సేమియా చికెన్ దమ్ బిర్యాని వండటం తెలుగులో

సేమియా చికెన్ దమ్ బిర్యాని వండటం తెలుగులో

కావలసిన పదార్థాలు:

చికెన్: పావుకిలో
సేమియా: అరకిలో
అల్లంవెల్లుల్లి ముద్ద: పావుకప్పు
గరంమసాలా: మూడు చెంచాలు
బిర్యాని ఆకు: కొద్దిగా
కారం: రెండు చెంచాలు
ఉల్లిపాయ, కొబ్బరి కలిపిన మిశ్రమం: రెండు చెంచాలు
కొత్తిమీర, పుదీనా తురుము: రెండు చెంచాల చొప్పున
ఉప్పు: మూడు చెంచాలు

తయారీ:

వెడల్పాటి గిన్నెలో చికెన్ తీసుకుని సేమియా తప్ప పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ బాగా కలిపి మూతపెట్టేయాలి. గంటసేపు అలాగే వదిలేస్తే, మసాలా చికెన్కు పడుతుంది. ఇప్పుడు కాస్త దళసరిగాఉన్న బాణలి తీసుకుని అందులో చికెన్ మిశ్రమాన్ని పరిచినట్టు చేసి, పైన వేయించిన సేమియాను పరవాలి. సన్నని మంటపై కాసేపు ఉంచి పది నిమిషాలయ్యాక మూతతీసి మొత్తం కలిపి అరగ్లాసు నీళ్లు చల్లి, మళ్లీ మూతపెట్టేయాలి. కాసేపటికి సేమియా మగ్గుతుంది. దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో అలంకరింస్తే సరి.

Read More  ఘుమ ఘుమ‌ లాడే ఆలూ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం
Sharing Is Caring:

Leave a Comment