శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం

_*🚩అయ్యప్ప చరితం - 69 వ అధ్యాయం🚩*_

🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️

ఆభరణాలున్న పెట్టెలు తీసుకుని శరంగుత్తి చేరుకునే సమయానికి ఆలయ ప్రధాన పూజారి , ఆలయ నిర్వాహకులు కొందరు కలిసి వాళ్ళకు మేళతాళాలతో స్వాగతం పలికి పెట్టెలను భక్తిపూర్వకంగా అందుకుని గుడిని చేరుకుంటారు ! తెర వేసి ప్రధాన తంత్రి (మేల్‌శాంతి) ఆభరణాలను స్వామి విగ్రహానికి అలంకరిస్తారు ! తెర తీసాక ఆభరణాలతో దివ్యంగా వెలుగుతూ దర్శనమిస్తుంది స్వామి విగ్రహం.


శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం

*కాంతిమలలో జ్యోతి దర్శనం*

మకర సంక్రాంతినాడు సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించుతాడు ! ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమౌతుంది ! ఈ మహిమాన్వితమైన రోజున అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో దర్శనమివ్వడం భక్తులపై స్వామి అనుగ్రహానికి నిదర్శనం ! పందలరాజుకిచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఈ రోజున స్వామి జ్యోతిరూపంలో శబరిమలకు ఎదురుగా వున్న కాంతిమల మీద జ్యోతిగా సాక్షాత్కరిస్తాడు !

*కాంతిమల ప్రాముఖ్యం*

ఆభరణాలు అలంకరించి , పూజాదికాలు జరిపి , ప్రదోషకాలంలో శబరిమల మీద స్వామికి హారతి ఇస్తారు ! ఆ సమయంలోనే ఎదురుగా దూరాన వున్న కాంతిమల మీద జ్యోతిగా దర్శనమిస్తాడు మన అయ్యప్పస్వామి ! ఒక్క క్షణం మెరిసి మాయమైపోతూ కొన్ని క్షణాల పాటు జ్యోతి కనబడుతూ ఉంటుంది. ఉత్తరా నక్షత్రం (స్వామి జన్మ నక్షత్రం) కూడా ఆకాశంలో కనిపిస్తుంది ! జ్యోతిని దర్శించి *‘స్వామియే శరణం అయ్యప్ప’* అంటూ భక్తులు చేసే శరణుఘోషతో శబరిమల ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తూ వుంటుంది!

*కాంతిమలమీద జ్యోతి కనిపించడానికి కారణం:*

కాంతిమలలో ఆ ప్రాంతాన్ని పొన్నాంబలమేడు అంటారు ! మహిషిని సంహరించడానికి స్వామి అరణ్యంలోకి వచ్చినపుడు ఇంద్రుడు స్వామి కోసం ఈ ప్రాంతంలో బంగారు ఆలయం నిర్మించి పద్ధెనిమిది మంది దేవతలను మెట్లుగా అమర్చి , వాటిమీదుగా ఎక్కి వచ్చి స్వామి కూర్చోవడానికి జ్ఞానపీఠాన్ని ఏర్పరుస్తాడు ! దానిమీద చిన్ముద్ర , అభయ ముద్రలతో , పట్టబంధం తో ఆసీనుడై దేవతల పూజలు స్వీకరిస్తాడు స్వామి !  దేవతల ప్రార్థనతో రోజూ ఆ ఆలయంలో వారి పూజాదికాలు స్వీకరించసాగాడు ! ఉదయాస్తమయాలలో హారతి ఇచ్చి ధన్యులు కాసాగారు దేవతలు ! ఈ ఆలయం మానవుల కళ్లకు కనిపించదు ! కానీ అటువంటి ఆలయం మానవులకోసం వెలవాలన్న సంకల్పంతో స్వామి పందలరాజుకు స్వప్నంలో ఈ ఆలయాన్ని చూపి అదే విధంగా శబరిమల మీద దేవశిల్పి , పరశురాములవారి సహాయంతో నిర్మింపజేస్తాడు అయ్యప్ప ! అక్కడా విగ్రహ రూపంలో పూజింపబడుతున్నాడు ! శబరిమల మీద వున్న ఆలయంలో మానవుల చేత విగ్రహ రూపంలో , కాంతిమల మీద ప్రత్యక్షంగా దేవతల చేత ఆరాధింపబడుతున్నాడు !  దేవతలకు ఒక్క రోజు భూలోకంలో ఒక్క సంవత్సరానికి సమానం ! అందుకే ప్రతి ఏటా మకర సంక్రమణం రోజు దేవతలు సాయంకాలం  హారతి ఇస్తున్న సమయంలో భూలోకవాసులకు జ్యోతి రూపంలో దర్శనమివ్వడం జరుగుతున్నది ! ఆ జ్యోతిని దర్శించి , శబరిమలమీద ఆలయంలో హారతి కళ్లకద్దుకుని జన్మలు ధన్యం కావించుకుంటారు భక్తజన సందోహం !
మకర విళక్కు ఉత్సవం
మకరజ్యోతిని దర్శించిన తర్వాత ఆ రాత్రి శబరిగిరిలో జరిగే ప్రధాన ఉత్సవం మకర విళక్కు ఉత్సవాన్ని చూడటానికి ఉత్సాహంతో ఎదురుచూస్తారు భక్తులు !

ఆ రాత్రి మాళికాపురత్తమ్మ ఆలయంనుండి అమ్మవారి పట్టపుటేనుగు మీద దీపాన్ని వెలిగించి ఉత్సవంగా ముందర ఆలయానికి ప్రదక్షిణలు చేయించి శరంగుత్తి వరకు కోలాహలంగా తీసుకువెళుతారు ! భక్తులందరూ భజనలు చేస్తూ ఏనుగు వెంట వెళతారు ! ఏనుగు శరంగుత్తి దగ్గర కన్నీస్వాములు గ్రుచ్చిన శరాలను గుర్తించి , ఏనుగు తిరిగి అమ్మవారి గుడిని చేరి ఆ వార్తను విన్నవించడం జరుగుతుంది ! ఈ ఉత్సవం నిర్వహించడంలో వావరు వంశీయులు ఆయుధాలు పట్టుకుని వెంటవెళుతూ ఏ అడ్డంకులూ రాకుండా చూస్తారు !

మకరజ్యోతి దర్శనం తర్వాత ఈ మకర విళక్కును దర్శించడంవల్ల యాత్ర పూర్ణ ఫలం లభిస్తుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసం !
తిరుగు ప్రయాణం
శబరిమలను మర్నాడు ప్రొద్దుననే దిగటం ప్రారంభించి పంబానదిని చేరి నీటిలో స్నానం ఆచరిస్తారు భక్తులందరూ ! పాపవినాశిని అయిన పంబాస్నానంతో పునీతులై , అనంతమైన పుణ్యఫలాన్ని పొంది , యాత్ర సఫలమైందన్న తృప్తితో స్వస్థానాలకు బయలుదేరుతారు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Sabarimala Ayyappa Swamy

  అయ్యప్ప అంటే ఎవరు?    
 అయ్యప్పస్వామి మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు 
శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా
శబరిమల యాత్ర విశేషాలు
🕉️శబరిమల అయ్యప్ప స్వామి వారి మండల కాల దీక్ష నియమాలు🕉️
అయ్యప్ప స్వామి మండల కాల దీక్ష🚩🕉️
అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?
అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు
అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ
అయ్యప్పస్వామి అభిషేకాలు - వాటి ఫలితాలు
అయ్యప్పస్వామి దీక్ష లొ వ్రత నియమాలు గురు ప్రార్థన
శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి
  అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం  
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
శబరిమల‌ అయ్యప్పస్వామి ఇరుముడి ప్రాశస్త్యం ఇరుముడి వివరణ
అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం
అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో ఆర్యన్‌గావ్ | అచ్చన్ కోవిల్ | ఎరుమేలి | శబరిమల
అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు
అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు
మాలికాపురత్తమ్మ ఆలయం శబరిమలై పూర్తి వివరాలు
శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం
అయ్యప్ప దీక్ష విరమణ
కార్తీక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి
  అయ్యప్ప అంటే ఎవరు? దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ  
గాయత్రీ మంత్రం రహస్యం
కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?
కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post