అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు

_*?అయ్యప్ప చరితం – 49 వ అధ్యాయం?*_
?☘?☘?☘?☘?☘?
ఉదయ , సాయంకాల సమయాలలో దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేయాలి !.
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు

 

*కర్మేంద్రియాలు -* 
మాట్లాడే నాలుక , పనులు చేసే చేతులు , నడిపించే కాళ్లు , గుహ్యం (పురుషాంగం) , గుదం (విసర్జన అంగం) అనబడే ఐదు కర్మేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని వాటి చేత మంచి పనులు చేయించడం దీక్షా నియమాల ముఖ్యోద్దేశం .
నాలుక మాట్లాడటానికి సహకరించే కర్మేంద్రియం ! అట్లాగే రుచిని తెలిపే జ్ఞానేంద్రియం కూడా !
దీక్షాకాలంలో నాలుకను అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం ! అందువల్ల మాటల చేత , తినడం చేత జరిగే తప్పులను , పొరబాట్లను అరికట్టడం జరుగుతుంది ! కోపాన్ని విడిచి , శాంతంగా వుండాలి .
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
వాక్కుకు సంబంధించి దీక్షాకాలంలో మితంగా , మృదువుగా మాట్లాడటం అలవర్చుకోవాలి ! సత్యం మాట్లాడాలి ! సౌమ్యంగా , ఇతరులను సంతోషపెట్టేలా మాట్లాడాలి .
అనవసరపు మాటలు , అబద్ధాలు చెప్పడం , ఇతరులను నొప్పించేలా మాట్లాడటం , వివాదాలు , తగవులుపడటం , ఇతరులను దూషించడం దీక్షాకాలంలో చేయకూడదు .
భగవద్భక్తిని కలిగించే పుస్తకాలు , నీతి బోధకాలైన పుస్తకాలు చదవాలి !  చేతులు మంచి కార్యాలు – దానధర్మాలు  చేయడానికి , స్వామి పూజకు ఉపయోగపడాలి ! జీవహింస , దొంగతనాలు , ఇతరులను కొట్టడం వంటి పనులు దీక్షాకాలంలో చేయరాదు.
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
పాదములు – దేవాలయాలను , పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కాలినడకన (శక్తినిబట్టి) వెళ్లడం మంచిది ! జూదగృహాలు , వేశ్యాగృహాలకు వెళ్లకూడదు !  దీక్షాకాలంలో బ్రహ్మచర్యాన్ని  విధిగా పాటించాలి ! వేశ్యలతో సంపర్కం , బలాత్కరించడం మొదలైన విషయాల గూర్చి ఆలోచించకూడదు ! కోరికలను అదుపులో ఉంచుకుని ఆస్ఖలిత బ్రహ్మచర్యాన్ని ( స్త్రీ సంబంధిత ఆలోచనలతో వీర్యస్ఞలనమవడం) పాటించడానికి ప్రయత్నిచాలి ! మనస్సు విషయవాంఛలవైపు పరిగెత్తకుండా ఉండటానికోసమే సాత్వికాహారం తీసుకోవాలన్న నియమం ఏర్పడింది.
*దమము:* ఆహార నియమాలు సక్రమంగా పాటించడంవల్ల విరేచనాలు మలబద్ధకం వంటిరోగాలకు గురికాకుండా శరీరారోగ్యాన్ని కాపాడుకోవచ్చును.
కర్మేంద్రియాలను నిగ్రహించడాన్ని దమము అంటారు.
జ్ఞానేంద్రియాలైన ముక్కు , చెవులు , కళ్లు , నాలుక , చర్మము వీటిని నియత్రించడాన్ని *‘శమము’* అంటారు .
*అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు.*
1. *చెవులు:* 
శబ్దాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు చెవులు ! దీక్షాకాలంలో చెవులను బ్రద్దలు చేసే పెద్ద పెద్ద శబ్దాలను , ఇంద్రియాలను ఉద్రేకపరిచే సంభాషణలను వినగూడదు ! మనస్సుకు శాంతిని ప్రసాదించే దైవ సంబంధిత పాటలను , పురాణాలను వినాలి ! శాస్ర్తీయ సంగీతాన్ని వినడంవల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది ;
2. *కళ్లు:* 
ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరిశీలనాగుణాన్ని అలవరచుకోవాలి ! విషాదకరమైన , భయానకమైన ,  దృశ్యాలనుర చూడకూడదు ! ఎటుచూసినా కళ్లకు స్వామి అయ్యప్ప గోచరించే స్థితికి మనస్సు , కళ్లు చేరుకోవడానికి దీక్షాకాలంలో సాధన చేయాలి !
3. *నాలుక:*
 రుచిని తెలియజేసే జ్ఞానేంద్రియం నాలుక ! దీక్షాకాలంలో అన్ని రకాల రుచులు కోరుకునే నాలుకను నియంత్రించి సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి ! తీపి , ఉప్పు , పులుపు , కారం , మసాలా దినుసులు లేని ఆహారం తినాలి ! అటుకులు , పాలు , పండ్లు స్వీకరించాలి
అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు
4. *ముక్కు:* 
వాసనను గ్రహించే జ్ఞానేంద్రియం ముక్కు ! దుర్వాసనలు వచ్చే అశున్ర వాతావరణంలో వుండకూడదు మనస్సుకు హాయిని , శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పూలతోటలలో తిరగడం , పూజకు పూలు సేకరించడం చేయాలి !
*చర్మము:* 
శరీరం అంతర్భాగాలను కప్పివుంచి , స్పర్శజ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానేంద్రియ చర్మం ! సౌందర్యం చర్మంవల్లనే కలుగుతుంది శరీరానికి ! చల్లని నీటితో రోజూ మూడుసార్లు స్నానం చేయడంవల్ల చర్మం పరిశుభ్రమైన హాయిని ప్రసాదిస్తుంది ! చర్మానికి హాని కలిగించే తైలాలు , లేపనాలు వాడకూడదు ! నలుగుపిండితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి ! అందంగా కనబడటాని ప్రాధాన్యతనివ్వకూడదు ! దీక్షాకాలంలో ముఖ క్షవరం , కేశఖండనం (జుత్తు కత్తిరించడం) గోళ్లు తీయడం చేయరాదు ! పాదరక్షలు వాడకూడదు .
దీక్షాకాలంలో శవాలను చూడరాదు ! బహిష్టు స్త్రీలను చూడరాదు ! పొరపాటున చూస్తే తలస్నానం చేసి , కర్పూరం వెలిగించి , శరణు ఘోష చేయాలి.
వ్రత దీక్షాకాలంలో దీక్షలో వున్న ఇతరులను *‘స్వామి’* అని , చిన్నపిల్లలను *‘మణికంఠ’* అని , స్త్రీలను ‘భగవతి’ అని పిలవాలి ! అయ్యప్ప స్వాములు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ముందు మూడుసార్లు *‘స్వామి శరణం’* అని చెప్పుకుని సంభాషణ పూర్తి అయిన తరువాత తిరిగి *‘స్వామి శరణం’* అని మూడుసార్లు చెప్పడం అలవర్చుకోవాలి .
Read More  అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?
Sharing Is Caring:

Leave a Comment