విటమిన్ A ప్రాముఖ్యత
A విటమిన్ లోపిస్తే:
A విటమిన్ లోపిస్తే ఎముకలు పెరగవు. దంతాలు బలహీనంగా తయారవుతాయి. శ్వాసకోశ సమస్యలు, మూత్రాశయ సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ బలహీనమైపోతుంది. గర్భవతులు A విటమిన్ సరిగా తీసుకోకపోతే పుట్టబోయే పిల్లల కంటిచూపు సరిగా ఉండదు. చర్మం పొడిబారిపోతుంది. చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. అన్నింటికంటే ముక్యంగా కంటిచూపు మందగిస్తుంది. ఎక్కువకాలం కొనసాగితే శుక్లాలు వచ్చి కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. ఇంకా రేచీకటి కూడా వస్తుంది.
A విటమిన్ లోపిస్తే చర్మం, వక్షోజాలు, ఊపిరితిత్తులు మరియు మూత్రాశయ, అండాశయ కాన్సర్ వచ్చే చాలా అవకాశాలున్నాయి.
A విటమిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు:
పాలు, పాల ఉత్పత్తులు, చిలగడదుంప, క్యారెట్, మూలగాకు, ఆకుకూరలు, ఆప్రికాట్స్, బ్రోకలీ, కోడిగుడ్లు, చేపలు, మటన్ , మామిడిపండ్లు, బొప్పాయి పండ్లు, ఆపిల్, టోమాటో, స్ట్రాబెర్రీస్, బాదాం పప్పు, పొద్దుతిరుగుడు గింజలు(పూల్ మఖాన), ఆలివ్ ఆయిల్, కర్బూజ, చిక్కుడుజాతి గింజలు తదితర వాటిలో A విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
A విటమిన్ ఎక్కువైతే:
వికారం, ఆకలి లేకపోవటం, పచ్చకామెర్లు మరియు వాంతులు, వెంట్రుకలు రాలటం వంటివి కూడా జరుగుతాయి.
A విటమిన్ టాబ్లెట్స్ ఎవరు తీసుకోకూడదు:
మద్యం సేవిచేవారు A విటమిన్ టాబ్లెట్స్ వేసుకోకూడదు. కాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేవారు A విటమిన్ టాబ్లెట్స్ తీసుకోకూడదు. ఈ టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలి.
Health Tips
మరింత సమాచారం కోసం :-
.......
Post a Comment