆ మిశ్రమానికి నీళ్ల‌ను, పాల‌ను పోసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా అయ్యాక వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలతో పాటు డ్రై ఫ్రూట్స్, బెల్లం, కొబ్బరి ముక్కలను వేసి కరిగే వరకు బాగా కలపాలి.

యాలకుల పొడి మరియు ఉప్పు వేసి, బాగా కలపి తరువాత మంటను ఆపివేయండి. ఈ విధంగా రుచికరమైన బెల్లం అన్నం తయారు చేసుకోవచ్చును . తీపి తినాల‌నిపించిన‌ప్పుడు చాలా సులువుగా త‌యార‌య్యే బెల్లం అన్నాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Sharing Is Caring: