_*?అయ్యప్ప చరితం – 65 వ అధ్యాయం?*_
?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
ఆ కార్యక్రమం ముగిసాక గుడిలో స్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి , వావరు గుడికి ప్రదక్షిణలు చేస్తారు ! స్వామి ఆదేశం ప్రకారం వావర్ తమ వెంట అరణ్యమార్గంలో తోడుగా వుండి ప్రమాదాలు సంభవించకుండా చూస్తాడన్న విశ్వాసంతో అక్కడనుండి ముందుకు సాగి *‘పేరూరు తోడు’* అనే నదీ ప్రాంతాన్ని చేరుకుంటారు ! ఆ నది భక్తులు స్నానం ఆచరించడానికి వీలుగా కొండలమీది నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది ! ఇక్కడ స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలు ధరించి భక్తులు *‘కాళైకట్టె’* ప్రాంతాన్ని చేరుకుంటారు .
అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు
*కాళైకట్టె:*
ఆ ప్రాంత భాష అయిన మలయాళంలో *‘కాళై’* అంటే వృషభం అనీ , కట్టె అంటే కట్టివేయటం అనీ అర్థం !
మణికంఠుడు మహిషిని మర్దించే సమయంలో చూడటానికి వచ్చిన పరమేశ్వరుడు ఈ స్థలంలోనే తన నంది వాహనాన్ని కట్టివేసినట్లు ఇక్కడి స్థల పురాణం తెలుపుతున్నది ! ఇక్కడ వున్న పార్వతీ పరమేశ్వరులు , గణపతి , సుబ్రహ్మణ్యస్వామి , నాగరాజుల గుడులను దర్శించుకుని భక్తులు అక్కడికి దగ్గరలో వున్న అళుదానది దగ్గరకు చేరుకుని రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు ! వంట చేసుకుని తిని రాత్రంతా భజన చేస్తూ గడుపుతారు !
*అళుదానది:*
ఇది ఒక చిన్న జలప్రవాహం ! మహిషిని సంహరించడానికి మణికంఠుడు ఆమె శరీరాన్ని మర్దిస్తున్నపుడు జ్ఞానోదయమై తనకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటూ విషాదంతో కన్నీరు కారుస్తుంది మహిషి ! ఆ కన్నీరే అళుదా (కన్నీళ్ళు) నదిగా ఏర్పడిందని స్థల పురాణం తెలిజేస్తున్నది.
వనమూలికలు , ఔషధాల సారం గల ఈ అళుదానది నీటిలో స్నానం దేహానికి ఆరోగ్యాన్ని , మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాయి.
ఈ నదీ ప్రాంతంలోనే ఉదయనుడనే గజదొంగను చంపడానికి సైన్యాలతో బయలుదేరిన అయ్యప్ప విడిది చేసినట్లు కూడా *జానపదగాథలలో* తెలుపబడింది.
మర్నాడు పొద్దున అళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో నుండి రెండు రాళ్లను తీసుకుని వాటితో రెండవ రోజు ప్రయాణం మొదలుపెడతారు భక్తులు !
*రెండవ రోజు ప్రయాణం:*
అళుదానదీ స్నానం ముగించుకుని , అందులో నుండి రెండు రాళ్లు ఏరుకుని భద్రపరచుకుని అళుదామేడు అనే కొండ ప్రాంతాన్ని చేరుకుంటారు యాత్రికులు !
*అళుదామేడు:*
మేడు అంటే కొండ ! సుమారు 5 కి.మీ ఎతైన గుండ్రని రాళ్ళతో కూడిన ఈ కొండను శరణుఘోష చెప్పుకుంటూ ఎక్కుతారు యాత్రికులు. ఈ కొండ శిఖరానికి కొంచెం క్రిందగా *‘కళ్లడుంకుండ్రు’* అనే ప్రదేశం ఉన్నది !
అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు
*కళ్లడుంకుండ్రు:*
మహిషిని వధించి , ఆ శరీరాన్ని ఆకాశంపైకి విసురుతాడు మణికంఠుడు ! ఆ కళేబరం వచ్చి భూమిపై పడ్డ స్థలమే ఈ *‘కళ్లడుంకుండ్రు’గా* స్థల పురాణంలో తెలుపబడింది ! దేవతలు మహిషి కళేబరం మీద అళుదానది నుండి తీసిన రాళ్ళు విసిరి ఆ స్థలంలో సమాధి గావించారట. అందుకు గుర్తుగా భక్తులు అళుదానది నుండి ఏరుకుని తెచ్చిన రెండేసి రాళ్లను ఆ ప్రదేశంలో వుంచడం ఆచారంగా మారింది ! అక్కడ కర్పూర హారతులు ఇచ్చి నమస్కరించి ముందుకు సాగుతారు !
*ఇంజిపారకోట:*
అళుదామేడు శిఖరాన్ని ఇంజిపారకోట అంటారు! పూర్వం ఉదయనుడి కోట వుండిన స్థలంగా ఈ ప్రదేశం చెప్పబడింది ! ఇక్కడే అయ్యప్పస్వామి ఉదయనుడిని హతమార్చటం జరిగింది ! ఇక్కడ నీరు చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉండటంవల్ల భక్తులు కొంతసేపు విశ్రమించి కొండదిగటం ప్రారంభిస్తారు ! శరణుఘోష చెప్పుకుంటూ *‘కరిమలతోడు’* అనే ప్రదేశాన్ని చేరుకుంటారు !
*కరిమలత్తోడు:*
కరి అంటే ఏనుగు , మల అంటే కొండ , తోడు అంటే నీరు ! ఈ ప్రాంతమంతా ఏనుగులతో నిండి వుండటంవల్ల ఈ కొండ ప్రాంతానికి *‘కరిమల’* అనే పేరు వచ్చింది ! ఇక్కడి పిల్లకాలువలలో నీరు ప్రవహిస్తూ వుండటంవల్ల ఏనుగులు ఈ కాలవల దగ్గరకు వస్తుంటాయి. ఇక్కడ నీరు పాత్రలతో నింపుకుని నిటారుగా వున్న కొండను ఎక్కటం ప్రారంభిస్తారు భక్తులు ! సుమారు పది కి.మీ పైకి ఎక్కి వెళ్లి కొండ శిఖరం చేరుకుంటారు ! ఈ కొండ శిఖరాన్ని *‘కరిమల ఉచ్చ’* అని పిలుస్తారు. ఇక్కడ ఒక దివ్యమైన బావి , జలపాతం దర్శనమిస్తాయి ! బావిలో నీరు ఎప్పుడూ వూరుతూనే వుండటం ఆశ్చర్యకరంగా భావించబడుతున్నది ! వాటికి పసుపు , కుంకుమలు సమర్పించి , కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి నమస్కరించి అక్కడ ఏర్పరచిన హుండీలో డబ్బులు సమర్పించి నమస్కరిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు ! బస చేసే స్థలాలను *‘తావళం’* అంటారు !
*మూడవ రోజు ప్రయాణం:*
మూడవ రోజు ఉదయాన్నే భక్తులు కరిమలఉచ్ఛ నుండి దిగటం ప్రారంభిస్తారు. ఈ కొండ దిగటం కూడా ఎంతో కష్టం ! అయినా అయ్యప్ప శరణు ఘోష చెప్పుకుంటూ దిగి పెరియాన పట్టం అనే ప్రదేశాన్ని చేరుతారు.
*పెరియాన పట్టం:*
పెరి అంటే పెద్ద , యాన అంటే ఏనుగు , పట్టం అంటే స్థలం అని అర్థం మలయాళ భాషలో ! ఇక్కడ ఒక కాలువలో నీరు ప్రవహిస్తుంటుంది.
???????????