డాక్టర్ రాపోలు సత్యనారాయణ జీవిత చరిత్ర

డాక్టర్ రాపోలు సత్యనారాయణ జీవిత చరిత్ర

ఫార్మసీ నా శ్వాస!
ఫార్మసీ రంగం నిత్య నూతనం!!

అందుకే తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ పోటీలోకి
వచ్చినాను.

దిగువ పొందుపరిచిన నా ఆలోచనలు తగుననిపిస్తే
నన్ను ఆశీర్వదించి, మీ ప్రతినిధిగా నా పై భారం వేయ ప్రార్థనలతో

మీ
డాక్టర్ రాపోలు సత్యనారాయణ

ఫార్మసిస్ట్ పదం నాకు చాలా ఇష్టం. హెల్త్ ప్రొఫెషనల్ గా నాకు గుర్తింపును, ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది. గుల్బర్గా లోని లుఖ్మాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో డి ఫార్మ్ కాలేజ్ టాపర్ ను. మా ఊరిలో నేను మొదటి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ను. అనంతరం నా ఫార్మసీ డిప్లొమాతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 గా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఓపెన్ కాంపిటీషన్ లో మొదటి స్థానం.
ఉద్యోగంలో చేరిన తరువాత అధికారులు, సహోద్యోగులు, ప్రజలలో ఫార్మసిస్ట్ హోదా పట్ల సరియైన అవగాహన లేదని అర్థం అయింది. ఫార్మసిస్ట్ ఔషధ నిపుణుడు, ఔషధ ప్రయోక్త. హెల్త్ కేర్ టీమ్ లో ముఖ్యమైన సభ్యుడు. కాని, వారికి ఫార్మసిస్ట్ అంటే స్టోర్ కీపర్, చిట్టీ చూసి మందులు ఇచ్చే సహాయకుడు అని తేలిక భావం. వారి దృష్టిలో అక్షరాలు తెలిసిన అటెండర్ అయినా చేయగలిగిన ప్రాధాన్యత లేని పని. కాంపౌండర్ అని పిలిచే వారు. ఫార్మసిస్ట్ అనాలంటే ఫార్మసిస్టర్ అని వింతగా పలికే వారు. నర్స్ లు, ఏఎన్ఎం లు బ్రదర్ అనే వారు. “మేల్ నర్స్ లను బ్రదర్ అంటరు. ఫార్మసిస్ట్ లను బ్రదర్ అనకూడదు” అని చెప్పే వాడిని. ఫార్మసిస్ట్ గా నా విషయ పరిజ్ఞానం, వివరించే విధానం, క్లినికల్ స్కిల్స్, పని పట్ల నిబద్ధత, ఆత్మ గౌరవంతో కూడిన ప్రవర్తన, వృత్తిసంబంధిత అంశాలపై పత్రికా రచన నా ఉనికిని నిలబెట్టినయి.
సహ ఫార్మసిస్ట్ లు జ్ఞాన ప్రవీణులైనప్పటికి వ్యవస్థ బలీయతకు తల ఒగ్గి తమకు తాము ఆ మూసకు అనుగుణంగా ఒదిగి ఉంటున్నట్టు అర్థమైంది.

నా విద్యార్హతలు పెంచుకోవాలని భావించిన. ఫార్మసీలో దూర విద్య ద్వారా కోర్స్ లు లేవు.
ఆరోగ్య రంగానికి చెందిన ఇతర కోర్స్ లను చదివిన. యూనియన్ సభలు, వృత్తి సమావేశాలు ఎక్కడ జరిగినా హాజరు అయ్యే అలవాటు చేసుకున్నా. వేరు వేరు చోట్ల ఉన్న ఫార్మసిస్ట్ ల సమస్యలు తెలుసుకున్నా .
భావ సారూప్యం ఉన్న మిత్రులతో “వర్కింగ్ గ్రూప్ ఆన్ ప్రొఫెషనల్ డిగ్నిటీ ఆఫ్ ఫార్మసిస్ట్స్” అనే సమూహాన్ని ఏర్పాటు చేసిన. దాని పేరు మీద ఫార్మసిస్ట్ ల సమస్యలను పత్రికలకు వ్రాసేది, ప్రభుత్వాలకు నివేదించేది.

ది ఈస్టర్న్ ఫార్మసిస్ట్, ఇండియన్ ఫార్మసిస్ట్స్, ది ఇండియన్ ఫార్మసిస్ట్, ఫార్మా టైమ్స్, ఇండియన్ జర్నల్ ఆఫ్ హాస్పిటల్ ఫార్మసి, ఎంప్లాయీస్ వాయిస్ వంటి మాగజైన్ లు, పలు సూవెనిర్ లు, ఇంగ్లిష్ తెలుగు పత్రికలు నా ఉత్తరాలను, వ్యాసాలను ప్రచురించినయి.

Read More  ఎలక్ట్రాన్ కనుగొన్న జోసెఫ్ జాన్ థామ్సన్ జీవిత చరిత్ర

ఫార్మసీ ప్రాక్టిషనర్ గా నేను వ్రాసిన సాధించిన కొన్ని అంశాలు మీకు తెలుపుతాను:

* ఫార్మసిస్ట్ – ది డాక్టర్ ఆఫ్ మెడిసిన్స్, విచ్ క్రాస్ ఫర్ ఫార్మసీ, రివాంపింగ్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్, రిఫార్మేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ – ఏ నీడ్ ఆఫ్ ది అవర్ వంటి వ్యాసాలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసినయి.

* మెడికల్ షాప్ ల ముందు రెండు మూడు దశాబ్దాల క్రితం రెడ్ క్రాస్ గుర్తు కనిపించేది. ఆ సమయంలో వ్యవసాయ శాస్త్రం చదివిన వారు గ్రీన్ క్రాస్ తమ గుర్తుగా ప్రచారం చేసుకొంటున్నరు. నేను వ్రాసిన లేఖలతో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఒక తీర్మానం చేసి సి డి ఎస్ సి ఓ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్స్, ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కు పంపింది. ఫలితంగా మెడికల్ షాప్ ల ముందు గ్రీన్ క్రాస్, ఏప్రన్ ధరించి విధుల నిర్వహణ కనిపిస్తున్నయి.

* ఫార్మసిస్ట్ – ది డాక్టర్ ఆఫ్ మెడిసిన్స్ ప్రేరణతో ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల, గోవా లో ఫార్మసిస్ట్ లు తమ పేరు ముందు Dr పెట్టుకొంటున్నరు. మధ్యే మార్గంగా డాక్టర్ సింగనమల సుమన్ సూచించిన Drx ప్రచారం లోనికి వచ్చింది.

* ఔషధ మరియు ఫార్మసీ చట్టాలలో చేయవలసిన సవరణలను ప్రభుత్వానికి లేఖలు వ్రాసి పత్రికల ద్వారా ప్రకటించినాను.

* మెడికల్ ఆఫీసర్స్ కు ఉండే సర్జన్ రాంక్ బ్రిటిష్ కాలంలో అపోతెకరీ లకు కూడా వర్తించేది. అదే విధంగా ప్రస్తుతం ఫార్మసిస్ట్ లకు రాంకింగ్ విధానం వర్తింప చేయాలని ప్రతిపాదన చేసినాను.

* మెడికల్ ప్రాక్టిషనర్ లకు ప్రభుత్వ ఉద్యోగంలో మెడికల్ ఆఫీసర్ అని హోదా ఉన్నట్టు ఫార్మసిస్ట్ లకు ఫార్మసీ ఆఫీసర్ అని మార్చటానికి ప్రతిపాదించినాను. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్పు చేసినయి.

* ఔషధాలు ఉన్న ప్రతి చోట ఫార్మసిస్ట్ లను నియమించాలె.

* ఫార్మసిస్ట్ లను సెకండరీ ప్రిస్క్రైబర్స్ గా గుర్తించాలె.

* సర్వీస్ లో ఉన్న డిప్లొమా ఫార్మసిస్ట్స్ విద్యార్హతను ఉన్నతీకరించు కొనటానికి ఫార్మసీ కౌన్సిల్ ప్రవేశపెట్టిన బి ఫార్మ్ (ప్రాక్టీస్) ను ప్రోత్సహించాలె.

* ప్రభుత్వ ఫార్మసిస్ట్స్ కు వేతనంతో కూడిన స్టడీ లీవ్ ఈయాలె.

* ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ లకు డైరెక్టరేట్ స్థాయి పదవి ఏర్పరచాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాను.

* పబ్లిక్ హెల్త్, డైటెటిక్స్, న్యూట్రిషన్ వంటి కోర్స్ ల ప్రవేశ ప్రకటనలలో ఫార్మసీ అర్హతలను చేర్చాలె.

* నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క టీచర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ లో ఫార్మసీ అర్హతలను చేర్చి ఫార్మకాలజీ విభాగంలో ఫార్మసిస్ట్స్ ను కూడా ప్రొఫెసర్స్ గా నియమించాలె.

* అన్ని మెడికల్ కాలేజ్ లలో, హాస్పిటల్స్ లో పూర్తి స్థాయి హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ లు నెలకొల్పి, ఫార్మసిస్ట్స్ కు బోధనా హోదాలు, రాంక్ లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను.

Read More  డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ జీవిత చరిత్ర ,Biography Of Dr. Shanti Swarup Bhatnagar

* ఫార్మా సిటీలో ప్రభుత్వ రంగ ఔషధ పరిశ్రమ నెలకొల్పాలె.

* ఔషధ పరిశ్రమలో ఇతర అర్హతలు ఉన్న వారు పని చేసినా, వారు ఫార్మసిస్ట్స్ పర్యవేక్షణలో ఉండాలె.

* ఫార్మ్ డి అర్హతను ఉద్యోగ ప్రకటనలలో చేర్చటానికి నా వంతు కృషి ఉంది.
ఫార్మ్ డి తరువాత చదువటానికి పిఎచ్ డి మాత్రమే ఉన్నందున, సూపర్ స్పెషాలిటీ క్లినికల్ కోర్స్ లు వెంటనే ప్రారంభించ వలసిన అవసరాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాను.
ప్రవేశాలను నీట్ ద్వారా చేపట్టాలని ప్రతిపాదిస్తున్నాను.

* ఫార్మ్ డి పట్టభద్రులు ఉపాధి కోసం కమ్యూనిటీ ఫార్మసీ సహా అవకాశం ఉన్న అన్ని సెక్టార్ లలో చొచ్చుకొని పోవాలె.

* డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్ గా ఫార్మసీ అర్హతలు ఉన్న వారినే నియమించాలె. ప్రభుత్వం ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించా లనుకొంటే డైరెక్టర్ జనరల్ అనే హోదా ఈయవచ్చు.

* ఫార్మసీ విద్యావంతులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ పథకాలలో ఆర్థిక సహకారం అందించి సొంత మెడికల్ స్టోర్స్, పరిశ్రమలు పెట్టుకొనే విధంగా ప్రోత్సహించాలె.

* జన ఔషధీ స్టోర్స్ ను ఫార్మసిస్ట్స్ కే కేటాయించాలె. చైన్ ఫార్మసీ లు, ఇతర రిటైల్ ఫార్మసీ లలో సహాయకులుగా కూడా ఫార్మసీ చదివిన వారినే తీసుకొంటూ, కమ్యూనిటీ ఫార్మసీ ని ప్రొఫెషనలైజ్ చేయాలె.

* ఫార్మసిస్ట్స్ పని ఒత్తిడి వృత్తి జీవితం మీద పరిశోధన చేసి “స్ట్రెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అమాంగ్ హాస్పిటల్ ఫార్మసిస్ట్స్ ఇన్ ఇండియా” పేరుతో పుస్తకాన్ని ప్రచురించిన. ఇది ఫార్మసిస్ట్స్ మీద దేశంలో తొలి పరిశోధన. ఫార్మసిస్ట్స్ కు గుర్తింపు, గౌరవం తెచ్చే సూచనలు ఇందులో ఉన్నాయి.

* వైద్య ఆరోగ్య రంగ విద్యా విధానంలో తేవలసిన మార్పులను తెలుపుతూ వ్రాసిన మరొక గ్రంథం “రిఫార్మేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా”. అబ్రహాం ఫ్లెక్స్నర్ అమెరికాలో అధ్యయనం చేసి 1912లో ప్రకటించిన రిపోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైద్యవిద్యకు మార్గదర్శిగా నిలిచింది. సరిగ్గా శతాబ్దం తరువాత 2012లో మన దేశానికి కావలసిన వైద్య విద్య కోసం నేను వెలువరించిన సిద్ధాంత గ్రంథం ఇది.
హైదరాబాద్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ లోనూ, ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా చేతుల మీద ఆవిష్కరణ అయింది. ఆయనతో జరిపిన చర్చల ఫలితంగా జాతీయ ఆరోగ్య విధానంలో మొదటి సారి ఫార్మసిస్ట్ పదం కనిపించింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే భావన, దానికి అర్హులుగా ఫార్మసిస్ట్ చేర్పు జరిగింది.

* ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఏ), ఇండియన్ హాస్పిటల్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ (ఐ ఎచ్ పి ఏ), ఇండియన్ ఫార్మకోలాజికల్ సొసైటీ (ఐ పి ఎస్), ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐ పి ఎచ్ ఏ), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ ఆర్ ఎస్), ఇండియన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ (ఐ ఈ సి), అకాడమీ ఆఫ్ సైకాలజిస్ట్స్ (ఏ ఓ పి), హైదరాబాద్ సైకలాజికల్ అసోసియేషన్ (ఎచ్ పి ఏ) సంస్థలలో నేను ఆజీవ సభ్యత్వం కలిగి ఉన్నాను.

Read More  భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జీవిత చరిత్ర

* చికున్ గున్యా, హ్యాండ్ ఫూట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎచ్ ఎఫ్ ఎం డి), కోవిడ్ 19 తదితర వ్యాధులు ప్రబలినప్పుడు మార్గదర్శకాలు రూపొందించి ప్రచారం చేసినాను.

* ఔషధాల సహేతుక వినియోగం, ఆంటీ బయోటిక్స్ వివేచనాయుత వినియోగం మీద చైతన్య పరుస్తున్నాను.

* నేషనల్ ఫార్మసీ వీక్, వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే, ఇతర ఆరోగ్య ప్రాధాన్యత కలిగిన సందర్భాలకు వ్యాసాలు వ్రాసి తోటి హెల్త్ ప్రొఫెషనల్స్ కు, ప్రభుత్వ నేతలకు, అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను.

ఇంక ఫార్మసీ కౌన్సిల్ విషయానికి వస్తే,

* మెడికల్ కౌన్సిల్ తో సమానమైన ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఫార్మసీ కౌన్సిల్. అధ్యయన కమిటీ ల నివేదికలు కూడా పేర్కొన్న అంశం ఇది. ఫార్మసీ కౌన్సిల్ మెడికల్, డెంటల్, నర్సింగ్ వంటి ఇతర ప్రొఫెషనల్ కౌన్సిల్స్ తో, ప్రభుత్వ శాఖలలో తరచూ సమావేశమై ఫార్మసిస్ట్స్ వృత్తి గౌరవం ఇనుమడించే విధంగా కృషి చేయాలె.

* ఔషధ విజ్ఞానం బాగా పెరిగి సంక్లిష్టమైన దశలో అన్ని మెడికల్ కాలేజ్ లలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ ప్రారంభించటానికి ప్రభుత్వాన్ని, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టరేట్ ను ఒప్పించాలె.

* డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలె. డ్రగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను ప్రచురించాలె.

* నియమిత వ్యవధిలో కంటిన్యూయింగ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించాలె.

* రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్స్ కు ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలె.

* కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ విభాగం ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అన్వేషణలో ఉన్న ఫార్మసిస్ట్స్ కు తోడ్పడాలె.

* ప్రభుత్వ శాఖల ఫార్మసిస్ట్స్ నియామక అర్హతలను ఫార్మసీ కౌన్సిల్ తాజా ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ ప్రకారం సవరణ చేయించాలె.

* కౌన్సిల్ కృత్యాలలో మరింత పారదర్శకత ఉండే విధంగా తగిన మార్పు చేర్పులు చేయాలె.

* తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఫార్మసీ కౌన్సిల్ ఆస్తుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చి కార్యాలయాన్ని సొంత భవనం లోనికి మార్చాలె.

స్వరాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ మొదటి ఎన్నికలు జరుగుతున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా ఫార్మసీ సేవకు అంకితమైన నేను ఈ ఎన్నికలలో మొదటి నామినేషన్ వేసినాను. ఆరుగురు సభ్యులను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకొన వలసి ఉన్నది. నాకు మీ వోట్ వేసి మీ ప్రతినిధిగా ఫార్మసీ కౌన్సిల్ కు పంపమని మనవి. ఫార్మసిస్ట్స్ సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా నా శక్తి మేరకు వాటి పరిష్కారానికి కృషి చేయగలనని అంతఃకరణ శుద్ధిగా తెలుపుతున్నాను.

ఫార్మసీ సేవలో సదా మీ

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
BSc, DPharm, MA (Psy), PGDHFWPE, MPhil (Psy), MHSc (PH), MIPHA, PhD (ODE)

Sharing Is Caring: